Ponniyin Selvan Audio Rights: భారీ ధరకు అమ్ముడైన పొన్నియిన్‌ సెల్వన్‌ ఆడియో హక్కులు-ponniyin selvan audio rights sold to tips with a whopping price ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Ponniyin Selvan Audio Rights Sold To Tips With A Whopping Price

Ponniyin Selvan Audio Rights: భారీ ధరకు అమ్ముడైన పొన్నియిన్‌ సెల్వన్‌ ఆడియో హక్కులు

పొన్నియిన్ సెల్వన్
పొన్నియిన్ సెల్వన్ (Twitter)

Ponniyin Selvan Audio Rights: పొన్నియిన్‌ సెల్వన్‌ ఆడియో హక్కులను భారీ ధరకు అమ్మేశారు ఈ మూవీ మేకర్స్‌. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా ప్రకటించారు.

లెజెండరీ ఫిల్మ్‌ డైరెక్టర్‌ మణిరత్నం కలల ప్రాజెక్ట్‌ పొన్నియిన్‌ సెల్వన్‌. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30న ఈ మూవీ పార్ట్‌ 1న రిలీజ్‌ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పేరుతో రోజుకో స్టార్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. చియాన్‌ విక్రమ్‌, కార్తీ, ఐశ్వర్య రాయ్‌, త్రిష.. ఇలా ఈ మూవీలోని ప్రముఖ పాత్రలను అభిమానులకు పరిచయం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఇక తాజాగా ఈ మూవీ ఆడియో హక్కులను కూడా అమ్మేశారు. ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ కావడంతో ఈ హక్కులకు భారీ ధర పలికింది. రూ.25 కోట్లకు టిప్స్‌ మ్యూజిక్‌ ఈ హక్కులను సొంతం చేసుకుంది. టిప్స్‌ మ్యూజిక్‌ పొన్నియిన్‌ సెల్వన్‌ ఆడియో హక్కులను సొంతం చేసుకున్న విషయాన్ని ట్విటర్‌ ద్వారా మేకర్స్‌ ప్రకటించారు. అన్ని భాషల హక్కులను టిప్స్‌కే కట్టబెట్టినట్లు చెప్పారు.

అంతేకాదు శుక్రవారం (జులై 8) ఈ మూవీ టీజర్‌ కూడా రిలీజ్‌ కానుంది. చెన్నైలో ఈ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ జరగనుంది. దీనికి డైరెక్టర్‌ మణిరత్నంతోపాటు పొన్నియిన్‌ సెల్వన్‌ మూవీ క్యాస్ట్‌ మొత్తం హాజరుకానుంది. ఈ ఈవెంట్‌ సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. ఇక టీజర్‌ను తమిళంలో సూర్య లాంచ్‌ చేయనుండగా.. తెలుగులో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, మలయాళంలో మోహన్‌లాల్‌, కన్నడలో రక్షిత్‌ శెట్టి, హిందీలో అమితాబ్‌ బచ్చన్‌ లాంచ్‌ చేయనున్నారు.

పొన్నియిన్‌ సెల్వన్‌లో చియాన్‌ విక్రమ్‌ చోళ యువరాజు ఆదిత్య కరికాలన్‌గా, కార్తీ వంథియాథెవన్‌గా, ఐశ్వర్యా రాయ్‌ క్వీన్‌ నందినిగా, త్రిష యువరాణి కుందవాయ్‌గా కనిపించనున్నారు. మణిరత్నంకు చెందిన మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

సంబంధిత కథనం

టాపిక్