Thriller OTT: నెల రోజుల్లోనే ఓటీటీలోకి టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్ మూవీ- స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Ka OTT: కిరణ్ అబ్బవరం క మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతోంది. ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 28 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ యాభై కోట్ల కలెక్షన్స్ సాధించింది.
Ka OTT: కిరణ్ అబ్బవరం క మూవీ థియేటర్లలో రిలీజైన నెలలోపే ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ శనివారం కన్ఫామ్ అయ్యింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైన క మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. యాభై కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.
ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్...
క మూవీలో కిరణ్ అబ్బవరం సరసన నయన్ సారిక, తన్వీరామ్ హీరోయిన్లుగా నటించారు. క మూవీకి సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు. ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఈటీవీ విన్ ఓటీటీ సొంతం చేసుకున్నది. నవంబర్ 28 నుంచి ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలకానుంది.
చాలా రోజుల తర్వాత హిట్...
క మూవీ కాన్సెప్ట్‌తో పాటు ట్విస్ట్‌లు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ అంటూ కామెంట్స్ వినిపించాయి. సామ్ సీఎస్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
క మూవీతోనే చాలా రోజుల తర్వాత పెద్ద హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు కిరణ్ అబ్బవరం. క కంటే ముందు అతడు నటించిన రూల్స్ రంజాన్, మీటర్ సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి.
తమిళం, మలయాళంలో...
క మూవీని పాన్ ఇండియన్ లెవెల్‌లో ఒకేసారి రిలీజ్ చేయాలని కిరణ్ అబ్బవరం ప్లాన్ చేశాడు. కానీ థియేటర్ల సమస్య కారణంగా నవంబర్ 22న తమిళం, మలయాళ భాషల్లో ఈ మూవీ రిలీజైంది.
క మూవీ కథ ఇదే...
అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనాథశ్రమంలో పెరుగుతాడు. ఆశ్రమానికి వచ్చిన ఇతరుల ఉత్తరాల్ని దొంగతనంగా చదువుతుంటాడు. ఓ రోజు అనాథశ్రమ మాస్టర్ ఉత్తరం చదువుతూ దొరికిపోయి ఆశ్రమం నుంచి పారిపోతాడు. కృష్ణగిరి అనేఊరికి వచ్చిన వాసుదేవ్ కాంట్రాక్ట్ పోస్ట్‌మెన్‌గా ఉద్యోగంలో చేరుతాడు. కృష్ణగిరిలో వరుసగా అమ్మాయిలు కనిపించకుండాపోతుంటారు.
దొంగచాటుగా ఉత్తరాలు చదివే అలవాటు వల్ల అమ్మాయిల కిడ్నాప్‌కు సంబంధించిన ఓ సీక్రెట్ వాసుదేవ్‌కు తెలిసిపోతుంది. అదేమిటి? కిడ్నాప్‌ల మిస్టరీని వాసుదేవ్ ఎలా ఛేదించాడు? వాసుదేవ్‌ను ప్రేమించిన సత్యభామ (నయన్ సారిక) ఎవరు?వాసుదేవ్‌తో పాటు రాధ (తన్వీ రామ్) అనే టీచర్‌ను కిడ్నాప్ చేసి బంధించిన ముసుగు వ్యక్తి ఎవరు అన్నదే క మూవీ కథ.
తెలంగాణలోని మూడు జాముల కొదుకుపాక అనే ఊరు నుంచి స్ఫూర్తి పొందుతూ దర్శకద్వయం క మూవీ కథను రాసుకున్నారు.
టాపిక్