Pushpa 2 Second Single: మీ పుష్ప, శ్రీవల్లి అంటూ పుష్ప 2 సెకండ్ సింగిల్‌పై రష్మిక చేసిన పోస్ట్ చూశారా?-rashmika mandanna shared a new poster saying your pushpa and srivalli pushpa 2 second single to be out tomorrow ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Second Single: మీ పుష్ప, శ్రీవల్లి అంటూ పుష్ప 2 సెకండ్ సింగిల్‌పై రష్మిక చేసిన పోస్ట్ చూశారా?

Pushpa 2 Second Single: మీ పుష్ప, శ్రీవల్లి అంటూ పుష్ప 2 సెకండ్ సింగిల్‌పై రష్మిక చేసిన పోస్ట్ చూశారా?

Hari Prasad S HT Telugu
May 28, 2024 12:17 PM IST

Pushpa 2 Second Single: పుష్ప 2 సెకండ్ సింగిల్ పై రష్మిక మందన్నా మంగళవారం (మే 28) ఓ అప్డేట్ ఇచ్చింది. మీ పుష్ప, శ్రీవల్లి అంటూ ఈ సాంగ్ పోస్టర్ ను రిలీజ్ చేయడం విశేషం.

మీ పుష్ప, శ్రీవల్లి అంటూ పుష్ప 2 సెకండ్ సింగిల్‌పై రష్మిక చేసిన పోస్ట్ చూశారా?
మీ పుష్ప, శ్రీవల్లి అంటూ పుష్ప 2 సెకండ్ సింగిల్‌పై రష్మిక చేసిన పోస్ట్ చూశారా?

Pushpa 2 Second Single: పుష్ప 2 మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప మెగా హిట్ అయింది. ఇక ఇప్పుడీ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రాబోతోంది. ఇప్పటికే మేకర్స్ ఈ సాంగ్ రిలీజ్ డేట్, టైమ్ అనౌన్స్ చేయగా.. తాజాగా మూవీలో శ్రీవల్లి పాత్ర పోషించిన రష్మిక మందన్నా ఓ కొత్త పోస్టర్ ను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.

మీ పుష్ప, శ్రీవల్లి

మరోసారి పుష్ప 2 సెకండ్ సింగిల్ డేట్, టైమ్ రివీల్ చేస్తూ రష్మిక షేర్ చేసిన ఫొటో ఎంతో క్యూట్ గా ఉంది. ఇందులో అల్లు అర్జున్ తో కలిసి రష్మిక డ్యాన్స్ చేయడం చూడొచ్చు. మీ పుష్ప, శ్రీవల్లి అనే క్యాప్షన్ కు హార్ట్ ఎమోజీని జోడించి ఈ పోస్ట్ చేసింది. ఇందులో ఓ వెరైటీ ఔట్‌ఫిట్ లో రష్మిక కనిపించింది. పుష్ప 2 సెకండ్ సింగిల్ రేపు ఉదయం 11.07 గంటలకు రాబోతోందని రష్మిక చెప్పింది.

ఈ పోస్ట్ ఇన్‌స్టాంట్ హిట్ అయింది. నిమిషాల్లోనే లక్షల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. ఈ సెకండ్ సింగిల్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న అభిమానులు.. రష్మిక చేసిన ఈ పోస్టుపై కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది ఫైర్, హార్ట్ ఎమోజీలు పోస్ట్ చేశారు. అల్లు అర్జున్, రష్మిక జోడీ చాలా బాగుందని, ఈ పాట కోసం ఎదురు చూస్తున్నట్లు మరికొందరు చెప్పారు.

పుష్ప 2 సెకండ్ సింగిల్ సూసేకి..

పుష్ప 2 మూవీ నుంచి పుష్ప పుష్ప అంటూ ఫస్ట్ సింగిల్ వచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ సూసేకి అంటూ రాబోతోంది. ఈ పాట రాబోతున్న విషయాన్ని గతంలోనే రష్మిక పాడి మరీ చెప్పింది. ఇక మూవీలో ఈ పాటను సింగింగ్ క్వీన్ శ్రేయా ఘోషాల్ పాడింది. తెలుగుతోపాటు మరో ఐదు భాషల్లోనూ ఆమె పాడటం విశేషం. ఇది సెకండ్ సింగిల్ పై మరింత ఆసక్తి రేపుతోంది.

ముఖ్యంగా పుష్ప ది రైజ్ సినిమాలోని సాంగ్స్ బాగా హిట్టయ్యాయి. శ్రీవల్లి పాట ఇప్పటికీ మార్మోగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పుష్ప 2 నుంచి వచ్చే పాటలపై ఆసక్తి నెలకొంది. పుష్ప తొలి పార్ట్ ను మించి రెండో పార్ట్ పాటలు ఉంటాయన్న అంచనాలు అభిమానుల్లో ఉన్నాయి. మరి ఈ సూసేకి పాట ఎలా ఉంటుందో చూడాలి.

పుష్ప 2 సినిమా నుంచి ‘సూసేకి’ అనే రెండో పాట మే 29వ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు సోమవారమే (మే 27) మేకర్స్ వెల్లడించారు. ఈ రెండో పాట కూడా ఆరు భాషల్లో రానుంది. శ్రేయా ఘోషల్‍తో ఓ పోస్టర్ రిలీజ్ చేసింది పుష్ప 2 టీమ్. “ది కపుల్ సాంగ్‍తో ఆరు భాషల్లో సంగీత ప్రియులను శ్రేయా ఘోషల్ అలరిస్తారు. మే 29 ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ఫుల్ సాంగ్ వస్తుంది” అని మైత్రీ మూవీ మేకర్స్ నేడు ట్వీట్ చేసింది.

Whats_app_banner