Devaki Nandana Vasudeva: మహేష్ బాబు మేనల్లుడి మూవీకి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్
Devaki Nandana Vasudeva: మహేష్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన దేవకి నందన వాసుదేవకు తొలిరోజు షాకింగ్ కలెక్షన్స్ వచ్చాయి. ప్రశాంత్ వర్మ కథను అందించిన ఈ మూవీకి పది లక్షల కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఈ సినిమాలో మానస వారణాసి హీరోయిన్‌గా నటించింది.
Devaki Nandana Vasudeva: మహేష్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన దేవకి నందన వాసుదేవ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ కథను అందించిన సినిమా కావడం, మిస్ ఇండియా మానస వారణాసి హీరోయిన్‌గా నటించడంతో దేవకి నందన వాసుదేవపై కొంత బజ్ ఏర్పడింది.
పురాణాల స్ఫూర్థితో...
పురాణాల స్ఫూర్తితో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు అర్జున్ జంధ్యాల ఈ మూవీని తెరకెక్కించాడు. దేవకి నందన వాసుదేవ పాయింట్ బాగున్నా స్క్రీన్‌ప్లేలో ఆసక్తి లోపించడంతో, కథలో బలమైన ఎమోషన్స్ లేకపోవడంలో మొదటి రోజే ఈ సినిమా నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకున్నది.
పది లక్షల కలెక్షన్స్...
దేవకి నందన వాసుదేవ ఫస్ట్ డే ఇండియా వైడ్‌గా ఇరవై లక్షలకుపైగా గ్రాస్‌ను పది లక్షలకుపైగా షేర్ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. శుక్రవారం రోజు రిలీజైన సినిమాల్లో అతి తక్కువ వసూళ్లను రాబట్టిన మూవీగా దేవకి నందన వాసుదేవ నిలిచింది. రెండున్నర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైనట్లు సమాచారం. తొలిరోజు వచ్చిన కలెక్షన్స్‌ను బట్టి చూస్తే దేవకి నందన వాసుదేవ లాభాల్లోకి అడుగుపెట్టడం అసాధ్యమేనని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. శనివారం రోజు వసూళ్లు మరింత తగ్గుముఖం పట్టినట్లు సమాచారం.
ఏ మాత్రం పోటీ ఇవ్వలేదు...
ఈ శుక్రవారం రిలీజైన సినిమాల్లో విశ్వక్‌సేన్ మెకానిక్ రాకీ రెండు కోట్ల ఇరవై లక్షల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. సత్యదేవ్ జీబ్రా మూవీ కోటికిపైగా కలెక్షన్స్ దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాలకు దేవకి నందన వాసుదేవ మూవీ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.
కంసరాజు అన్యాయాలు...
భాగవతం స్ఫూర్తితో దర్శకుడు ప్రశాంత్ వర్మ దేవకి నందన వాసుదేవ మూవీ కథను రాసుకున్నాడు. కంసరాజు (దేవదత్ నాగే)కనిపించిన భూములన్నీ కబ్జా చేస్తూ తనకు ఎదురుతిరిగిన వారిని చంపేస్తుంటాడు. తన చెల్లెలికి (దేవయాని) పుట్టబోయే మూడో సంతానం ద్వారా కాశీలో తన ప్రాణగండం ఉందనే నిజం కంసరాజుకు తెలుస్తుంది.
ప్రాణ గండం నుంచి తప్పించుకోవడానికి మూడో సంతానం పుట్టకుండా చెల్లెలి భర్తను చంపేస్తాడు కంసరాజు. ఓ కేసులో ఇరవై ఒక్క ఏళ్లు జైలు శిక్షను అనుభవిస్తాడు. జైలు నుంచి విడుదలైన కంసరాజుకు తన చెల్లెలి కూతురు సత్య (మానన వారణాసి) గురించి ఎలాంటి నిజాలు తెలిశాయి? సత్యను ప్రేమించిన
కృష్ణ (అశోక్ గల్లా) ఎవరు? కంసరాజు అక్రమాలకు కృష్ణ ఎలా అడ్డుకట్టవేశాడు అన్నదే ఈ మూవీ కథ.
హీరోతో ఎంట్రీ...
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన సెకండ్ మూవీ ఇది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో 2022లో రిలీజైన హీరో మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అశోక్ గల్లా.