Prabhas Birthday Special: ప్ర‌భాస్ బ‌ర్త్‌డే స్పెష‌ల్ - ప్ర‌భాస్ కెరీర్‌లో రేర్ రికార్డ్స్ -prabhas birthday rare records in prabhas career ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Prabhas Birthday Rare Records In Prabhas Career

Prabhas Birthday Special: ప్ర‌భాస్ బ‌ర్త్‌డే స్పెష‌ల్ - ప్ర‌భాస్ కెరీర్‌లో రేర్ రికార్డ్స్

Nelki Naresh Kumar HT Telugu
Oct 23, 2022 12:18 PM IST

Prabhas Birthday Special: తెలుగు సినిమా ఖ్యాతిని అంత‌ర్జాతీయ స్థాయిలో చాటిచెప్పిన హీరోల్లో ప్ర‌భాస్ ముందు వ‌రుస‌లో నిలుస్తాడు. ఇర‌వై ఏళ్ల సినీ ప్ర‌యాణంలో ఏ తెలుగు హీరోకు సాధ్యం కానీ ఎన్నో రికార్డుల‌ను ప్ర‌భాస్ తిర‌గ‌రాశాడు. ఆ రికార్డ్‌లు ఏవంటే...

ప్ర‌భాస్
ప్ర‌భాస్

Prabhas Birthday Special: సౌత్ ఇండ‌స్ట్రీ నుంచి తొలి పాన్ ఇండియ‌న్ హీరో ఎవ‌రంటే అంద‌రికి గుర్తొచ్చే పేరు ప్ర‌భాస్‌. తెలుగు రాష్ట్రాల‌కే ప‌రిమిత‌మైన టాలీవుడ్ మార్కెట్‌ను బాహుబ‌లి సినిమాతో దేశ‌వ్యాప్తంగా విస్త‌రించిన ఘ‌న‌త ప్ర‌భాస్‌దే. తెలుగు సినిమాకు వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించే స‌త్తా ఉంద‌ని బాహుబ‌లి -2తో ప్ర‌భాస్ నిరూపించాడు. సినిమా రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా ప్ర‌భాస్ సినిమా అంటే బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డ్‌లు క్రియేట్ చేయ‌డం కామ‌న్‌గా మారిపోయింది. ప్ర‌భాస్ కెరీర్‌లో కొన్ని రికార్డులు ఇవి...

టాలీవుడ్‌లో 1000 కోట్లు వ‌సూళ్లు చేసిన ఫ‌స్ట్ సినిమా ప్ర‌భాస్‌దే

టాలీవుడ్ మార్కెట్ రెండు, మూడు వంద‌ల కోట్లు దాట‌డ‌మే అరుదు అనుకుంటున్న త‌రుణంలో బాహుబ‌లి సినిమా వెయ్యి కోట్ల వ‌సూళ్ల‌ను సుల‌భంగా సాధించింది. 1810 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో ఇండియ‌న్‌ సినిమా హిస్ట‌రీలోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన రెండో సినిమాగా బాహుబ‌లి -2 నిలిచింది. తెలుగులో ఐదు వంద‌ల కోట్లు, వెయ్యి కోట్లు వ‌సూళ్ల‌ను దాటిన తొలి సినిమా ఇదే.

హ‌య్యెస్ట్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - ప్ర‌భాస్ రికార్డ్ బ్రేక్ చేయ‌డం క‌ష్ట‌మే

భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో తొలి రోజు అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాగా ప్ర‌భాస్ బాహుబ‌లి -2 సినిమా నిలిచింది. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా మొద‌టి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా 214 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించింది. ఈ రికార్డ్ ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ బ్రేక్ చేయ‌లేక‌పోయారు.

నైజాం కింగ్ ప్ర‌భాస్‌

నైజాం ఏరియాలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన టాప్ టెన్ సినిమాల్లో ప్ర‌భాస్ బాహుబ‌లి -2, బాహుబ‌లి సినిమాలు ఉన్నాయి. ఈ జాబితాలో ఆర్ఆర్ఆర్ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉండ‌గా బాహుబ‌లి -2 సెకండ్ ప్లేస్‌, బాహుబ‌లి ఫ‌స్ట్ పార్ట్ మూడో స్థానంలో ఉన్నాయి.

త‌మిళ్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ సాధించిన తెలుగు సినిమా ప్ర‌భాస్‌దే

త‌మిళ‌నాడులో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన తెలుగు సినిమాల్లో ప్ర‌భాస్ బాహుబ‌లి 2 ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచింది. త‌మిళంలో ఈ సినిమా 160 కోట్ల గ్రాస్‌ను సాధించింది. క‌ర్ణాట‌క‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన తెలుగు సినిమా కూడా ఇదే కావ‌డం విశేషం. క‌ర్ణాట‌క‌లో ఈ సినిమా 130 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది.

బాలీవుడ్‌లో ప్ర‌భాస్‌దే హ‌వా

బాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ సాధించిన తెలుగు సినిమాగా బాహుబ‌లి 2 నిలిచింది. ఈ సినిమా ఒక్క హిందీలోనే 510 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఓవ‌ర్‌సీస్ మార్కెట్‌లో ప‌ది మిలియ‌న్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సాధించిన తొలి హీరో ప్ర‌భాస్‌దే.

IPL_Entry_Point