Ponniyin Selvan 2 in OTT: ఓటీటీలో పొన్నియిన్ సెల్వన్ 2.. ఇక ఫ్రీగా చూసేయొచ్చు-ponniyin selvan 2 in ott as the movie now streaming free ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ponniyin Selvan 2 In Ott As The Movie Now Streaming Free

Ponniyin Selvan 2 in OTT: ఓటీటీలో పొన్నియిన్ సెల్వన్ 2.. ఇక ఫ్రీగా చూసేయొచ్చు

Hari Prasad S HT Telugu
Jun 02, 2023 10:37 AM IST

Ponniyin Selvan 2 in OTT: ఓటీటీలో పొన్నియిన్ సెల్వన్ 2 అందుబాటులోకి వచ్చింది. ఇక శుక్రవారం (జూన్ 2) నుంచి ఈ మూవీని ఫ్రీగా చూసేయొచ్చు. ప్రైమ్ వీడియోలో సినిమా అందుబాటులో ఉంది.

పొన్నియిన్ సెల్వన్-2
పొన్నియిన్ సెల్వన్-2

Ponniyin Selvan 2 in OTT: మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ 2 ఓటీటీలోకి వచ్చేసింది. నిజానికి గత శుక్రవారం (మే 26) ఈ సినిమా ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. అయితే సినిమా చూడాలంటే రూ.399 చెల్లించాలన్న నిబంధన పెట్టారు. వారం పాటు ఇలాగే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

అయితే తాజాగా ఈ శుక్రవారం (జూన్ 2) నుంచి ప్రైమ్ వీడియో సబ్‌స్క్రైబర్లు అందరికీ పొన్నియిన్ సెల్వన్ 2 అందుబాటులోకి వచ్చింది. అంటే ఇక నుంచీ ఈ సినిమాను అందరూ ఫ్రీగా చూసే వీలు కలిగింది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత పీఎస్ 2 ఓటీటీలోకి వచ్చింది. గతేడాది పొన్నియిన్ సెల్వన్ 1 రిలీజ్ చేసిన మేకర్స్.. ఈసారి రెండో పార్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించినా.. తొలి పార్ట్ స్థాయిలో మాత్రం కలెక్షన్లు రాబట్టలేకపోయింది. మణిరత్నం, సుభాస్కరన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్లు నటించారు.

భారీ తారాగణం నటించినప్పటికీ పొన్నియిన్ సెల్వన్-2కు అనుకున్న స్థాయిలో వసూళ్లు దక్కలేదు. పీఎస్-2కు ముందు పెద్దగా బజ్ ఏర్పడకపోవడంతో అది వసూళ్లపై ప్రభావం పడింది. ఈ మూవీ 400 కోట్ల మార్కును అందుకోవడం కూడా కష్టంగానే అనిపిస్తుంది. ఇటీవల మేకర్స్ పీఎస్-2 300 కోట్ల మార్కును అందుకున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ ఏడాదికి తమిళంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచినట్లు పోస్టర్‌ను విడుదల చేశారు.

కోలీవుడ్‌లో ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో పొన్నియిన్ సెల్వన్-2 అత్యధిక గ్రాస్‌ను అందుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు విజయ్ నటించిన వారిసు/వారసుడు ముందుండగా.. తాజాగా ఈ రికార్డును పీఎస్-2 అధిగమించినట్లు సదరు చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు. ఈ మల్టీ స్టారర్ ఫ్యామిలీ డ్రామా ఎంగేజింగ్‌గా ఉన్నప్పటికీ వసూళ్లపై మాత్రం ప్రభావం పడింది.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.