Samantha: బాలీవుడ్ స్టార్ రణ్‍వీర్ సింగ్‍తో సమంత-samantha ruth prabhu acts with ranveer singh for a new advertisement ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha: బాలీవుడ్ స్టార్ రణ్‍వీర్ సింగ్‍తో సమంత

Samantha: బాలీవుడ్ స్టార్ రణ్‍వీర్ సింగ్‍తో సమంత

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 15, 2024 08:19 PM IST

Samantha - Ranveer Singh: సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ సమంత.. రణ్‍వీర్ సింగ్‍తో స్క్రీన్ పంచుకున్నారు. అయితే, ఇది మూవీ కోసం మాత్రం కాదు. ఆ వివరాలివే..

Samantha: బాలీవుడ్ స్టార్ రణ్‍వీర్ సింగ్‍తో సమంత
Samantha: బాలీవుడ్ స్టార్ రణ్‍వీర్ సింగ్‍తో సమంత

Samantha Ruth Prabhu: హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం సినిమాల నుంచి విరామంలో ఉన్నారు. కొంతకాలంగా నటనకు బ్రేక్ ఇచ్చారు. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సామ్.. దానికి చికిత్స తీసుకునేందుకు విశ్రాంతి తీసుకుంటున్నారు. చివరగా గతేడాది సెప్టెంబర్‌లో రిలీజైన ఖుషి చిత్రంలో సమంత కనిపించారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీలో హీరోయిన్‍గా ఆమె నటించారు. ప్రస్తుతం సినిమాల నుంచి బ్రేక్‍లో ఉన్న సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‍గా ఉన్నారు. కాగా, తాజాగా బాలీవుడ్ స్టార్ రణ్‍వీర్ సింగ్‍తో ఓ యాడ్ కోసం స్క్రీన్ పంచుకున్నారు సమంత. ఆ వివరాలివే..

పూజరా కూడా..

పాపులర్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కోసం యాడ్‍లో సమంత, రణ్‍వీర్ సింగ్ కలిసి నటించారు. భారత స్టార్ క్రికెటర్ చతేశ్వర్ పూజర కూడా ఈ యాడ్‍లో ఉన్నారు. ఐపీఎల్ థీమ్‍తో ఆ నయా యాడ్ ఉంది.

ఐపీఎల్ వేలం జరుగుతుంటే.. పుజారాను కూడా ఆడిస్తామంటూ రణ్‍వీర్ సింగ్, సమంత వీడియో కాల్ చేసినట్టు ఈ యాడ్ మొదలైంది. పూజారా అశ్చర్యపోగా “నువ్వు కొట్టిన నాలుగు సిక్సర్లపై ఒట్టు” అని సమంత అంటారు. ఆ తర్వాత ఆటలో కాదని.. తనకు తినిపిస్తానని రణ్‍వీర్ సింగ్ అంటారు. ఆ తర్వాత రణ్‍వీర్, సమంత, పుజార ఐపీఎల్ మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నట్టు యాడ్ ముగిసింది. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతుండటంతో ట్రెండ్‍కు తగ్గట్టు ఈ యాడ్ తీసుకొచ్చింది జొమాటో.

సమంత మళ్లీ కనిపించటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మళ్లీ సినిమాలు చేయాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. సమంతను మళ్లీ వెండితెరపై చూడాలనుకుంటున్నామని చెబుతున్నారు.

సమంత నటించిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రావాల్సి ఉంది. ఇంకా స్ట్రీమింగ్ డేట్‍ను ప్రైమ్ వీడియో వెల్లడించలేదు. అమెరికన్ స్పై యాక్షన్ సిరీస్ సిటాడెల్‍కు ఇది ఇండియన్ వెర్షన్‍గా వస్తోంది.

2022 నుంచే సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే, ఆ ఇబ్బందితోనే యశోద, శాకుంతలం, ఖుషి చిత్రాలను ఆమె పూర్తి చేశారు. మయోసైటిస్‍తో తాను ఎంత వేదన అనుభవించానో పలుసార్లు సమంత స్వయంగా చెప్పారు. ఎమోషనల్ అయ్యారు. స్టార్ హీరోయిన్‍గా వెలుగొందుతున్న సమయంలోనే ఈ వ్యాధి వల్ల ఆమె బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. సమంత మళ్లీ రీ-ఎంట్రీ ఎప్పుడు ఇస్తారా అని సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

రణ్‍వీర్ సింగ్ లైనప్

రణ్‍వీర్ సింగ్ ప్రస్తుతం సింగమ్ అగైన్ చిత్రంలో నటిస్తున్నారు. అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‍గన్‍తో పాటు ఆ మూవీలో రణ్‍వీర్ కూడా ప్రధాన పాత్ర చేస్తున్నారు. పోలీస్ యాక్షన్ మూవీగా ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన సింగం అగైన్ రిలీజ్ కావాల్సి ఉండగా.. వాయిదా పడుతుందనే అంచనాలు ఉన్నాయి.

తదుపరి డాన్ 3 మూవీ చేయనున్నారు రణ్‍వీర్ సింగ్. ఈ చిత్రంలో కియారా అడ్వానీ హీరోయిన్‍గా నటించనున్నారు. ఫేమస్ డాన్ ఫ్రాంచైజీలో రానున్న ఈ మూడో భాగానికి పర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్నారు.