Reporter Movie Review: రిపోర్ట‌ర్ మూవీ రివ్యూ - త్రిష యాక్ష‌న్ సినిమా ఎలా ఉందంటే-raangi movie telugu review trisha reporter movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Reporter Movie Review: రిపోర్ట‌ర్ మూవీ రివ్యూ - త్రిష యాక్ష‌న్ సినిమా ఎలా ఉందంటే

Reporter Movie Review: రిపోర్ట‌ర్ మూవీ రివ్యూ - త్రిష యాక్ష‌న్ సినిమా ఎలా ఉందంటే

Nelki Naresh Kumar HT Telugu
Feb 02, 2023 06:18 AM IST

Raangi Movie Review: త్రిష ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన రాంగి సినిమా నెట్‌ఫ్లిక్స్‌తో పాటు స‌న్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజైంది. మురుగ‌దాస్ క‌థ‌ను అందించిన ఈసినిమాకు ఎమ్‌.శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

త్రిష
త్రిష

Raangi Movie Review: సుదీర్ఘ కెరీర్‌లో ఎక్కువ‌గా ప్రేమ‌క‌థా చిత్రాల్లోనే న‌టించింది త్రిష (Trisha). గ‌త సినిమాల‌కు భిన్నంగా యాక్ష‌న్ ప్ర‌ధాన క‌థాంశాన్ని ఎంచుకొని త్రిష చేసిన తాజా త‌మిళ సినిమా రాంగి.

కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌ మురుగ‌దాస్ (Murugadas) ఈ సినిమాకు క‌థ‌ను అందించ‌గా ఎమ్‌. శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ (Lyca Productions) సంస్థ నిర్మించింది. గ‌త నెల‌లో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా ఇటీవ‌లే స‌న్ నెక్స్ట్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ (Netflix) ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తెలుగులో రిపోర్ట‌ర్ పేరుతో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఉగ్ర‌వాద నేప‌థ్యానికి ప్రేమ‌క‌థ‌ను జోడిస్తూ రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే...

జ‌ర్న‌లిస్ట్ శివంగి

రుద్ర శివంగి (త్రిష‌) థ‌ర్డ్ ఐ ఛాన‌ల్‌లో రిపోర్ట‌ర్‌గా ప‌నిచేస్తుంటుంది. నిజాల కోసం నిర్భ‌యంగా పోరాడుతుంటుంది. త‌న అన్న‌య్య కూతురు సుష్మిత పేరుతో మ‌రో అమ్మాయి ఫేక్ పేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసి అశ్లీల చాట్ చేస్తున్న‌ద‌ని శివంగికి తెలుస్తుంది. ఆ ఫేక్ అకౌంట్ ద్వారా సుష్మిత‌ను ఫాలో అవుతోన్న వారంద‌రిని క‌లిసి వార్నింగ్ ఇస్తుంది శివంగి.

కానీ ఆలిమ్ అనే టెర్ర‌రిస్ట్ మాత్రం సుష్మిత‌ను గాఢంగా ప్రేమిస్తాడు. ఆలిమ్ ఎవ‌రో తెలుసుకోవాల‌ని సుష్మిత పేరుతో శివంగి చాట్ చేయ‌డం మొద‌లుపెడుతుంది? అత‌డు శివంగికి పంపించిన ఓ ఫోటో ఇండియాలో సెన్సేష‌న‌ల్ అవుతుంది? దాంతో చాటింగ్‌ను కొన‌సాగిస్తుంది శివంగి?

ఆ చాటింగ్ వ‌ల్ల ఆమెకు ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి? త‌న వ‌ల్ల పెద్ద ప్ర‌మాదంలో చిక్కుకున్న మేన కోడ‌లిని శివంగి ఎలా కాపాడింది? ఆలిమ్ ఎవ‌రు? అత‌డు ఎందుకు టెర్ర‌రిస్ట్‌గా మారాడు? ఆలిమ్‌ను ప‌ట్టుకోవ‌డానికి ఎఫ్‌బీఐ వేసిన ప్లాన్‌లో శివంగి, సుష్మిత ఎలా భాగ‌మ‌య్యారు అన్న‌దే రాంగి(Reporter Movie Review) సినిమా క‌థ‌.

అగ్ర రాజ్యాల దోపిడి...

అపార ఖ‌నిజ సంప‌ద ఉన్న చిన్న దేశాల‌ను త‌మ అవ‌స‌రాల కోసం అగ్ర రాజ్యాలు ఎలా వాడుకుంటున్నాయి? ఆ దేశాల్లో క‌ల్లోలాన్ని సృష్టిస్తూ అక్క‌డి సంప‌ద‌ను ఏ విధంగా దోచుకుంటున్నాయ‌నే పాయింట్‌కు స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌ను జోడిస్తూ ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ రాంగి(Reporter Movie Review) క‌థ‌ను రాశారు.

త‌న హ‌క్కులు సిద్ధాంతాల కోసం ప‌దిహేడేళ్ల వ‌య‌సులోనే తుపాకి ప‌ట్టిన ఓ కుర్రాడి మ‌న‌సులో ప్రేమ ఎలాంటి శాంతిని నింపింది? ప్రేమ కోసం అత‌డు చేసిన త్యాగం ఏమిట‌న్న‌ది హృద్యంగా చూపించినసినిమా ఇది.

శివంగి ప‌రిశోధ‌న‌...

డైరెక్ట్‌గా ప్రేమ‌క‌థ‌ను చూపించ‌కుండా త్రిష చేసే ప‌రిశోధ‌న ద్వారా ఆలిమ్ జీవితంలోని ఒక్కో చేదు సంఘ‌ట‌న‌ను చూపిస్తూ సినిమాను న‌డిపించారు ద‌ర్శ‌కుడు శ‌ర‌వ‌ణ‌న్‌. మ‌రోవైపు ఫేక్ అకౌంట్స్ కార‌ణంగా సామాన్యుల‌కు ఎదుర‌య్యే ఇబ్బందుల‌ను సందేశాత్మ‌కంగా ఈ సినిమాలో చూపించారు.

డ్రామా బోర్‌...

రాంగి సినిమా కోసం ద‌ర్శ‌కుడు ఎంచుకున్న కోర్ పాయింట్ బాగున్నా దానిని అర్థ‌వంతంగా చెప్ప‌లేక‌పోయారు. త్రిష క్యారెక్ట‌ర్ చుట్టూ నెల‌కొన్న డ్రామా పూర్తిగా బోర్ కొట్టిస్తుంది. ఆరంభంలో వ‌చ్చే స‌న్నివేశాల‌న్నీ న‌త్త‌న‌డ‌క‌న సాగుతాయి. ఆలిమ్ క్యారెక్ట‌ర్ ఎంట‌రైన త‌ర్వాతే సినిమా ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఆలిమ్ సిద్ధాంతాల‌కు త్రిష ఆక‌ర్షితురాల‌వ్వ‌డాన్ని స‌రిగా ప్ర‌జెంట్ చేయ‌లేక‌పోయారు.

త్రిష యాప్ట్ కాదు...

రాంగి సినిమాలో డేరింగ్ డాషింగ్ రిపోర్ట‌ర్‌గా త్రిష క‌నిపించింది. యాక్ష‌న్ ఇమేజ్ ఉన్న రోల్‌లో త్రిష పూర్తిగా తేలిపోయింది. ఈ పాత్ర‌కు ఆమె స‌రైన యాప్ట్ కాద‌నిపించింది. ఆలిమ్ అనే ట్రెర్ర‌రిస్ట్‌గా అబ్దు మాలికోవ్ న‌ట‌న బాగుంది. సుష్మిత ప్రేమ కోసం ప‌రిత‌పించే యువ‌కుడి పాత్ర‌లో రియ‌లిస్టిక్‌గా అత‌డి క్యారెక్ట‌ర్ సాగింది.

Reporter Movie Review -డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ

రాంగి ఓ భిన్న‌మైన ప్రేమ‌క‌థా చిత్రం. ఆలోచింప‌జేసే క‌థ ఉన్నా అర్థ‌వంతంగా సినిమాను ప్ర‌జెంట్ చేయ‌లేక‌పోయారు.

బ‌లాలు

క‌థ‌

విజువ‌ల్స్‌

ఆలిమ్ యాక్టింగ్‌

బ‌ల‌హీన‌త‌లు

బోరింగ్ స్క్రీన్‌ప్లే

త్రిష క్యారెక్ట‌రైజేష‌న్‌

Whats_app_banner