Pushpa 2 OTT: పుష్ప 2 హక్కులను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్! ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే మూడు రెట్లకుపైగా ధరకు?-pushpa 2 ott digital streaming rights reportedly bags by amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Pushpa 2 Ott Digital Streaming Rights Reportedly Bags By Amazon Prime Video

Pushpa 2 OTT: పుష్ప 2 హక్కులను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్! ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే మూడు రెట్లకుపైగా ధరకు?

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 25, 2023 02:08 PM IST

Pushpa 2 OTT: ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ఓటీటీ హక్కుల గురించి సమాచారం లీకైంది. భారీ ధరకు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకునేందుకు ఓ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. ఆ వివరాలివే..

పుష్ప 2 పోస్టర్
పుష్ప 2 పోస్టర్ (twitter)

Pushpa 2 OTT: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో ‘పుష్ప 1: ది రైజ్’ సినిమా భారీ బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. పుష్ప పాన్ ఇండియా రేంజ్‍లో గ్రాండ్ సక్సెస్ అయింది. ఇప్పుడు అందరూ ‘పుష్ప 2: ది రూల్’ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది (2024) ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 రిలీజ్ కానుంది. కాగా, తాజాగా పుష్ప 2 సినిమా ఓటీటీ ఒప్పందం గురించి సమాచారం బయటికి వచ్చింది.

‘పుష్ప 2: ది రూల్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు తాజాగా సమాచారం బయటికి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్‌తో ఈ ఓటీటీ డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. ముందుగా పుష్ప 2 హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ పోటీ పడింది. అయితే, ఈ సీక్వెల్ రైట్స్ కోసం మేకర్స్ భారీగా డిమాండ్ చేయటంతో అమెజాన్ ప్రైమ్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.

2021లో వచ్చిన ‘పుష్ప 1: ది రైజ్’ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.30కోట్లకు దక్కించుకుంది. దానికి సీక్వెల్ అయిన ‘పుష్ప 2: ది రూల్’ హక్కులను అంతకంటే మూడు రెట్లు అధికంగా చెల్లించి నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. సుమారు రూ.100కోట్లకు ఈ ఓటీటీ డీల్ జరిగినట్టు టాక్. పుష్ప 2 సినిమాకు ఫుల్ క్రేజ్ ఉండటంతో ఇంత భారీ మొత్తం చెల్లించేందుకు నెట్‍ఫ్లిక్స్ ముందుకు వచ్చిందట.

పుష్ప 1 సినిమాలో సమంత చిందేసిన స్పెషల్ సాంగ్ మంచి హిట్ అయింది. సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‍గా నిలిచింది. సీక్వెల్ కోసం కోసం కూడా మూవీ యూనిట్ ఆమెను సంప్రదించినట్టు ఇటీవల రూమర్లు వచ్చాయి. మరి సమంత అంగీకరిస్తారా లేక వేరే నటితో స్పెషల్ సాంగ్ చేయిస్తారా అనేది చూడాలి.

‘పుష్ప 2: ది రూల్’ చిత్రాన్ని మరింత గ్రాండ్‍గా, మరిన్ని జాగ్రత్తలతో దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జోరుగా సాగుతోంది. దేవీ శ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పుష్ప 2 సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‍గా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్, జగదీశ్ ప్రతాప్ భండారీ, జగపతి బాబు, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. 2024 ఆగస్టు 15వ తేదీన తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ‘పుష్ప 2: ది రూల్’ రిలీజ్ కానుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం