Salaar Release Trailer Date: సలార్ నుంచి కొత్త యాక్షన్ ట్రైలర్‌కు డేట్ ఖరారు! యాక్షన్ ఫీస్ట్
Salaar Release Trailer Date: సలార్ సినిమా నుంచి మరో ట్రైలర్ వచ్చేస్తోంది. ఈ ట్రైలర్ ఫుల్ పవర్ యాక్షన్ ప్యాక్డ్‌గా ఉండనుంది. ఈ ట్రైలర్ రిలీజ్‍కు డేట్ ఖరారైనట్టు తెలుస్తోంది.
Salaar Release Trailer Date: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా రిలీజ్‍కు రెడీ అవుతోంది. మరో ఆరు రోజుల్లో అంటే డిసెంబర్ 22వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్‍గా రిలీజ్ కానుంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ పవర్ ఫుల్ యాక్షన్ మూవీపై అంచనాలు అత్యంత భారీగా ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన ట్రైలర్, పాటతో సలార్‌పై క్రేజ్ మరింత పెరిగింది. అయితే, సినిమా విడుదలకు ముందు మరో ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ రెడీ అయింది.
సలార్ చిత్రం నుంచి మరో ట్రైలర్ రేపు (డిసెంబర్ 17) రిలీజ్ కానుందని సమాచారం బయటికి వచ్చింది. రిలీజ్ ట్రైలర్ పేరుతో ఇది రానుందని తెలుస్తోంది. ఈ ట్రైలర్‌లో ఎక్కువ భాగం యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయని తెలుస్తోంది. ఈ ట్రైలర్ కట్ ప్రభాస్ అభిమానులకు యాక్షన్ ఫీస్ట్‌లా ఉంటుందని టాక్.
సలార్ మూవీ నుంచి డిసెంబర్ 1న ఫస్ట్ ట్రైలర్ వచ్చింది. ఈ ట్రైలర్లో దేవ (ప్రభాస్), వరదరాజ మన్నార్ (పృథ్విరాజ్ సుకుమారన్) మధ్య స్నేహం, ఖాన్సార్ సిటీ కోసం జరిగే పోరాటాలు ఉన్నాయి. కష్టాల్లో ఉన్న వరదరాజ్‍కు ఆర్మీలా దేవ సాయం చేశాడన్న అంశాలు ఉన్నాయి. ఈ ట్రైలర్ ఎక్కువగా కథ గురించి తెలియజేసేలా ఉంది. అయితే, ఈ రెండో ట్రైలర్ మాత్రం యాక్షన్ ఫోకస్డ్‌గా ఉండనుందని తెలుస్తోంది.
సలార్ చిత్రంలో ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించగా.. శృతి హాసన్, జగపతిబాబు, బాబీ సింహా, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావు, శ్రీయారెడ్డి, రామచంద్ర రాజు కీరోల్స్ చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ సినిమాను నిర్మించారు.
సలార్ సినిమా ప్రోమోషన్ కోసం ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్, ప్రశాంత్ నీల్‍ను దర్శకధీరుడు, జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ షూటింగ్ కూడా పూర్తికాగా.. త్వరలోనే రిలీజ్ కానుంది. మరోవైపు, ప్రభాస్, పృథ్విరాజ్‍తో హీరోయిన్ శృతిహాసన్ కూడా ఓ ఇంటర్వ్యూ చేయనున్నట్టు తెలుస్తోంది.
సంబంధిత కథనం