OG Movie: ఓజీ సినిమాలో టబు చేయాల్సిన క్యారెక్టర్ ఎవరికి వెళ్లిందో తెలుసా?-sriya reddy replaces actress tabu in pawan kalyan og movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Og Movie: ఓజీ సినిమాలో టబు చేయాల్సిన క్యారెక్టర్ ఎవరికి వెళ్లిందో తెలుసా?

OG Movie: ఓజీ సినిమాలో టబు చేయాల్సిన క్యారెక్టర్ ఎవరికి వెళ్లిందో తెలుసా?

Chatakonda Krishna Prakash HT Telugu
May 20, 2024 12:22 PM IST

OG Movie: ఓజీ సినిమా గురించి తాజాగా ఓ విషయం బయటికి వచ్చింది. ఈ మూవీలో ముందుగా అలనాటి హీరోయిన్ టబును ఓ పాత్ర కోసం మేకర్స్ అనుకున్నారట. అయితే, ఆ తర్వాత వేరే నటి చేతికి ఆ క్యారెక్టర్ వెళ్లింది. ఆ డీటైల్స్ ఇవే.

OG Movie: ఓజీ సినిమాలో టబు చేయాల్సిన క్యారెక్టర్ ఎవరికి వెళ్లిందో తెలుసా?
OG Movie: ఓజీ సినిమాలో టబు చేయాల్సిన క్యారెక్టర్ ఎవరికి వెళ్లిందో తెలుసా?

OG Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్‍స్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఓజీ’కి హైప్ ఓ రేంజ్‍లో ఉంది. సాహో ఫేమ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వచ్చిన ఓజీ గ్లింప్స్ అదిరిపోయింది. పవన్ స్వాగ్, యాక్షన్ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ చిత్రం కోసం సినీ ప్రేక్షకులు చాలా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓజీ మూవీ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. ఈ సినిమాలో అలనాటి హీరోయిన్, సీనియర్ నటి టబు కోసం ఓ పాత్రను డైరెక్టర్ సుజీత్ రాసుకున్నారట. అయితే, ఆ క్యారెక్టర్ తర్వాత వేరే నటికి వెళ్లింది.

టబు స్థానంలో శ్రీయారెడ్డి!

ఇటీవల సలార్ మూవీలో రాధారమా పాత్రతో తమిళ నటి శ్రీయారెడ్డి తెలుగులోనూ చాలా పాపులర్ అయ్యారు. ఓజీ సినిమాలోనూ ఆమె కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే, ఓజీలో టబు చేయాల్సిన పాత్ర శ్రీయారెడ్డికి వెళ్లిందని తాజాగా వెల్లడైంది. ఈ విషయంపై శ్రీయానే హింట్ ఇచ్చారు.

ఓ తెలుగు మూవీలో సీనియర్ నటి టబు చేయాల్సిన ఓ క్యారెక్టర్ తనకు వచ్చిందని ఫిల్మ్ కాంపానియన్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీయారెడ్డి తాజాగా చెప్పారు. స్క్కిప్ట్‌పై టబు పేరు ఉండటంతో ఈ విషయం తనకు తెలిసిందని తెలిపారు. “ఓ తెలుగు సినిమాలో టబు కోసం రాసిన పాత్ర నాకు వచ్చింది. ఆమె పేరు స్క్రిప్ట్‌పై రాసి ఉంది. నాకు అదే క్యారెక్టర్ వచ్చింది. కానీ సినిమా పేరు నేను చెప్పాలనుకోవడం లేదు. ఆ అవకాశం వచ్చినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నా. అది పెద్ద విజయంగా అనుకుంటున్నా” అని శ్రీయారెడ్డి ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

మూవీ పేరు చెప్పకపోయినా..

అయితే, ఈ ఇంటర్వ్యూలో సినిమా పేరును మాత్రం శ్రీయారెడ్డి చెప్పలేదు. అయితే, ప్రస్తుతం ఆమె చేస్తున్న ఏకైక సినిమా ఓజీ మాత్రమే. దీంతో ఆ చిత్రంలో టబును అనుకొని రాసుకున్న పాత్ర ఆమెకు వెళ్లిందని అర్థమవుతోంది.

ఆ సినిమాలో తన పాత్ర చాలా బలంగా, ఇంటెన్స్‌గా ఉంటుందని శ్రీయారెడ్డి చెప్పారు. అయితే, సలార్‌తో పోలిస్తే డిఫరెంట్‍గా ఉంటుందని తెలిపారు.

ఓజీ రిలీజ్ డేట్

ఓజీ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. అయితే, విడుదల వాయిదా పడుతుందనే అంచనాలు ఉన్నాయి. పవన్ రాజకీయాల్లో బిజీ అవడం, ఇంకా షూటింగ్ చాలా శాతం మిగిలి ఉండడంతో ఈ రూమర్లు వచ్చాయి. మరి ఓజీ సెప్టెంబర్ 27నే వస్తుందా లేకపోతే ఆలస్యమవుతుందా అనేది చూడాలి.

ఓజీ చిత్రంలో పవన్ కల్యాణ్‍కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్‍ పాత్ర చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి విలన్‍‍గా నటిస్తున్నారు. శ్రీయారెడ్డి, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, హరిశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

ఓజీ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ప్రొడ్యూజ్ చేస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు. సుమారు రూ.200 కోట్ల బడ్జెట్‍తో ఈ మూవీ రూపొందుతోందని అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం విడుదల కానుంది.

టీ20 వరల్డ్ కప్ 2024