Salaar 2 Release Date: ప్రభాస్ సలార్ 2 రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నిర్మాత .. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లా ఉంటుందంటూ!-producer vijay kiragandur confirms salaar part 2 release date and shooting ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Producer Vijay Kiragandur Confirms Salaar Part 2 Release Date And Shooting

Salaar 2 Release Date: ప్రభాస్ సలార్ 2 రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నిర్మాత .. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లా ఉంటుందంటూ!

Sanjiv Kumar HT Telugu
Jan 04, 2024 12:19 PM IST

Producer Vijay Kiragandur About Salaar 2: ప్రభాస్ సలార్‌తో ఊచకోత కోస్తే.. సలార్ 2 దానికి మించి ఉంటుందని నిర్మాత విజయ్ కిరగందూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అంతేకాకుండా సలార్ 2 పాపులర్ వెబ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్‌లా ఎన్నో సర్‌ప్రైజ్‌లతో ఉంటుందన్నారు.

ప్రభాస్ సలార్ 2 రిలీజ్ అప్పుడే.. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లా ఉంటుంది: నిర్మాత కామెంట్స్
ప్రభాస్ సలార్ 2 రిలీజ్ అప్పుడే.. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లా ఉంటుంది: నిర్మాత కామెంట్స్

Salaar 2 And Game Of Thrones: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా కాలం తర్వాత అభిమానులు మెచ్చే లుక్‌ అండ్ యాక్షన్ సీక్వెన్స్‌తో అదరగొట్టాడు. ప్రస్తుతం సలార్ మేనియా నడుస్తోంది. డిసెంబర్ 22న విడుదలైన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంపర కొనసాగిస్తోంది. సలార్‌లో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్, స్వాగ్ అభిమానులకు హై ఫీస్ట్ ఇచ్చింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇక సలార్ క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది.

సలార్ పార్ట్ 1 సీజ్‌ఫైర్ క్లైమాక్స్ ట్విస్ట్‌తో సలార్ శౌర్యాంగ పర్వం అదేనండి సలార్ 2పై (Salaar Part 2 Shouryanga Parvam) మరింతగా భారీ అంచనాలు నెలకొన్నాయి. సలార్ 2 ఇంకెలా ఉండనుందో అని అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఆతృతగా ఉన్నారు. సలార్ పార్ట్ 1లోని ప్రశ్నలకు సలార్ 2లో ఎలా సమాధానం ఇస్తారో అని ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సలార్ 2 షూటింగ్, రిలీజ్ గురించి హోంబలే ఫిల్మ్స్ నిర్మాత విజయ్ కిరగందూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ప్రపంచ సినీ చరిత్రలోనే టాప్ సిరీస్‌గా పేరొందిన గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లాగా ఉంటుందని, అందులో ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉంటాయని నిర్మాత విజయ్ కిరగందూర్ చెప్పిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. "సలార్ 2 స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. కాబట్టి సలార్ 2 షూటింగ్ ఎప్పుడైనా ప్రారంభించే అవకాశం ఉంది. ప్రభాస్, ప్రశాంత్ కూడా వీలైనంత త్వరగా సలార్‌ 2ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. వచ్చే 15 నెలల్లో సలార్ 2 పూర్తి చేయాలని మేమంతా చర్చలు జరిపి నిర్ణయించుకున్నాం" అని విజయ్ కిరగందూర్ తెలిపారు.

అంతేకాకుండా "సలార్ 2 చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో 2025లో విడుదల చేస్తాం. సలార్‌కు వస్తున్న ఫీడ్ బ్యాక్ నాకు నచ్చింది. వరల్డ్ వైడ్‌గా సలార్ అనేది ప్రభాస్ ఫ్యాన్స్‌కు సెలబ్రేషన్ లాంటిది. తమ అభిమాన నటుడిని చాలా కాలం తర్వాత యాంగ్రీ మ్యాన్‌గా చూశారు. సలార్ సినిమా వసూళ్లపై సంతృప్తిగా ఉన్నాం. కొంత నెగెటివిటీ ఉన్నా మేకింగ్ విషయంలో ఎవరూ విమర్శించలేదు" అని హోంబలే ఫిల్మ్స్ నిర్మాత విజయ్ కిరంగదూర్ పేర్కొన్నారు.

"సలార్ 1 అనేది పార్ట్ 2కి ఒక ట్రైలర్ లాంటిది మాత్రమే. మరింత భారీ యాక్షన్ సీక్వెన్స్, డ్రామా, రాజకీయాలు అన్ని కలిపి సలార్ 2.. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లా ఉండనుంది. యాక్షన్, డ్రామా, పాలిటిక్స్ పలు అంశాలు సీక్వెల్‌లో కనిపిస్తాయి. దర్శకుడు పార్ట్ 1లో పాత్రలన్నింటిని పరిచయం చేశారు. సీక్వెల్‌లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయి" అని నిర్మాత విజయ్ కిరంగదూర్ చెప్పుకొచ్చారు.

విజయ్ మాత్రమే కాకుండా సలార్ 2పై ప్రభాస్ కూడా ఆసక్తికర కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. "సలార్ 2 కథ ఇప్పటికీ సిద్ధంగానే ఉంది. దానిని మేము త్వరలోనే ప్రారంభిస్తాం. వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా చేస్తాం. సలార్ 2 విడుదల కోసం నా ఫ్యాన్స్ చాలా మంది ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. సలార్ పార్ట్ 2 గురించి మరిన్ని వివరాలు త్వరలో బయటపెడతాం" అని ప్రభాస్ తెలిపాడు.

IPL_Entry_Point