Congress Indravelli Meeting : సీఎం రేవంత్ రెడ్డికి ఇంద్రవెల్లి సెంటిమెంట్, లోక్ సభ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారు-indravelli news in telugu cm revanth reddy starts districts tours with indravelli meeting ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Congress Indravelli Meeting : సీఎం రేవంత్ రెడ్డికి ఇంద్రవెల్లి సెంటిమెంట్, లోక్ సభ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారు

Congress Indravelli Meeting : సీఎం రేవంత్ రెడ్డికి ఇంద్రవెల్లి సెంటిమెంట్, లోక్ సభ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారు

HT Telugu Desk HT Telugu
Jan 30, 2024 10:48 PM IST

Congress Indravelli Meeting : సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఇంద్రవెల్లి నుంచి ప్రారంభం కానుంది. పార్లమెంట ఎన్నికల ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి సభతో ప్రారంభించనున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

Congress Indravelli Meeting : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇంద్రవెల్లి సభ సెంటిమెంట్ గా మారింది. గతంలో దళిత గిరిజన దండోరా కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులుగా పాల్గొన్నారు. ప్రస్తుతం మరోసారి ఇంద్రవెల్లి సభకు సీఎం హోదాలో హాజరుకానున్నానరు. దళిత గిరిజన దండోరా కార్యక్రమం విజయవంతమైన విషయం తెలిసిందే. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో జిల్లాల పర్యటన చేస్తున్న నేపథ్యంలో సెంటిమెంట్ గా భావించిన ఇంద్రవెల్లి నుంచి ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో, డీసీసీ అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించుకున్నారు. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి సభ ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గంలో ఇంద్రవెల్లిలో స్థానిక ఎమ్మెల్యే వెడమా బుజ్జి పటేల్, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు హరి రావు, మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులు సీఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. గతంలో దళిత గిరిజన దండోరా ఏ విధంగా సక్సెస్ అయిందో అదే విధంగా రేవంత్ సభను సక్సెస్ చేయాలని మండల స్థాయి నాయకులకు దిశానిర్దేశాలు అందజేశారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా పీసీసీ అధ్యక్షుని హోదాలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని 40 ఏళ్ల ఇంద్రవెల్లి ఘటనలో నష్టపోయిన కుటుంబాలకు చేయూతనిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని స్థానికులు కోరుతున్నారు.

డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు మాట్లాడుతూ ఇంద్రవెల్లి సభ నుంచి సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని తెలిపారు. సీఎం సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివస్తాయన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి లక్ష మందికి పైగా ఈ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తొలి సభ కావడంతో ఇంద్రవెల్లి సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సభ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్‌లో మంత్రి సీతక్క, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలతో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.

లోక్ సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా

రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఇంద్రవెల్లి అమరుల స్థూపం వద్ద స్మారక స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్మృతి వనం శంకుస్థాపనకు‌ తానే స్వయంగా వస్తానన్నారు. ఈ మాట ప్రకారం ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో పర్యటించనున్నారు. దీంతో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభలో ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తొలిసారిగా నాగోబాను దర్శించుకోబోతున్నారు. నాగోబాను దర్శించుకోనున్న తొలి తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రికార్డుకెక్కనున్నారు. సీఎం రాకతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తు్న్నారు. ఇంద్రవెల్లి సభ ఏర్పాట్లను మంత్రి సీతక్క భుజాన్నావేసుకున్నారు. ఆదిలాబాద్ నేతలకు మంత్రి సీతక్క పలు సూచనలు చేశారు. ఇంద్రవెల్లి సభను లోక్ సభ ఎన్నికల సమర శంఖరావ సభగా కాంగ్రెస్ భావిస్తోంది. రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ఈ సభను నిర్వహిస్తోం

రిపోర్టింగ్ : వేణుగోపాల కామోజి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా

Whats_app_banner