OTT Investigative Thriller: ఓటీటీలోకి వచ్చేస్తున్న పాయల్ రాజ్‍పుత్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Rakshana OTT Release Date: రక్షణ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. పాయల్ రాజ్‍పుత్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం సుమారు రెండు నెలలకు ఓటీటీలోకి వస్తోంది. ఈ మూవీ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్‍కు వస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
హీరోయిన్ పాయల్ రాజ్‍పుత్ గతేడాది మంగళవారం సినిమాతో మంచి హిట్ సాధించారు. ఆ చిత్రంలో మెయిన్ రోల్ చేసిన పాయల్ యాక్టింగ్‍కు ప్రశంసలు దక్కడంతో పాటు కమర్షియల్‍గానూ ఆ చిత్రం సక్సెస్ అయింది. పాయల్ పోలీస్ ఆఫీసర్‌గా మెయిన్ రోల్ చేసిన ‘రక్షణ’ సినిమా ఈ ఏడాది జూన్ 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. నాలుగేళ్ల కిందటే షూటింగ్ అయిన ఈ మూవీ.. కొన్ని వివాదాల తర్వాత ఎట్టకేలకు విడుదల అయింది. అయితే, ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. రక్షణ సినిమా తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‍ను లాక్ చేసుకుంది.
స్ట్రీమింగ్ తేదీ, ప్లాట్‍ఫామ్
రక్షణ సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఆగస్టు 1వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓటీటీ డేట్‍పై అధికారిక ప్రకటన వచ్చింది.
థియేటర్లలో రిలీజైన సుమారు 8 వారాలకు రక్షణ సినిమా ఓటీటీలో అడుగుపెట్టనుంది. ముందుగా ఓటీటీ హక్కుల విషయంలో ఆలస్యమైంది. అయితే, ఎట్టకేలకు ఆహా తీసుకుంది. దీంతో ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఆగస్టు 1న ఈ చిత్రం మూవీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది.
రక్షణ చిత్రానికి ప్రణదీప్ ఠాకూర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి నిర్మాత కూడా ఆయనే. రెండు ఆత్మహత్యల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో పాయల్‍తో పాటు శివన్నారాయణ, మానస్, రాజీవ్ కనకాల, వినోద్ బాల, ఆనంద్ చక్రపాణి కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి మహతీ స్వరసాగర్ సంగీతం అందించగా.. అనిల్ భండారీ సినిమాటోగ్రఫీ చేశారు. రక్షణ సినిమాకు థియేటర్లలో అంచనాలకు తగ్గట్టు పర్ఫార్మ్ చేయలేకపోయింది. కలెక్షన్లను ఎక్కువగా రాబట్టుకోలేకపోయింది.
రక్షణ సినిమా స్టోరీ
కిరణ్ (పాయల్ రాజ్‍పుత్) ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో స్నేహితురాలు ప్రియ ఆత్మహత్య చేసుకుంటుంది. అయితే, అది హత్య అని కిరణ్ నమ్ముతుంది. అయితే ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నిరూపించలేకపోతుంది. కొన్నేళ్లకు ఏసీపీగా కిరణ్ బాధ్యతలు తీసుకుంటుంది. కిరణ్ ప్రతిష్ఠకు భంగం కలిగే పనులు చేస్తుంటాడు అరుణ్ (మానస్) అనే వ్యక్తి. కిరణ్ ఫొటోలు వెబ్‍సైట్లలో పెట్టడం లాంటివి చేస్తుంటాడు. మొత్తానికి అరుణ్‍ను కిరణ్ కనుగొంటుంది. అయితే, ఒకరోజు అరుణ్ చనిపోతాడు. కిరణ్ వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ వీడియో పెడతాడు. దీంతో కిరణ్ సస్పెండ్ అవుతుంది. అయితే, తన స్నేహితురాలు ప్రియతో పాటు అరుణ్‍ను ఎవరో చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారని కిరణ్‍కు అర్థమవుతుంది. మరి ఈ ఇద్దరిని చంపింది ఎవరు? కిరణ్‍నే అతడు ఎందుకు టార్గెట్ చేశాడు? అరుణ్‍తో ఆ కిల్లర్‌కు ఉన్న సంబంధం ఏంటి? అనే అంశాలు రక్షణ మూవీలో ఉంటాయి.
వివాదం
రక్షణ సినిమా విషయంలో రిలీజ్‍కు ముందు పెద్ద వివాదమే నడిచింది. తనకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా ప్రమోషన్లకు రావాలని బెదిరిస్తున్నారని నిర్మాతపై పాయల్ రాజ్‍పుత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అయితే, ప్రమోషన్లకు రాని కారణంగా టాలీవుడ్ నుంచి పాయల్‍ను బహిష్కరించాలని నిర్మాత ప్రణదీప్ ఠాకూర్ ఫిర్యాదు చేశారు. అయితే, ఈ వివాదం సద్దుమణిగి జూన్ 7నే ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది.
టాపిక్