ఫ్యామిలీ స్టార్స్ గేమ్ షో ప్రోమోను ఈటీవీ రిలీజ్ చేసింది.ఇకపై నో వెయిటింగ్...ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హంటింగ్ అంటూ షోలోకి సుధీర్ ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంటోంది. ఈ షోకు సుడిగాలి సుధీర్‌తో పాటు భాను, ఆషూరెడ్డి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్నారు. ఈ ప్రోమోలో సుడిగాలి సుధీర్, ఆషూరెడ్డి కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది.
సుధీర్‌ను భాను, ఆషూరెడ్డి ఇద్దరు బావ అంటూ ముద్దుగా పిలుస్తూ కవ్వించారు. బావ నన్ను చూస్తే నీకు ఏమనిపిస్తుందని ఆషూరెడ్డి అడగ్గా...పక్కకు రా చెబుతా...నేను ఇంట్రోవర్ట్‌ను అందరి ముందు చెప్పడానికి సిగ్గుపడతాను అని సుధీర్ సమాధానమిచ్చాడు. ఎప్పుడు ఎవరి ఇంట్లో ఉంటావో తెలియదు.
నువ్వు ఇంట్రోవర్డ్ వా.. అంటూ సుధీర్‌పై భాను పంచ్‌లు వేసింది. సుధీర్, భాను, ఆషూరెడ్డితో పాటు రియాజ్ కూడా ఈ షోలో కనిపించాడు. ఈ ప్లాస్టిక్ ముఖాలతో ఎలా యాంకరింగ్ చేస్తున్నావు అంటూ రియాజ్ కూడా ఆషూరెడ్డి, భానులపై పంచ్‌లు వేశాడు.ఆషూరెడ్డి వర్కవుట్స్‌పై సుధీర్ కామెంట్స్ చేశాడు. అవన్నీ నవ్వులు పూయించాయి.
అత్తాకోడళ్ల మధ్య వార్‌తో ఫ్యామిలీ స్టార్స్ ఫస్ట్ ఎపిసోడ్ సాగనున్నట్లు తెలుస్తోంది. టీవీ సీరియల్స్‌లో అత్తాకోడళ్లుగా నటించిన పలువురు ఆర్టిస్టులు ప్రోమోలో కనిపించారు. అత్తా కోడళ్లతో పలు ఫన్నీ గేమ్స్‌ను సుధీర్ ఆడించాడు. ఈ గేమ్స్ సరదాగా సాగాయి.
అత్తాకోడళ్లను జీకే క్వశ్చన్స్ అడిగాడు సుధీర్. వాటికి సమాధానం చెప్పడానికి అత్తాకోడళ్లు పోటీపడటం ఈ ప్రోమోలో నవ్వులను పంచాయి. ఆ తర్వాత సీరియల్‌యాక్టర్స్ కెరీర్‌లో తమకు ఎదురైన కష్టాలను గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. సెంటిమెంట్‌తో ప్రోమోను ఎండ్ చేశారు.
ఫ్యామిలీ స్టార్స్ ప్రోమో యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. ప్రోమో అదిరిపోయిందని, సుధీర్ కోసం ఈ కామెడీ చూస్తామని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుధీర్ కోసం వెయిటింగ్ అంటూ చెబుతోన్నారు. జూన్ 2న ఫ్యామిలీ స్టార్స్ షో ప్రారంభం కానుంది. ప్రతి ఆదివారం రాత్రి ఏడున్నరకు ఈటీవీలో టెలికాస్ట్ కాబోతోంది.
హీరోగా అవకాశాలు పెరగడంతో సినిమాలపై ఫోకస్ పెట్టిన సుధీర్ గత ఏడాది జబర్ధస్థ్‌కు గుడ్‌బై చెప్పాడు సుధీర్. జబర్థస్థ్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంటూనే ఈటీవీలో టెలికాస్ట్ అవుతోన్న ఢీ, పోవేపోరా, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు హోస్ట్‌గా పనిచేశాడు. ఇవన్నీ అతడికి మంచి పేరుతెచ్చిపెట్టాయి.
సినిమాల్లో అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో అతడు తిరిగి హోస్ట్‌గా టీవీల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు చెబుతోన్నారు. . ప్రస్తుతం తెలుగులో గోట్ అనే సినిమాలో సుధీర్ హీరోగా నటిస్తోన్నాడు. ఇది ఒక్కటి మినహా సుధీర్ చేతిలో సినిమాలు నేనట్లుగా ప్రచారం జరుగుతోంది.
జబర్ధస్థ్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ దర్శకత్వంలో సుధీర్ ఓ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో సుధీర్‌తో పాటు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ కీలక పాత్రలు చేయనున్నట్లు చెబుతోన్నారు. హీరోగా సుధీర్ ఇప్పటివరకు సాఫ్ట్‌వేర్ సుధీర్, గాలోడు, వాంటెడ్ పండుగాడుతో పాటు కాలింగ్ సహస్ర సినిమాలు చేశాడు. బుల్లితెరపై సుధీర్‌కు ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమాలు నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టాయి.
టాపిక్