Bold Thriller OTT: ఓటీటీలోకి వచ్చిన బాహుబలి యాక్టర్ తెలుగు బోల్డ్ థ్రిల్లర్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Bold Thriller OTT:: బాహుబలి ఫేమ్ కాళకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు మూవీ రౌద్ర రూపాయ నమః అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో పాయల్ ముఖర్జీ, మోహన సిద్ధి హీరోయిన్లుగా నటించారు.
Bold Thriller OTT: బాహుబలి ఫేమ్ కాళకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రౌద్ర రూపాయ నమః మూవీ థియేటర్లలో రిలీజైన ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీగా కాకుండా రెంటల్ విధానంలో అమెజాన్‌లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. రౌద్ర రూపాయ సినిమాను అమెజాన్‌ను చూడాలంటే సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 79 రూపాయలు అదనంగా చెల్లించాల్సిందే.
ఒకే లొకేషన్‌లో...
రౌద్ర రూపాయ మూవీలో పాయల్ ముఖర్జీ, మోహన సిద్ధి కీలక పాత్రల్లో నటించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి పాలిక్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది.
రౌద్ర రూపాయ కథ మొత్తం చాలా వరకు ఒకే ఇంట్లో సింగిల్ లొకేషన్‌లో సాగుతుంది. థ్రిల్లర్ అంశాలతో పాటు హీరోయిన్ల గ్లామర్‌తో ఆడియెన్స్‌ను అట్రాక్ట్‌చేయాలని డైరెక్టర్ అనుకున్నారు. కానీ కాన్సెప్ట్‌లో ఆసక్తి లోపించడంతో రౌద్ర రూపాయ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
రౌద్ర రూపాయ కథ ఇదే...
ఆద్య (మోహన సిద్ధి) జాబ్ చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఆమెకు గోవాకు ట్రాన్స్‌ఫర్ కావడంతో చెల్లెలితో (పాయల్ ముఖర్జీ) కలిసి గోవాకు వెళుతుంది. గోవాలో ఉన్న తమ ఆఫీస్ గెస్ట్‌హౌజ్‌లో దిగుతారు. గెస్ట్‌హౌజ్ పక్కనే రిటైర్డ్ ఆర్మీ మేజర్ (కాళకేయ ప్రభాకర్) ఇళ్లు ఉంటుంది.
ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆర్మీ మేజర్ సైకోలా మారిపోతాడు. కోపంలో ఉన్నప్పుడు తనకు ఎవరైనా ఎదురుచెబితే చంపేస్తుంటాడు. అనుకోకుండా ఆద్య కోసం గోవా వచ్చిన ఆమె లవర్ జై ఆర్మీ మేజర్ ఇంట్లో బందీగా మారిపోతాడు. అతడిని వెతుక్కుంటూ ఆద్య, ఆమె చెల్లెలు కూడా ఆర్మీ మేజర్ ఇంట్లో అడుగుపెడతారు. సైకో బారి నుంచి ఈ ముగ్గురు ఎలా బయటపడ్డారు? జైని ఆర్మీ మేజర్ ఎందుకు బంధించాడు? అన్నదే ఈ మూవీ కథ.
బాహుబలి మూవీతో...
బాహుబలి మూవీతో కాళకేయ పాత్రలో కనిపించాడు ప్రభాకర్. చిన్న పాత్రే అయినా అతడికి మంచి పేరు తీసుకొచ్చింది. బాహుబలితో అతడి పేరు కాళకేయ ప్రభాకర్‌గా మారిపోయింది. తెలుగులో బాహుబలితో పాటు గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది, లెజెండ్, అఖండతో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో నెగెటివ్ క్యారెక్టర్స్ చేశాడు ప్రభాకర్. కన్నడ, తమిళం, మలయాళంలో కొన్ని సినిమాల్లో నటించాడు.