Sarkaar Episode 10 Promo: అమ్మాయిల గుండె చప్పుడు సుడిగాలి.. నలుగురు ముద్దుగుమ్మలతో సుధీర్ ఆట.. సర్కార్ లేటెస్ట్ ప్రోమో-sarkaar episode 10 promo sudigali sudheer hameeda sravanthi subha sree sobha shetty aha ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sarkaar Episode 10 Promo: అమ్మాయిల గుండె చప్పుడు సుడిగాలి.. నలుగురు ముద్దుగుమ్మలతో సుధీర్ ఆట.. సర్కార్ లేటెస్ట్ ప్రోమో

Sarkaar Episode 10 Promo: అమ్మాయిల గుండె చప్పుడు సుడిగాలి.. నలుగురు ముద్దుగుమ్మలతో సుధీర్ ఆట.. సర్కార్ లేటెస్ట్ ప్రోమో

Hari Prasad S HT Telugu
Jun 18, 2024 08:08 AM IST

Sarkaar Episode 10 Promo: సర్కార్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో నలుగురు ముద్దుగుమ్మలతో ఆడుకున్నాడు సుడిగాలి సుధీర్. ఎప్పటిలాగే పంచ్ లేస్తూ, తనపై వేయించుకుంటూ ఈ పదో ఎపిసోడ్ ప్రోమో సరదాగా సాగిపోయింది.

అమ్మాయిల గుండె చప్పుడు సుడిగాలి.. నలుగురు ముద్దుగుమ్మలతో సుధీర్ ఆట.. సర్కార్ లేటెస్ట్ ప్రోమో
అమ్మాయిల గుండె చప్పుడు సుడిగాలి.. నలుగురు ముద్దుగుమ్మలతో సుధీర్ ఆట.. సర్కార్ లేటెస్ట్ ప్రోమో

Sarkaar Episode 10 Promo: సుడిగాలి సుధీర్.. పక్కనే నలుగురు అమ్మాయిలు.. ఇక ఆ షో ఎలా ఉంటుందో ఊహించుకోండి. సరిగ్గా మీరు ఊహించినట్లే సాగింది సర్కార్ షో పదో ఎపిసోడ్ ప్రోమో. ఒకరో ఇద్దరో అమ్మాయిలు ఉంటేనే చెలరేగిపోయే సుధీర్.. ఒకసారి నలుగురు అమ్మాయిలు వస్తే ఊరుకుంటాడా? వాళ్లతో ఆటాడేసుకున్నాడు. ఆహా ఓటీటీలో వచ్చే ఈ సర్కార్ కొత్త ఎపిసోడ్ ప్రోమో ఇక్కడ చూసేయండి.

సర్కార్ ఎపిసోడ్ 10 ప్రోమో

సర్కార్ పదో ఎపిసోడ్ ప్రోమోను సోమవారం (జూన్ 17) ఆహా ఓటీటీ తమ సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ ద్వారా షేర్ చేసింది. "రంగుల లోకం, అందాలు ప్రత్యక్షం.. సర్కార్ తో చెయ్యొద్దు మీరు పరిహాసం" అనే క్యాప్షన్ తో ఈ కొత్త ప్రోమోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

సర్కార్ పదో ఎపిసోడ్ కు అందమైన నలుగురు అమ్మాయిలు వచ్చారు. స్రవంతి, శుభ శ్రీ, హమీదా, శోభా శెట్టిలను చూసిన సుధీర్ కు కవిత్వం పొంగుకొచ్చేసింది. ఒక్కొక్కరికి ఒక్కో రేంజ్ లో ఎలివేషన్ ఇస్తూ ఇంట్రడ్యూస్ చేశాడు. ఎంతో మంది చచ్చిపోతారు పాము కుట్టి.. ఇప్పుడొస్తుంది శోభా శెట్టి.. నిన్ను ఇంత అందంగా పుట్టించినందుకు శుభ శ్రీ.. ఆ దేవుడికి ఇవ్వాలి పద్మ శ్రీ.. దేవకన్యలు తిరుగుతారు భూమ్మీద.. దానికి సాక్ష్యమే హమీదా.. ఇలా సాగిపోయింది సుధీర్ జోరు.

అమ్మాయిల గుండె చప్పుడు సుడిగాలి

ముఖ్యంగా ప్రోమో అంతా హమీదాతో సుధీర్ కెమెస్ట్రీ అదిరిపోయిందని చెప్పాలి. ఆమె మాటిమాటికీ సుధీర్ ను హగ్ చేసుకుంటూ తెగ సిగ్గుపడిపోయింది. ఇక ప్రోమో చివర్లో సుధీర్ పై శుభ శ్రీ వేసిన పంచ్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. ఎండకు తిరిగితే తగిలేది వడగాలి.. మా అమ్మాయిల గుండె చప్పుడు సుడిగాలి అంటూ శుభ శ్రీ అనగానే ఆడియెన్స్ కేరింతలు కొట్టారు.

ఆహా ఓటీటీలో వచ్చే ఈ సర్కార్ గేమ్ షో ఇప్పటికే 9 ఎపిసోడ్లు పూర్తి చేసుకోగా.. పదో ఎపిసోడ్ రాబోతోంది. ఈ కొత్త ఎపిసోడ్ వచ్చే శుక్రవారం (జూన్ 21) రాత్రి 8 గంటల నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. నలుగురు అమ్మాయిలతో సుధీర్ ఆట అనగానే ఈ ఎపిసోడ్ పై ఓ రేంజ్ లో ఆసక్తి పెరిగిపోయింది. మరి ఈ రాబోయే ఈ గేమ్ షోని మిస్ అవకుండా చూడండి.

ఆహా ఓటీటీలో టాప్ షో సర్కార్

ఆహా ఓటీటీలో కొన్నేళ్ల నుంచి ఈ సర్కార్ షో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం నాలుగో సీజన్ నడుస్తోంది. తొలి మూడు సీజన్లలో యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరించగా.. ఈ నాలుగో సీజన్ కు సుడిగాలి సుధీర్ వచ్చాడు. అయితే అతను వచ్చినప్పటి నుంచీ సర్కార్ షో ఆహా ఓటీటీ టాప్ ట్రెండింగ్స్ లో తొలి స్థానంలో కొనసాగుతోంది.

ఎలా షోను అయినా తన కామెడీ టైమింగ్ తో రక్తి కట్టించే సుధీర్.. ఈ సర్కార్ ను కూడా అలాగే ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పటి వరకూ స్ట్రీమింగ్ అయిన 9 ఎపిసోడ్లు కూడా అలా సరదాగా సాగిపోగా.. ఇప్పుడు పదో ఎపిసోడ్ అంతకు మించిన ఫన్ అందించినట్లు ప్రోమోతోనే స్పష్టమైంది.

WhatsApp channel