Sobhita Dhulipala: నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్‌పై శోభిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఇలాగే జరగాలని అనుకున్నానంటూ..-sobhita dhulipala talks about her engagement to naga chaitanya and her wedding plans ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sobhita Dhulipala: నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్‌పై శోభిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఇలాగే జరగాలని అనుకున్నానంటూ..

Sobhita Dhulipala: నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్‌పై శోభిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఇలాగే జరగాలని అనుకున్నానంటూ..

Hari Prasad S HT Telugu
Sep 25, 2024 03:18 PM IST

Sobhita Dhulipala: నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్ తోపాటు పెళ్లి, పిల్లలు, తన తెలుగుతనంపై శోభిత ధూళిపాళ్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. గలాటాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వీటిపై స్పందించింది.

నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్‌పై శోభిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఇలాగే జరగాలని అనుకున్నానంటూ..
నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్‌పై శోభిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఇలాగే జరగాలని అనుకున్నానంటూ..

Sobhita Dhulipala: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ అభిమానుల్లో ఎంతటి ఆసక్తి రేపిందో తెలుసు కదా. దీనిపై కాబోయే పెళ్లి కూతురు శోభిత తాజాగా స్పందించింది. చైతూతో నిశ్చితార్థంతోపాటు తల్లి కావాలనుకునే తన కల, తెలుగు సాంప్రదాయాలను పాటించడంలాంటి అంశాలపైనా మాట్లాడింది. గలాటాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఎలా జరగాలనుకున్నానో అలాగే జరిగింది

నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్ తాను ఎలా జరగాలని అనుకున్నానో అలాగే జరిగిందని, అది సింపుల్ గా అయిందా లేదా అన్నది తాను పెద్దగా పట్టించుకోనని శోభిత చెప్పింది. ఆగస్ట్ 9న నాగార్జున ఇంట్లోనే కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే వీళ్ల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.

"నేను ఎన్నో కలలు లేదా అంచనాలు, ప్లానింగ్ తో ఆ క్షణం కోసం ఎదురు చూడలేదు. ఆ క్షణాన్ని ఆస్వాదించాను. చాలా సింపుల్ గా, రిలాక్స్‌డ్ గా, స్వీట్ గా జరిగిపోయింది. నేను ఎలా అనుకున్నానో అలాగే జరిగింది.

అందమైన విషయాలు జరిగినప్పుడు నాకు ఎలాంటి అలంకారాలు అవసరం లేదని నేను భావిస్తాను. ఆ క్షణమే నాకు చాలనిపిస్తుంది. అందుకే అది సింపుల్ గా జరిగిందా లేదా అన్న ఫీలింగ్ నాకు కలగలేదు. ఎలా జరగాలో అలా జరిగింది. అది పర్ఫెక్ట్" అని శోభి చెప్పింది.

పెళ్లి చేసుకోవాలి, అమ్మనవ్వాలి

ఇక తానెప్పుడూ పెళ్లి చేసుకొని, పిల్లలను కన్నట్లుగా ఊహించుకునేదాన్నని కూడా శోభిత తెలిపింది. అయితే అలాంటివి జరిగినప్పుడు తాను తెలుగు సాంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తానని స్పష్టం చేసింది.

"పరిపూర్ణమైన అమ్మతనాన్ని ఆస్వాదించాలని, పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడూ అనుకునేదాన్ని. దానిపై నాకు స్పష్టత ఉంది. ఎప్పుడూ అందులో నన్ను నేను చూసుకేనేదాన్ని. ఇలాంటి క్షణాల్లో తెలుగుతనం ఉట్టిపడాలనీ అనుకునేదాన్ని. నా తల్లిదండ్రులు, సాంప్రదాయాలు, నా మూలాలతో నేనెప్పుడూ మమేకమయ్యే ఉన్నాను" అని శోభిత చెప్పింది.

నాగ చైతన్య, శోభిత పెళ్లెప్పుడు?

నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం ఆగస్ట్ 9న జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ వాళ్లు తమ పెళ్లి తేదీని మాత్రం అనౌన్స్ చేయలేదు. కానీ పెళ్లికి తాను ఎలాంటి చీర కట్టుకుంటానన్నది కూడా ఇదే ఇంటర్వ్యూలో శోభిత తెలిపింది.

సాధారణంగా తెలుగు పెళ్లిళ్లలో అమ్మాయిలు ఎర్రటి అంచు ఉండే తెలుపు రంగు పట్టు చీర కట్టుకుంటారు. తాను కూడా అలాంటిదే ప్లాన్ చేస్తున్నట్లు చెప్పింది. నిశ్చితార్థం సమయంలో ఆమె మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లంగా ఓణీలో మెరిసిపోయింది.