Ponniyin Selvan: పొన్నియిన్‌ సెల్వన్‌ రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి తమిళ సినిమా-ponniyin selvan will be the first tamil movie to release in imax
Telugu News  /  Entertainment  /  Ponniyin Selvan Will Be The First Tamil Movie To Release In Imax
పొన్నియిన్ సెల్వన్
పొన్నియిన్ సెల్వన్ (Twitter)

Ponniyin Selvan: పొన్నియిన్‌ సెల్వన్‌ రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి తమిళ సినిమా

16 August 2022, 20:39 ISTHT Telugu Desk
16 August 2022, 20:39 IST

Ponniyin Selvan: మణిరత్నం కలల ప్రాజెక్ట్‌ పొన్నియిన్‌ సెల్వన్‌ రిలీజ్‌కు ముందే ఓ రికార్డును సొంతం చేసుకుంది. గతంలో ఏ తమిళ సినిమాకు దక్కని ఘనత అది.

ఇండియా గర్వించదగిన దర్శకుల్లో ఒకరైన మణిరత్నం ఎంతో ఇష్టపడి చేస్తున్న ప్రాజెక్ట్‌ పొన్నియిన్‌ సెల్వన్‌. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మాగ్నమ్ ఓపస్‌ సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ పాన్‌ ఇండియా మూవీలో విక్రమ్‌, ఐశ్వర్య రాయ్‌, కార్తీ, త్రిషలాంటి పెద్ద పెద్ద స్టార్లు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్‌ లుక్స్‌, టీజర్‌ మూవీపై అంచనాలు పెంచేశాయి.

పొన్నియిన్‌ సెల్వన్‌ ప్రాజెక్ట్‌లో ఇది తొలి పార్ట్‌ మాత్రమే. అయితే ఈ సినిమాను ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లోనూ రిలీజ్‌ చేస్తున్నారు. ఇలా ఐమ్యాక్స్‌లో రిలీజ్‌ కాబోతున్న తొలి తమిళ సినిమాగా పొన్నియిన్‌ సెల్వన్‌ నిలవనుంది. ఈ విషయాన్ని మంగళవారం (ఆగస్ట్‌ 16) మేకర్స్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. "గొప్పది మరింత గొప్పగా కనిపించనుంది. పీఎస్‌1ను ఐమ్యాక్స్‌లో చూడండి. ఐమ్యాక్స్‌లో వస్తున్న తొలి తమిళ సినిమా. సెప్టెంబర్‌ 30 నుంచి థియేటర్లలో" అంటూ లైకా ప్రొడక్షన్స్‌ ట్వీట్‌ చేసింది.

మద్రాస్‌ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. కల్కి కృష్ణమూర్తి ఇదే పేరుతో రాసిన నవలనే ఇప్పుడు సినిమాగా తీస్తున్నారు. మణిరత్నం కలల ప్రాజెక్ట్‌ ఇది. చాన్నాళ్లుగా ఈ మూవీ కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు పార్ట్‌లుగా రానున్న పొన్నియిన్‌ సెల్వన్‌ ప్రాజెక్ట్‌ బడ్జెట్‌ సుమారు రూ.500 కోట్లు కావడం విశేషం. ఈ సినిమా తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలలోనూ సెప్టెంబర్‌ 30న రిలీజ్‌ కానుంది.