Rajamouli Met spielberg : నేను దేవుడిని కలిశాను.. స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో రాజమౌళి-ss rajamouli steven spielberg meets here s netizens reactions ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajamouli Met Spielberg : నేను దేవుడిని కలిశాను.. స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో రాజమౌళి

Rajamouli Met spielberg : నేను దేవుడిని కలిశాను.. స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో రాజమౌళి

Anand Sai HT Telugu
Jan 14, 2023 11:58 AM IST

SS Rajamouli Meets steven spielberg : ఇద్దరు లెజెండ్‌లు ఒక చోట కలిస్తే.. ఎలా ఉంటుంది. అలాంటి ఫొటోనే.. ఇప్పుడు ఒకటి బయటకు వచ్చింది. ఎస్ఎస్ రాజమౌళి, స్టీవెన్ స్పీల్ బర్గ్ కలిసిన ఫొటో వైరల్ అవుతుంది.

స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో రాజమౌళి, కీరవాణి
స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో రాజమౌళి, కీరవాణి (twitter)

భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli)కి హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్‌(Steven Spielberg) అంటే చాలా ఇష్టం. ఆయనను కలుసుకున్నాడు రాజమౌళి. దీనిపై చాలా సంతోషం వ్యక్తం చేశాడు. దేవుడిగా చెప్పుకొచ్చాడు. ఆ క్షణం 'జీవితం కంటే పెద్దది' అనేలా చూస్తున్నాడు జక్కన్న. తన ఫ్యాన్‌బాయ్ మూమెంట్ ను ఎంజాయ్ చేశాడు. దానికి సంబంధించిన రెండు ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశాడు. రాజమౌళి.. స్టీవెన్ వైపు విస్మయంతో చూస్తున్నాడు.

ఒక ఫోటోలో రాజమౌళి స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో సంభాషించడం కనిపిస్తుంది. రెండో ఫొటోలో రాజమౌళి, స్టీవెన్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి(MM Keeravani)తో కలిసి ఫొటోకు పోజులిచ్చారు. ఇటీవలి 80వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల తర్వాత ఇద్దరు కలుసుకున్నారు. ఈ ఫొటోలను షేర్ చేస్తూ.. 'నేను దేవుడిని కలిశాను'. అని పేర్కొంటూ రాజమౌళి క్యాప్షన్ ఇచ్చాడు.

రాజమౌళి ఫోటోలు షేర్ చేయగానే.. ఫొటోలు వైరల్ అయ్యాయి. రాజమౌళి అభిమానులు వారిద్దరినీ GOAT (Greatest Of All Time) అని కామెంట్స్ చేస్తున్నారు. 'అయితే మీరు మాకు దేవుడు సార్ #RRRforOscars.' అని ఓ అభిమాని అన్నాడు.

ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలో నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్ సలాం కొట్టిన విషయం తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు అందుకుని చరిత్ర సృష్టించింది. భారత చలన చిత్ర పరిశ్రమలో ఆర్ఆర్ఆర్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డు ప్రకటించిన తర్వాత... హాల్‌ మొత్తం ఒక్కసారిగా మారుమోగింది. అక్కడే ఉన్న ఆర్ఆర్ఆర్ టీమ్ ఎంజాయ్ చేసింది.

RRR సినిమాలో కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతా రామరాజుగా రామ్ చరణ్ కనిపించిన పీరియాడికల్ డ్రామా. స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశంలో జరిగిన కల్పిత కథ, వారి స్నేహాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారు. అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కనిపిస్తుంది. ఇందులో అలియా భట్, అజయ్ దేవగన్ లాంటి ప్రముఖ నటులు కూడా ఉన్నారు. మార్చి 25, 2022న థియేటర్లలో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1,200 వసూలు చేసింది. RRR ఆస్కార్ రిమైండర్ లిస్ట్‌లో కూడా ఉంది.

సంబంధిత కథనం