Sai Dhansika: క‌బాలి హీరోయిన్‌తో మంత్ర డైరెక్ట‌ర్ సైకో కిల్ల‌ర్ మూవీ - ద‌క్షిణ రిలీజ్ డేట్ ఫిక్స్‌!-kabali fame sai dhanshika telugu psycho killer movie dakshina release date fixed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sai Dhansika: క‌బాలి హీరోయిన్‌తో మంత్ర డైరెక్ట‌ర్ సైకో కిల్ల‌ర్ మూవీ - ద‌క్షిణ రిలీజ్ డేట్ ఫిక్స్‌!

Sai Dhansika: క‌బాలి హీరోయిన్‌తో మంత్ర డైరెక్ట‌ర్ సైకో కిల్ల‌ర్ మూవీ - ద‌క్షిణ రిలీజ్ డేట్ ఫిక్స్‌!

Nelki Naresh Kumar HT Telugu
Sep 21, 2024 02:04 PM IST

Sai Dhansika: క‌బాలి ఫేమ్ సాయిధ‌న్సిక హీరోయిన్‌గా న‌టిస్తోన్న ద‌క్షిణ మూవీ అక్టోబ‌ర్ 4న థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. సైకో కిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి ఓషో తుల‌సీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గ‌తంలో ఓషో తుల‌సీరామ్ తెలుగులో మంత్ర మూవీని తెర‌కెక్కించాడు.

సాయిధ‌న్సిక
సాయిధ‌న్సిక

Sai Dhansika: ర‌జ‌నీకాంత్ క‌బాలి ఫేమ్ సాయిధ‌న్సిక హీరోయిన్‌గా న‌టించిన ద‌క్షిణ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. సైకో కిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ మూవీ అక్టోబ‌ర్ 4న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. మంత్ర మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు మెప్పించిన ఓషో తుల‌సీరామ్ ద‌క్షిణ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ద‌క్షిణ మూవీలో రిష‌బ్ బ‌సు, స్నేహా సింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు.

రెండు మిలియ‌న్ల వ్యూస్‌

ద‌క్షిణ మూవీని నైజాంఏరియాలో మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ద‌క్షిణ మూవీ ట్రైల‌ర్‌ను ఉప్పెన డైరెక్ట‌ర్ బుచ్చిబాబు రిలీజ్ చేశారు. ట్రైల‌ర్‌కు రెండు మిలియ‌న్ల వ‌ర‌కు వ్యూస్ వ‌చ్చాయి. ద‌క్షిణ మూవీలో సాయిధ‌న్సిక పోలీస్ ఆఫీసర్ పాత్ర‌లో న‌టించింది. ఆమె క్యారెక్ట‌ర్‌లో మ‌రో కోణం ఉండ‌నున్న‌ట్లు ట్రైల‌ర్‌లో చూపించారు.

నెక్స్ట్ ఏం జ‌ర‌గ‌బోతుందోన‌నే స‌స్పెన్స్‌తో చివ‌రి వ‌ర‌కు ఆడియెన్స్‌కు ఈ మూవీ థ్రిల్‌ను పంచుతుంద‌ని సినిమా యూనిట్ చెబుతోంది. మంత్ర త‌ర‌హాలోనే డైరెక్ట‌ర్ ఓషో తుల‌సీరామ్ కెరీర్‌లో ట్రెండ్ సెట్ట‌ర్ మూవీగా ద‌క్షిణ నిలుస్తుంద‌ని అంటున్నారు.ద‌క్షిణ మూవీకి బాలాజీ మ్యూజిక్ అందిస్తోన్నాడు. ద‌క్షిణ‌లో కీల‌క పాత్ర చేసిన రిష‌వ్ బ‌సు...మ‌హాభార‌త్ మ‌ర్డ‌ర్స్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు.

ర‌జ‌నీకాంత్ క‌బాలి...

ర‌జ‌నీకాంత్ క‌బాలితోనే తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు చేరువైంది సాయిధ‌న్సిక‌. ఈ మూవీలో ర‌జ‌నీకాంత్ కూతురిగా యాక్ష‌న్ రోల్‌లో క‌నిపించింది. . క‌బాలితో పాపుల‌ర్ అయిన ధ‌న్సిక త‌మిళంలో అర‌వ‌న్‌, ప‌ర‌దేశి, కాత్త‌డి, ఉరు, లాభంతో పాటు ప‌లు సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేసింది.

అవ‌కాశాలు బాగానే వ‌చ్చిన విజ‌యాలు మాత్రం ద‌క్కించుకోలేక‌పోయింది సాయిధ‌న్సిక‌. మ‌రీనా పేరుతో కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత త‌న‌ పేరును సాయి ధ‌న్సిక‌గా మార్చుకున్న‌ది. షికారు మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది సాయిధ‌న్సిక‌. ఈ మూవీలో బోల్డ్ రోల్‌లో న‌టించింది. షికారు త‌ర్వాత అంతిమ‌తీర్పు మూవీ చేసింది.

మంత్ర ...ట్రెండ్‌ సెట్ట‌ర్‌...

ఛార్మి, శివాజీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మంత్ర మూవీతో డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఓషో తుల‌సిరామ్‌. 2007లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా ఛార్మి క్రేజ్‌తో రిలీజైన ఈ మూవీ పెద్ద విజ‌యాన్ని సాధించింది. మంత్ర స్ఫూర్తితో టాలీవుడ్‌లో ప‌లు హార‌ర్ మూవీస్ వ‌చ్చాయి.

వ‌రుస ప‌రాజ‌యాల్లో ఉన్న శివాజీ కెరీర్‌ను గ‌ట్టెక్కించింది. మంత్ర మూవీకి సీక్వెల్‌లో ఛార్మితోనే మంగ‌ళ మూవీ చేశాడు ఓషో తుల‌సిరామ్‌. మంత్ర స్థాయిలో సీక్వ‌లె్ ఆడ‌లేదు. ఆ త‌ర్వాత చాలా కాలం పాటు ఇండ‌స్ట్రీకి దూరంగా ఉన్న ఓషో తుల‌సీరామ్ మ‌ళ్లీ ద‌క్షిణ‌తో డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు.