Kaliyugam Pattanam lo: మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో క‌లియుగం ప‌ట్ట‌ణంలో - రిలీజ్ డేట్ ఫిక్స్‌!-telugu movie kaliyugam pattanam lo to release in theaters on march 22nd ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kaliyugam Pattanam Lo: మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో క‌లియుగం ప‌ట్ట‌ణంలో - రిలీజ్ డేట్ ఫిక్స్‌!

Kaliyugam Pattanam lo: మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో క‌లియుగం ప‌ట్ట‌ణంలో - రిలీజ్ డేట్ ఫిక్స్‌!

Nelki Naresh Kumar HT Telugu
Feb 28, 2024 05:19 AM IST

Kaliyugam Pattanam lo: బ‌లగం రూపాల‌క్ష్మి, విశ్వ కార్తిక్, ఆయూషి పటేల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న క‌లియుగం ప‌ట్ట‌ణంలో మూవీ మార్చి 22న రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని జోజో లాలీ అమ్మ పాట‌ను విశ్వంభ‌ర ద‌ర్శ‌కుడు వ‌శిష్ట రిలీజ్ చేశాడు.

క‌లియుగం ప‌ట్ట‌ణంలో మూవీ
క‌లియుగం ప‌ట్ట‌ణంలో మూవీ

Kaliyugam Pattanam lo: బ‌ల‌గం సినిమాలో హీరో మేన‌త్త పాత్ర‌లో జీవించింది రూప‌ల‌క్ష్మి . ల‌చ్చవ్వ‌గా త‌న న‌ట‌న‌తో ఆడియెన్స్ చేత క‌న్నీళ్లు పెట్టించింది. రూప‌ల‌క్ష్మి ప్ర‌ధాన పాత్ర‌లో క‌లియుగం ప‌ట్ట‌ణంలో పేరుతో ఓ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో విశ్వ కార్తిక్, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. చిత్రా శుక్లా మ‌రో ముఖ్య పాత్ర‌ను పోషిస్తోంది. క‌లియుగం ప‌ట్ట‌ణంలో ఈ మూవీకి ర‌మాకాంత్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌తో పాటు కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లేను ఆయ‌నే అందిస్తోన్నారు. మార్చి 22నక‌లియుగం ప‌ట్ట‌ణంలో మూవీ రిలీజ్ కాబోతోంది.

మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ...

సరికొత్త పాయింట్‌తో చ‌క్క‌టి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా క‌లియుగం ప‌ట్ట‌ణంలో ఉండ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెలిపారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇద‌ని అన్నారు. ఈ సినిమాలోని 'జో జో లాలీ అమ్మ' పాటను విశ్వంభ‌ర డైరెక్ట‌ర్ వ‌శిష్ట రిలీజ్ చేశారు. మదర్ సెంటిమెంట్ తో పాట చాలా బాగుందని వ‌శిష్ట అన్నారు.

అనురాగ్ కుల‌క‌ర్ణి గాత్రం...

జోజో లాలీ అమ్మ పాట‌కు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాట‌కు అజయ్ అరసాద సంగీతం అందించారు. క‌లియుగం ప‌ట్ట‌ణంలో మూవీ షూటింగ్ పూర్తయింది. 45 రోజుల పాటు కడప జిల్లాలోనే షూటింగ్ మొత్తాన్ని పూర్తిచేశారు ప్ర‌స్తుతం క‌లియుగం ప‌ట్ట‌ణంలో మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.

ఆస్కార్ విన్న‌ర్‌...

ఈ సినిమాకు గ్యారీ బీహెచ్ ఎడిట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. హిట్‌, సైంధ‌వ్‌, క్ష‌ణం, ఎవ‌రుతో పాటు తెలుగులో ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాల‌కు గ్యారీ బీ హెచ్ ఎడిట‌ర్‌గా ప‌నిచేశాడు. నిఖిల్ హీరోగా న‌టించిన స్పై సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. క‌లియుగం ప‌ట్ట‌ణంలో సినిమాకు అజయ్ అరసాద సంగీతాన్ని అందించగా ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్, భాస్కర భట్ల సాహిత్యాన్ని అందించారు. చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా పని చేశారు. త్వరలోనే ఈ సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్ రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. క‌లియుగం ప‌ట్ట‌ణంలో మూవీని కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌ నిర్మిస్తున్నారు.

నేను శైల‌జ సినిమాతో...

రామ్ హీరోగా న‌టించిన నేను శైల‌జ మూవీలో క్రేజీ క్రేజీ ఫీలింగ్ అనే పాట‌లో త‌ళుక్కున మెరిసింది చిత్రా శుక్తా. మా అబ్బాయి, రంగుల రాట్నం, తెల్ల‌వారితే గురువారం, సిల్లీ ఫెలోస్‌తో పాటు తెలుగులో హీరోయిన్‌గా ప‌లు సినిమాలు చేసింది. హీరోయిన్‌గా ఈ సినిమాలేవి ఆమెకు విజ‌యాల్ని తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి. నా నా అనే సినిమాతో ఏడాదే చిత్రా శుక్తా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. మ‌రోవైపు బ‌ల‌గం కంటే ముందు రూపాల‌క్ష్మి తెలుగులో ప‌లు సినిమాల్లో త‌ల్లి పాత్ర‌ల‌తో పాటు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా క‌నిపించింది. బ‌లగం మాత్రం ఓవ‌ర్‌నైట్‌లో ఆమెను స్టార్‌ను చేసింది. సెంటిమెంట్ రోల్‌లో ఆమె న‌ట‌న‌కు తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు.

Whats_app_banner