Prabhas Spirit: స్పిరిట్‌లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్: డైరెక్టర్ సందీప్ రెడ్డి-prabhas spirit rebel star as powerful police officer says director sandeep reddy vanga ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Spirit: స్పిరిట్‌లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్: డైరెక్టర్ సందీప్ రెడ్డి

Prabhas Spirit: స్పిరిట్‌లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్: డైరెక్టర్ సందీప్ రెడ్డి

Hari Prasad S HT Telugu
Jan 02, 2024 01:38 PM IST

Prabhas Spirit: రెబల్ స్టార్ ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా స్పిరిట్ మూవీలో కనిపించబోతున్నాడని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వెల్లడించాడు. ఈ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.

స్పిరిట్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
స్పిరిట్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

Prabhas Spirit: సలార్‌తో దుమ్ము రేపిన ప్రభాస్ ఇక ఇప్పుడు కల్కి 2898 ఏడీ, స్పిరిట్, రాజా డీలక్స్ లాంటి సినిమాలతో రాబోతున్నాడు. ఈ మధ్యే కల్కి 2898 ఏడీ మూవీ గురించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ ఇవ్వగా.. తాజాగా స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా దీనిపై స్పందించాడు. సినిమాలో ప్రభాస్ పాత్ర, స్క్రిప్ట్, ప్రీప్రొడక్షన్ పనుల గురించి అతడు వివరించాడు.

yearly horoscope entry point

స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని సందీప్ రెడ్డి వెల్లడించాడు. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ యానిమల్ డైరెక్టర్.. స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయిందని తెలిపాడు. గతంలో ఎప్పుడూ చూడని ప్రభాస్ ను ఈ మూవీలో చూడబోతున్నట్లు అతడు చెప్పడం విశేషం. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్.. మూడు సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన సందీప్.. ప్రభాస్ తో ఎలాంటి సినిమా తీయబోతున్నాడో అన్న ఆసక్తి నెలకొంది.

ఈ నేపథ్యంలో స్పిరిట్ మూవీలో అతనిది పోలీస్ పాత్ర అని చెప్పి సందీప్ ఆసక్తి పెంచుతున్నాడు. స్క్రిప్ట్ దాదాపు పూర్తయిందని, తుది మెరుగులు దిద్దాల్సి ఉందని అతడు చెప్పాడు. ప్రీప్రొడక్షన్ పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు కూడా వెల్లడించాడు. ఈ ఏడాది సెకండాఫ్ లో స్పిరిట్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

స్పిరిట్ మూవీని టీ-సిరీస్ నిర్మిస్తోంది. యానిమల్ మూవీతో పాన్ ఇండియా లెవల్లో పేరు సంపాదించిన సందీప్ రెడ్డి వంగా.. స్పిరిట్ తో మరో లెవల్ కు వెళ్లనున్నాడు. మరోవైపు హ్యాట్రిక్ ఫ్లాపుల తర్వాత సలార్ తో ప్రభాస్ కు ఓ హిట్ దక్కింది. ఈ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకుపైగా వసూలు చేసింది.

ఈ ఏడాది అతడు నటించిన కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ కానుంది. రూ.600 కోట్ల బడ్జెట్ తో ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ఖరీదైన మూవీగా కల్కి నిలవనుంది. బాహుబలి నుంచి వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వస్తున్న ప్రభాస్.. మధ్యలో డైరెక్టర్ మారుతితోనూ ఓ సింపుల్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా అప్‌డేట్ సంక్రాంతికి రానుంది.

Whats_app_banner