Salaar OTT Release Date: సలార్ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.. మేకర్స్ డీల్ ఇదీ-salaar ott release date prabhas movie to stream from february tentatively ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Salaar Ott Release Date Prabhas Movie To Stream From February Tentatively

Salaar OTT Release Date: సలార్ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.. మేకర్స్ డీల్ ఇదీ

Hari Prasad S HT Telugu
Dec 26, 2023 03:02 PM IST

Salaar OTT Release Date: సలార్ మూవీ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడు? థియేటర్లలో దుమ్మురేపుతూ బాక్సాఫీస్ కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

సలార్ ఓటీటీ రిలీజ్ డేట్
సలార్ ఓటీటీ రిలీజ్ డేట్

Salaar OTT Release Date: సలార్ మూవీ గత శుక్రవారం (డిసెంబర్ 22) రిలీజై ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలుసు కదా. ఇక ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. రికార్డు స్థాయిలో రూ.100 కోట్లకు సలార్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ మూవీని ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి తొలి లేదా రెండో వారం నుంచి స్ట్రీమింగ్ చేయనుంది.

సలార్ మూవీ థియేటర్లలో రిలీజైన 45 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయొచ్చని నెట్‌ఫ్లిక్స్ తో మేకర్స్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ లెక్కన డిసెంబర్ 22న రిలీజైన ఈ మూవీ.. ఫిబ్రవరి తొలి లేదా రెండో వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత ప్రభాస్ కు ఓ మంచి హిట్ అందించిన సినిమా కావడంతో సలార్ ఓటీటీ రిలీజ్ కోసం కాస్త ఎక్కువ రోజులే వేచి చూడాల్సి రావచ్చు.

మరోవైపు తొలి రోజు తొలి షో నుంచే వచ్చిన పాజిటివ్ టాక్ తో సలార్ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూనే ఉంది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.178 కోట్ల ఓపెనింగ్ తో దుమ్ము రేపిన ఈ సినిమా.. నాలుగో రోజైన సోమవారం క్రిస్మస్ డే వరకు ఇండియాలోనే రూ.255 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకుపైగా వసూలు చేసింది.

సలార్ మూవీ ఓటీటీ హక్కులను రిలీజ్ కు ముందే నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ సినిమా రిలీజైన ఐదు భాషల్లోనూ నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుంది. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ కలిసి నటించిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కలెక్షన్లలో సగానికి పైగా ఏపీ, తెలంగాణల నుంచే రావడం విశేషం.

సలార్ ఎలా ఉందంటే?

ప్ర‌భాస్ వ‌న్‌మెన్ షోగా స‌లార్ నిలుస్తుంది. ప్ర‌భాస్ క‌నిపించే ప్ర‌తి సీన్ ఫ్యాన్స్‌కు విజువ‌ల్ ట్రీట్‌లా కిక్ ఇచ్చేలా ప్ర‌శాంత్ నీల్ జాగ్ర‌త్త‌ప‌డ్డాడు. యాక్ష‌న్ సీక్వెన్స్‌లో అయితే ప్ర‌భాస్ చెల‌రేగిపోయాడు. ఒక్కో యాక్ష‌న్ ఎపిసోడ్ ఒక్కో క్లైమాక్స్‌లా అనిపిస్తుంది.

వ‌ర‌ద‌రాజా మ‌న్నార్ పాత్ర‌కు పృథ్వీరాజ్ ప్రాణం పోశాడు. ఈ క్యారెక్ట‌ర్‌కు తాను త‌ప్ప మ‌రొక‌రు యాప్ట్ కాద‌ని అనిపించేలా న‌టించాడు. శృతిహాస‌న్ పాత్ర‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేదు. ప్ర‌భాస్ త‌ల్లి పాత్ర‌లో ఈశ్వ‌రీరావు మెప్పించింది. జ‌గ‌ప‌తిబాబు, శ్రియారెడ్డి, బాబీసింహా, టీనూ ఆనంద్‌తో పాటు డిఫ‌రెంట్ గెట‌ప్‌ల‌లో క‌నిపించారు.

IPL_Entry_Point