Korean Suspense Thriller: ఈటీవీ విన్ ఓటీటీలోకి తెలుగులో వస్తున్న కొరియన్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్
OTT Korean Suspense Thriller: ఈటీవీ విన్ ఓటీటీలోకి 9 ఏళ్ల తర్వాత ఓ కొరియన్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తెలుగులో వస్తోంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ విషయాన్ని సదరు ఓటీటీ మంగళవారం (అక్టోబర్ 22) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
OTT Korean Suspense Thriller: కొరియన్ స్పై సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఒకటి ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్ కు రాబోతోంది. 9 ఏళ్ల కిందట అంటే 2015లో సౌత్ కొరియాలో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ కు అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడీ సిరీస్ ను తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు ఈటీవీ విన్ ఓటీటీ వెల్లడించింది. ఈ సిరీస్ పేరు హిడెన్ ఐడెంటిటీ (Hidden Identity).
హిడెన్ ఐడెంటిటీ ఓటీటీ రిలీజ్ డేట్
హిడెన్ ఐడెంటిటీ ఓ కొరియన్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ తెలుగులో గురువారం (అక్టోబర్ 24) నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమ అక్టోబర్ రిలీజెస్ లో ఈ సిరీస్ కూడా ఉందని గతంలోనే వెల్లడించిన ఈటీవీ విన్ ఓటీటీ.. తాజాగా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది.
నిజానికి అక్టోబర్ 31న రానుందని అప్పట్లో చెప్పినా.. వారం రోజుల ముందుగానే స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారు. "హిడెన్ ఐడెంటిటీ అక్టోబర్ 24 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్, డ్రామాను అస్సలు మిస్ కావద్దు" అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని సదరు ఓటీటీ వెల్లడించింది.
హిడెన్ ఐడెంటిటీ వెబ్ సిరీస్ స్టోరీ ఇదీ..
హిడెన్ ఐడెంటిటీ 2015లో వచ్చిన సౌత్ కొరియన్ టీవీ సిరీస్. ఇందులో కిమ్ బమ్, పార్క్ సుంగ్ వూంగ్, యూన్ సో యి, లీ వాన్ జాంగ్ నటించారు. మొత్తం 16 ఎపిసోడ్ల పాటు సాగే సిరీస్ ఇది. ఒక్కో ఎపిసోడ్ సుమారు గంట సేపు ఉంటుంది.
నలుగురు అండర్ కవర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెంట్ల చుట్టూ తిరిగే స్టోరీ ఇది. హింసాత్మక నేరాలను అరికట్టే ఉద్దేశంతో ఈ స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేస్తారు. ఓ సూపరింటెండెంట్, మరో ముగ్గురు అధికారులతో కూడిన ఈ టీమ్.. ప్రమాదకరమైన నేర ప్రపంచంలోకి తమ ఐడెంటిటీని దాచి పెట్టి వెళ్తారు.
అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ నేరాలను వాళ్లు అరికట్టగలిగారా లేదా అన్నది ఈ వెబ్ సిరీస్ లో చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్ కు ఐఎండీబీలో 6.6 రేటింగ్ వచ్చింది. ఇప్పటికే ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉన్నా.. ఇప్పుడు తెలుగులో ఈటీవీ విన్ ఓటీటీలోకి వస్తోంది. కొరియన్ డ్రామాలు ఇష్టపడే వాళ్లు తెలుగులో ఈ సిరీస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు.
ఇప్పటికే ఈటీవీ విన్ ఓటీటీలో మరో కొరియన్ వెబ్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. ఈ సిరీస్ పేరు వెల్‌కమ్ 2 లైఫ్. ఇది ఐదేళ్ల కిందట వచ్చిన కొరియన్ వెబ్ సిరీస్. ఓ ప్రమాదం వల్ల మరో ప్రపంచంలోకి వెళ్లిపోయే ఓ లాయర్ చుట్టూ తిరిగే కథతో ఈ సిరీస్ రూపొందింది.