Rajinikanth Robo Re Release: ర‌జ‌నీకాంత్ రోబో రీ రిలీజ్ - డైరెక్ట్‌గా ఓటీటీలోనే స్ట్రీమింగ్‌-rajinikanth robo re release date fixed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajinikanth Robo Re Release: ర‌జ‌నీకాంత్ రోబో రీ రిలీజ్ - డైరెక్ట్‌గా ఓటీటీలోనే స్ట్రీమింగ్‌

Rajinikanth Robo Re Release: ర‌జ‌నీకాంత్ రోబో రీ రిలీజ్ - డైరెక్ట్‌గా ఓటీటీలోనే స్ట్రీమింగ్‌

HT Telugu Desk HT Telugu
Jun 02, 2023 05:43 AM IST

Rajinikanth Robo Re Release: ర‌జ‌నీకాంత్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ మూవీ రోబో రీ రిలీజ్‌కు సిద్ధ‌మైంది. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు రానుందంటే...

ర‌జ‌నీకాంత్ రోబో
ర‌జ‌నీకాంత్ రోబో

Rajinikanth Robo Re Release: ప్ర‌స్తుతం టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ కొన‌సాగుతోంది. స్టార్ హీరోలు సినిమాలు మ‌రోసారి థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొస్తోన్నాయి. ఈ రీ రిలీజ్ ట్రెండ్‌లోకి ర‌జ‌నీకాంత్‌, డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో వ‌చ్చిన‌ సూప‌ర్ హిట్ మూవీ రోబో కూడా చేరింది. 4కే, డాల్బీ అట్మాస్‌లో ఈ సినిమాను మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ రీ మాస్ట‌ర్ వెర్ష‌న్‌ను థియేట‌ర్ల‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయ‌బోతున్నారు.

జూన్ 9 నుంచి ఈ కొత్త వెర్ష‌న్ స‌న్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ర‌జ‌నీకాంత్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 2010లో రిలీజైన ఈ మూవీ అప్ప‌ట్లో ఇండియాలోనే భారీ బ‌డ్జెట్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. దాదాపు 150 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 320 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌తో పాటు రెండు నేష‌న‌ల్ అవార్డుల‌ను కూడా గెలుచుకున్న‌ది.

ఎంథిర‌న్ పేరుతో త‌మిళంలో రూపొందిన ఈ సినిమా రోబో తెలుగులోనూ అనువాద‌మై పెద్ద విజ‌యాన్ని ద‌క్కించుకున్న‌ది. ఇందులో వ‌శీక‌ర‌న్ అనే సైంటిస్ట్‌గా, చిట్టి అనే రోబోగా డ్యూయ‌ల్ రోల్‌లో ర‌జ‌నీకాంత్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. రోబో సినిమాలో ఐశ్వ‌ర్య‌రాయ్ హీరోయిన్‌గా న‌టించింది.

రోబో సినిమాకుసీక్వెల్‌గా 2.ఓ మూవీ రూపందించారు శంక‌ర్‌. కానీ ఫ‌స్ట్ పార్ట్ స్థాయిలో సీక్వెల్ విజ‌యాన్ని సొంతం చేసుకోలేక‌పోయింది. కాగా ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ జైల‌ర్‌తో పాటు జై భీమ ఫేమ్ టీజే జ్ఞాన‌వేళ్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తోన్నాడు.