Salaar 4 Days Box Office Collections: సలార్ కలెక్షన్ల సునామీ.. ఇండియాలో నాలుగు రోజుల్లోనే రూ.255 కోట్లు
Salaar 4 Days Box Office Collections: సలార్ కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. తొలి నాలుగు రోజుల్లోనే ఇండియాలో రూ.250 కోట్ల కలెక్షన్ల మార్క్ దాటడం విశేషం.
Salaar 4 Days Box Office Collections: ప్రభాస్ నటించిన సలార్ మూవీ ఊహించినట్లే బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కొనసాగిస్తోంది. తొలి మండే టెస్టులోనూ పాసైంది. క్రిస్మస్ రోజు ఈ సినిమా ఇండియాలో రూ.45.77 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇండియాలో తొలి నాలుగు రోజులు కలిపి మొత్తంగా రూ.255 కోట్లు వసూలు చేయడం విశేషం.
ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే సలార్ తొలి మూడు రోజుల్లోనే రూ.402 కోట్లు వసూలు చేసినట్లు ఆ మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. నాలుగో రోజు రూ.450 కోట్ల మార్క్ దాటగా.. ఐదో రోజే రూ.500 కోట్ల టార్గెట్ కూడా రీచ్ కానుంది. ఈ లెక్కన హ్యాట్రిక్ పరాజయాల తర్వాత ప్రభాస్ ఫస్ట్ హిట్ కొట్టినట్లే. షారుక్ ఖాన్ డంకీని మించి సలార్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
హిందీ బెల్ట్ లో మాత్రమే కాస్త వెనుకబడినా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. క్రిస్మస్ రోజు సలార్ థియేటర్లలో ఏపీ, తెలంగాణల్లోనే అత్యధికంగా 63.41 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదైంది. రిలీజైన తొలి రోజే సలార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.178.7 కోట్ల వసూళ్లతో ఊచకోత కోసిన విషయం తెలిసిందే. ఆ జోరు తర్వాతి మూడు రోజుల్లో తగ్గుతూ వస్తున్నా.. ఇప్పటికీ డంకీని మించి వసూళ్లు సాధిస్తూనే ఉంది.
నైజాం ఏరియాలో దూకుడు
సలార్ మూవీ నైజాం ఏరియాలో దూసుకెళ్తోంది. సోమవారం క్రిస్మస్ తో ముగిసిన తొలి లాంగ్ వీకెండ్ లో నైజాం ఏరియాలోనే సలార్ 7951 షోలు పూర్తి చేసుకోవడం విశేషం. ఇక ఇప్పటి వరకూ 27.12 లక్షల మంది నైజాం ఏరియాలో ఈ సినిమా చూసినట్లు అంచనా. ఇక ఈ నాలుగు రోజుల్లోనే నైజాం ఏరియాలో సలార్ రూ.50 కోట్ల షేర్ వసూలు చేసింది.
సలార్ దూకుడు సంక్రాంతి వరకూ కొనసాగే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. అప్పటి వరకూ ప్రభాస్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పోటీ ఏమీ లేదు. తెలుగు రాష్ట్రాల్లో సలార్ థియేట్రికల్ హక్కులను ఏకంగా రూ.165 కోట్లకు అమ్మారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రెండో అత్యధిక మొత్తం ఇదే. ఇప్పటికే రూ.200 కోట్లకుపైగా కలెక్షన్లతో లాభాలు కూడా ప్రారంభమయ్యాయి.