OTT Crime Thriller: థియేటర్లలో నిరాశపరిచినా.. ఓటీటీలో అదరగొడుతున్న పాయల్ రాజ్‍పుత్ సినిమా.. ఓ మైల్‍స్టోన్ దాటేసింది
Rakshana OTT Streaming: రక్షణ సినిమా తాజాగా ఓటీటీలో ఓ మైల్‍స్టోన్ దాటింది. థియేటర్లలో డిజాస్టర్ అయిన ఈ చిత్రం ఓటీటీలో బాగా పర్ఫార్మ్ చేస్తోంది. హీరోయిన్ పాయర్ రాజ్‍పుత్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు.
హీరోయిన్ పాయల్ రాజ్‍పుత్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రధాన పాత్ర పోషించిన రక్షణ చిత్రం థియేటర్లలో పెద్దగా ఆడలేదు. ఈ ఏడాది జూన్ 7వ తేదీన ఈ మూవీ విడుదల కాగా బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. ప్రణదీప్ ఠాకూర్ ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు దర్శకత్వం వహించారు. రక్షణ చిత్రం థియేటర్లలో నిరాశపరిచినా.. ఓటీటీలో మంచి వ్యూస్ దక్కించుకుంటోంది.
60 మిలియన్ మినిట్స్ దాటేసి..
రక్షణ చిత్రం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆగస్టు 1వ తేదీన స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. పాయల్ రాజ్‍పుత్ మెయిన్ రోల్ కావడంతో ఈ మూవీకి మొదటి నుంచి మంచి వ్యూస్ వచ్చాయి. ఈ చిత్రం తాజాగా ఆహా ఓటీటీలో 60 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటేసింది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది.
రక్షణ సినిమా థియేటర్లలో మంచి అంచనాలతోనే అడుగుపెట్టింది. మంగళవారం చిత్రంతో పాయల్ సూపర్ హిట్ కొట్టడంతో ఈ మూవీపై కూడా హైప్ ఏర్పడింది. వివాదాలతోనూ రక్షణ మూవీ వార్తల్లో నిలిచింది. నాలుగేళ్ల క్రితమే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. అయితే, విడుదల కాలేదు. బకాయిలు ఇవ్వకుండా ప్రమోషన్లకు రావాలని దర్శక నిర్మాత రణ్‍దీప్ ఠాకూర్ బెదిరిస్తున్నారని పాయల్ రాజ్‍పుత్ ఆరోపించారు. ప్రమోషన్లకు రాకపోతే బ్యాన్ చేయాలని నిర్మాతల మండలికి పాయల్‍పై ఠాకూర్ ఫిర్యాదు చేశారు. ఈ దుమారం తర్వాత ఎట్టకేలకు జూన్ 7న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే, అంచనాలకు తగ్గట్టు బాక్సాఫీస్ వద్ద పర్ఫార్మ్ చేయలేకపోయింది.
రక్షణ సినిమాలో ఏసీపీ కిరణ్‍గా నటించారు రాయల్ రాజ్‍పుత్. మానస్ నాగులపల్లి, శివన్నారాయణ, వినోద్ బాల, రాజీవ్ కనకాల, ఆనంద్ చక్రపాణి కీరోల్స్ చేశారు. డైరెక్టర్ ప్రణదీప్ ఠాకూర్ ఈ మూవీని తెరకెక్కించిన విధానంపై మిశ్రమ స్పందన వచ్చింది. ముఖ్యంగా టెక్నికల్‍గా ఈ చిత్రం మెరుగ్గా లేదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ మూవీకి మహతీ స్వరసాగర్ సంగీతం అందించారు.
కిల్లర్‌ను పట్టుకునేందుకు..
ఓ కిల్లర్‌ను పట్టుకునేందుకు ఏసీపీ కిరణ్ (పాయల్ రాజ్‍పుత్) దర్యాప్తు చేయడం, ఈ క్రమంలో ఆమెకు ఎదురయ్యే సవాళ్లతో రక్షణ మూవీ తెరకెక్కింది. ఐపీఎస్ శిక్షణ సమయంలో కిరణ్ స్నేహితురాలు ప్రియ ఆత్మహత్య చేసుకుంటుంది. అది హత్య అని అనుమానం ఉన్నా ఆధారాలు లేకపోవటంతో కిరణ్ ఏమీ చేయలేకపోతుంది. ట్రైనింగ్ పూర్తయ్యాక ఏసీపీ అవుతుంది కిరణ్. అయితే, ఆమెను ఇబ్బంది పెట్టేలా వెబ్‍సైట్లలో ఓ వ్యక్తి ఫొటోలు, వీడియోలు పెడుతుంటాడు. అయితే, ఇలా చేసే అరుణ్ (మానస్) ఓ రోజు హఠాత్తుగా ఆత్మహత్య చేసుకొని కిరణ్ కారణమని చెబుతాడు. అరుణ్‍ది కూడా హత్యేనని కిరణ్‍కు అర్థమవుతుంది. ప్రియ, అరుణ్‍లను హత్య చేసింది ఎవరు? కిరణ్‍ను ఎందుకు లక్ష్యంగా పెట్టుకున్నారనేదే రక్షణ సినిమా కథగా ఉంది.
స్ట్రీమింగ్‍కు బర్త్‌డే బాయ్
తెలుగు కామెడీ థ్రిల్లర్ సినిమా బర్త్‌డే బాయ్ ఆహా ఓటీటీలో శుక్రవారం (ఆగస్టు 9) స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రంలో రవికృష్ణ, మణి, రాజా అశోక్, విక్రాంత్ వేద్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం జూలై 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీ డైరెక్టర్ విస్కీ.. తన ముఖం కనపడకుండా మూవీ ప్రమోషన్లకు వచ్చి హాట్ టాపిక్ అయ్యారు. బర్త్‌డే బాయ్ సినిమాను ఆహాలో వీక్షించొచ్చు.