SBI SCO Recruitment 2024: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ; ఇలా అప్లై చేసుకోండి..-sbi sco recruitment 2024 apply for 169 assistant manager posts details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sbi Sco Recruitment 2024: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ; ఇలా అప్లై చేసుకోండి..

SBI SCO Recruitment 2024: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ; ఇలా అప్లై చేసుకోండి..

Sudarshan V HT Telugu
Nov 23, 2024 07:44 PM IST

SBI SCO Recruitment 2024: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

స్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ
స్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ (REUTERS)

SBI SCO Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 169 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది.

డిసెంబర్ 12 లాస్ట్ డేట్

రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 22న ప్రారంభమై డిసెంబర్ 12, 2024న ముగుస్తుంది. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద చదవండి.

ఖాళీల వివరాలు

  • అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- సివిల్): 42 పోస్టులు
  • అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- ఎలక్ట్రికల్): 25 పోస్టులు
  • అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- ఫైర్): 101 పోస్టులు
  • అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- సివిల్): 1 పోస్టు

అర్హతలు

ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి తదితర వివరాలను ఎస్బీఐ వెబ్ సైట్ లోని డీటెయిల్డ్ నోటిఫికేషన్ లో తెలుసుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ

  • అన్ని పోస్టులకు: ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటరాక్షన్
  • అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- ఫైర్): షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటరాక్షన్

ఆన్లైన్ రాత పరీక్షను 2025 జనవరిలో నిర్వహిస్తారు. పరీక్ష కాల్ లెటర్ ను పరీక్షకు కొన్ని రోజుల ముందు బ్యాంక్ వెబ్సైట్లో అప్లోడ్ చేసి, ఎస్ఎంఎస్, ఈ-మెయిల్స్ ద్వారా అభ్యర్థులకు సమాచారం ఇస్తారు. ఈ పరీక్షలో జనరల్ ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనే రెండు పేపర్లు ఉంటాయి. జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 90 నిమిషాలు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ 45 నిమిషాల వ్యవధి ఉంటుంది. ఆన్ లైన్ రాత పరీక్షలో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉండవు. ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ (100 మార్కులకు), ఇంటర్వ్యూ (25 మార్కులకు) మార్కులను కలిపి 70:30 వెయిటేజీతో తుది మెరిట్ జాబితాను రూపొందిస్తారు.

దరఖాస్తు ఫీజు

జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు, ఇన్ఫర్మేషన్ ఛార్జీలు రూ.750, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు ఎలాంటి ఫీజు/ ఇన్ఫర్మేషన్ ఛార్జీలు ఉండవు. డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డ్/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.

Whats_app_banner