Pushpa 2 Second Song : పుష్ప 2 రెండో పాటను 6 భాషల్లో పాడిన స్టార్ సింగర్.. సాంగ్ రిలీజ్‍ డేట్, టైమ్ ఇదే-pushpa 2 the rule second single shreya ghoshal sang in 6 languages sooseki couple song release date time ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Second Song : పుష్ప 2 రెండో పాటను 6 భాషల్లో పాడిన స్టార్ సింగర్.. సాంగ్ రిలీజ్‍ డేట్, టైమ్ ఇదే

Pushpa 2 Second Song : పుష్ప 2 రెండో పాటను 6 భాషల్లో పాడిన స్టార్ సింగర్.. సాంగ్ రిలీజ్‍ డేట్, టైమ్ ఇదే

Chatakonda Krishna Prakash HT Telugu
May 27, 2024 08:23 PM IST

Pushpa 2 Second Song: 'పుష్ప 2: ది రూల్' మూవీ నుంచి రెండో పాట వచ్చేస్తోంది. ఈ సాంగ్‍ను ఆరు భాషల్లో ఒకే సింగర్ ఆలపించారు. ఈ సాంగ్ రిలీజ్, డేట్ టైమ్ కూడా ఇక్కడ చూడండి.

Pushpa 2 Second Song date: పుష్ప 2 రెండో పాటను ఆరు భాషల్లో పాడిన స్టార్ సింగర్.. సాంగ్ రిలీజ్‍ డేట్, టైమ్ ఇదే
Pushpa 2 Second Song date: పుష్ప 2 రెండో పాటను ఆరు భాషల్లో పాడిన స్టార్ సింగర్.. సాంగ్ రిలీజ్‍ డేట్, టైమ్ ఇదే

Pushpa 2 Second Single: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ మోస్ట్ అవైటెడ్ చిత్రంగా ఉంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. బ్లాక్‍బస్టర్ పుష్పకు సీక్వెల్‍గా వస్తున్న ఈ చిత్రంపై నేషనల్ రేంజ్‍లో ఫుల్ క్రేజ్ నెలకొని ఉంది. ఇప్పుడు పుష్ప 2: ది రూల్ చిత్రం నుంచి రెండో పాట రెడీ అయింది. ఈ కపుల్ సాంగ్ మే 29న రిలీజ్ కానుంది.

yearly horoscope entry point

ఆరు భాషల్లోనూ శ్రేయా ఘోషల్

పుష్ప 2లోని ఈ ‘సూసేకి’ కపుల్ సాంగ్‍ను స్టార్ సింగర్, క్వీన్ ఆఫ్ మెలోడీ శ్రేయా ఘోషల్ పాడారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లోనూ ఆమే ఆలపించారు. ఇలా.. ఆరు భాషల్లోనూ శ్రీయానే ఈ పాట పాడారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (మే 27) వెల్లడించింది. దేవీ శ్రీప్రసాద్ ఈ పాటకు మెలోడీ ట్యూన్ ఇచ్చారు.

సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..

పుష్ప 2 సినిమా నుంచి ‘సూసేకి’ అనే రెండో పాట మే 29వ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఈ రెండో పాట కూడా ఆరు భాషల్లో రానుంది. శ్రేయా ఘోషల్‍తో ఓ పోస్టర్ నేడు రిలీజ్ చేసింది పుష్ప 2 టీమ్. “ది కపుల్ సాంగ్‍తో ఆరు భాషల్లో సంగీత ప్రియులను శ్రేయా ఘోషల్ అలరిస్తారు. మే 29 ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ఫుల్ సాంగ్ వస్తుంది” అని మైత్రీ మూవీ మేకర్స్ నేడు ట్వీట్ చేసింది.

హీరోయిన్ రష్మిక మందన్నాతో ఇటీవలే ఈ రెండో పాట అనౌన్స్‌మెంట్ వీడియోను తీసుకొచ్చింది మూవీ టీమ్. “సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి” అంటూ ఈ సాంగ్ ఉంది. అప్పుడే డేట్, టైమ్‍ను కూడా మూవీ టీమ్ వెల్లడించింది. నేడు సింగర్ గురించి అప్‍డేట్ ఇచ్చింది.

పుష్ప 2 నుంచి ఫస్ట్ సాంగ్ మే 1వ తేదీన వచ్చింది. ‘పుష్ప.. పుష్ప’ అంటూ వచ్చిన ఈ మాస్ సాంగ్‍కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు, హిందీతో పాటు మిగిలిన భాషల్లోనూ ఈ పాట పాపులర్ అయింది. ఇప్పుడు, ఈ రెండో సాంగ్ మెలోడీగా రానుంది.

స్పెషల్ సాంగ్ కోసం..

పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. బాలీవుడ్ భామలు తృప్తి డిమ్రి, జాన్వీ కపూర్‌ల్లో ఒకరితో ఈ సాంగ్ చేయాలని మూవీ టీమ్ ఆలోచిస్తోందని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.

పుష్ప 2 చిత్రంలో అల్లు అర్జున్, రష్మికతో పాటు ఫాహద్ ఫాజిల్, జగదీశ్ ప్రతాప్ బండారీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్ కీలకపాత్రలు పోషించారు. భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్సులతో ఈ మూవీని రూపొందిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఆగస్టు 15న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.

Whats_app_banner