Comedy Movie OTT: ఓటీటీలోకి వచ్చిన కోలీవుడ్ సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్ మూవీ - ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు
Comedy Movie OTT: సంతానం హీరోగా నటించిన తమిళ మూవీ ఇంగ నాన్ తాన్ కింగు ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో కమర్షియల్ హిట్‌గా నిలిచిన ఈ కామెడీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Comedy Movie OTT: సంతానం హీరోగా నటించిన తమిళ మూవీ ఇంగ నాన్ తాన్ కింగు మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఈ కామెడీ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో ప్రస్తుతం తమిళ భాషలోనే ఈ మూవీ అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
రజనీ కాంత్ డైలాగ్‌తో...
జైలర్‌మూవీలోని రజనీకాంత్ పాపులర్ డైలాగ్ ఆధారంగా ఇంగ నాన్ తాన్ కింగు మూవీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. యాక్షన్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు ఆనంద్ నారాయణన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీతో ప్రియలయ హీరోయిన్‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. వివేక్ ప్రసన్న, మునీష్‌కాంత్ తంబీరామయ్య కీలక పాత్రల్లో నటించారు.
18 కోట్ల కలెక్షన్స్...
మే 17న థియేటర్లలో రిలీజైన ఈ కామెడీ మూవీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. దాదాపు పది కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఇంగ నాన్ తాన్ కింగు మూవీ 18 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. ఈ మూవీతోనే చాలా రోజుల తర్వాత హిట్టు అందుకున్నాడు సంతానం.
సంతానం పంచ్ డైలాగ్స్...
కామెడీ అంశాలకు మర్డర్ మిస్టరీని జోడించి దర్శకుడు ఆనంద్ నారాయణన్ మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాలో సంతానం సంతానం కామెడీ టైమింగ్, అతడి పంచ్ డైలాగ్స్ ఆడియెన్స్‌ను మెప్పించాయి. లాజిక్స్‌తో సంబంధం లేకుండా సినిమా ఆరంభం నుంచి చివరి వరకు కామెడీతోనే ప్రేక్షకులను మెప్పించాలని దర్శకుడు ప్రయత్నించారు.
టెర్రరిస్ట్ మర్డర్...
వెట్రి (సంతానం) ఓ మ్యాట్రిమోనీ కంపెనీలో పనిచేస్తుంటాడు. అప్పులు ఎక్కువ కావడంతో జమీందారి కూతురు తేన్‌మోజి(ప్రియలయ)ని పెళ్లి చేసుకొని ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలని ప్లాన్ వేస్తాడు. పెళ్లి తర్వాతే జమీందారి కుటుంబం దివాలా తీసిందనే నిజం వెట్రికి తెలుస్తుంది.
అదే సమయంలో వెట్రి అపార్ట్‌మెంట్‌లో చెన్నైలో బాంబులు పెట్టిన ఓ టెర్రరిస్ట్ (వివేక్ ప్రసన్న) చనిపోతాడు. అతడిని పట్టించిన వారికి యాభై లక్షల ప్రైజ్‌మనీ ఇస్తామని పోలీసులు ప్రకటిస్తారు.ఆ ప్రైజ్‌మనీ సొంతం చేసుకోవడం కోసం వెట్రితో పాటు అతడి ఫ్యామిలీ ఎలాంటి ప్లాన్స్ వేశారు? వెట్రి మ్యాట్రిమోనీ కంపెనీ బాస్, టెర్రరిస్ట్ ఒకే పోలికలతో ఎందుకు ఉన్నారు? వెట్రి డబ్బు కష్టాలు తీరాయా లేదా అన్నదే ఈ మూవీ కథ. ఇంగ నాన్ తాన్ కింగు మూవీకి డి ఇమాన్ మ్యూజిక్ అందించాడు.
కమెడియన్ టర్న్‌డ్ హీరో...
కోలీవుడ్‌లో టాప్ కమెడియన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న సంతానం ఆ తర్వాత హీరోగా మారాడు. ఏ1, పారిస్ జయరాజ్, దిల్లుకు దుడ్డుతో పాటు పలు సినిమాలో విజయాల్ని అందుకున్నాడు.ఈ ఏడాది వడక్కుపట్టి రామసామితో పాటు ఇంగ నాన్ తాను కింగ్ సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే రిలీజయ్యాయి. వడక్కుపట్టి రామసామి సినిమాతో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ కామెడీ మూవీని ప్రొడ్యూస్ చేసింది.