Ponniyin Selvan: విజువల్ వండర్‌గా పొన్నియిన్ సెల్వన్ టీజర్.. అదిరిపోయే యాక్షన్-maniratnam new movie ponniyin selvan 1 teaser released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ponniyin Selvan: విజువల్ వండర్‌గా పొన్నియిన్ సెల్వన్ టీజర్.. అదిరిపోయే యాక్షన్

Ponniyin Selvan: విజువల్ వండర్‌గా పొన్నియిన్ సెల్వన్ టీజర్.. అదిరిపోయే యాక్షన్

Maragani Govardhan HT Telugu
Jul 08, 2022 07:16 PM IST

విక్రమ్, కార్తీ, జయం రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. సెప్టెంబరు 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుందీ చిత్రం.

<p>పొన్నియిన్ సెల్వన్ టీజర్ రిలీజ్</p>
<p>పొన్నియిన్ సెల్వన్ టీజర్ రిలీజ్</p> (Twitter)

దర్శక దిగ్గజం మణిరత్నం తెరకెక్కిస్తున్న తాజా చిత్రం పొన్నియిన్ సెల్వన్-1. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా పొన్నియిన్ సెల్వన్-1 టీజర్‌ విడుదలైంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా ఈ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. సెప్టెంబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

టీజర్‌ను గమనిస్తే.. "ఈ కల్లు, పాట, రక్తం, పోరాటం, అంతా దాన్ని మర్చిపోవడానికే.. ఆమెను మర్చిపోవడానికి, నన్ను నేను మర్చిపోవడానికి.." అంటూ విక్రమ్ పలికిన సంభాషణలు ఆసక్తికరంగా ఉన్నాయి. చోళ రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా సాగుతోంది. టీజర్ ఆద్యంత అద్భుతమైన విజువల్స్, యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఎమోషన్స్‌కు పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందియ తొలి భాగం ఈ ఏడాది సెప్టెంబరు 30న విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న కీలక పాత్రలను పరిచయం చేస్తూ అందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్స్‌ను విడుదల చేశారు.

తెలుగు టీజర్‌ను మహేశ్ ాబబు,,, హిందీలో అమితాబ్, మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో రక్షిత్ శెట్టి, తమిళంలో సూర్య విడుదల చేశారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు.

సంబంధిత కథనం

టాపిక్