Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్.. టాప్ 2లో ఆ రెండే.. మూడో స్థానం కోసం పోటాపోటీ
Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ తోపాటు జీ తెలుగు, ఈటీవీ, జెమిని టీవీల్లో వచ్చే సీరియల్స్ 42వ వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. టాప్ 2లో ఆ రెండు సీరియల్సే కొనసాగుతుండగా.. మూడో స్థానం కోసం రెండు సీరియల్స్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.
Star Maa Serials TRP Ratings: తెలుగు టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ కోసం ప్రతివారం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తాజాగా 42వ వారానికి గాను రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. స్టార్ మా సీరియల్స్ హవా కొనసాగింది. టాప్ 6లో ఆ ఛానెల్ సీరియల్సే ఉన్నాయి. అయితే టాప్ 3లో చోటు కోసం రెండు సీరియల్స్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొనడం ఈ వారం విశేషం.
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే బ్రహ్మముడి, కార్తీకదీపం టాప్ 2లో కొనసాగుతున్నాయి. 42వ వారం రేటింగ్స్ చూస్తే.. 12.22 రేటింగ్ తో తొలి స్థానంలో ఉండగా.. కార్తీకదీపం 11.38తో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక మూడో స్థానం కోసం హోరాహోరీ పోటీ నెలకొంది.
గతవారం గుండెనిండా గుడిగంటలు సీరియల్ ను వెనక్కి నెట్టి చిన్ని మూడోస్థానానికి దూసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఈ రెండు సీరియల్స్ 10.15 రేటింగే సాధించాయి. ఇక ఆ తర్వాత ఇంటింటి రామాయణం 9.91, మగువ ఓ మగువ 8.73 రేటింగ్స్ తో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఆ లెక్కన 42వ వారం కూడా ఓవరాల్ గా టాప్ 6లో అన్నీ స్టార్ మా సీరియల్సే ఉన్నాయి.
జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
ఇక జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే ఈసారి పడమటి సంధ్యారాగం సీరియల్ టీఆర్పీ చాలా మెరుగైంది. తొలిసారి ఆ సీరియల్ 8.25 రేటింగ్ తో ఓవరాల్ గా ఏడో స్థానంలో, జీ తెలుగులో టాప్ లో ఉంది.
ఇక ఆ తర్వాత మేఘసందేశం 7.3, నిండు నూరేళ్ల సావాసం 7.25, జగద్ధాత్రి 6.66, త్రినయని 6.34 రేటింగ్స్ తో ఉన్నాయి. ఓవరాల్ తెలుగు సీరియల్స్ లో ఏడు నుంచి పదో స్థానం వరకు జీ తెలుగు సీరియల్స్ నిలిచాయి.
ఈటీవీ, జెమిని టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
ఈటీవీ సీరియల్స్ రేటింగ్స్ కూడా ఈవారం కాస్త మెరుగయ్యాయి. ఎప్పటిలాగే ఈ ఛానెల్లో రంగులరాట్నం సీరియల్ 3.25తో టాప్ లో ఉంది. ఆ తర్వాత మనసంతా నువ్వే 3.07, గువ్వగోరికం 2.66, రావోయి చందమామ 2.31, శతమానం భవతి 1.94 రేటింగ్స్ సాధించాయి. అయితే స్టార్ మా, జీ తెలుగు ఛానెల్స్ సీరియల్స్ తో పోలిస్తే మాత్రం ఈటీవీ వెనుకబడే ఉంది.
జెమిని టీవీ సీరియల్స్ ఎప్పటిలాగే అసలు ఊసులోనే లేవు. ఆ ఛానెల్లో శ్రీమద్ రామాయణం 1.21తో టాప్ లో ఉంది. కొత్తగా రెక్కలొచ్చెనా 1.07, సివంగి 0.88, భైరవి 0.82, నువ్వే కావాలి 0.66 రేటింగ్స్ సాధించాయి. తెలుగు టీవీ సీరియల్స్ లో ఎప్పటిలాగే 42వ వారం కూడా స్టార్ మా, జీ తెలుగు సీరియల్సే తమ హవా కొనసాగించాయి.