Vikram Villain: ర‌జ‌నీకాంత్ హీరో - విక్ర‌మ్ విల‌న్ - కొత్త కాంబో సెట్‌?-vikram to play villain for rajinikanth tj gnanavel movie details here ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vikram Villain: ర‌జ‌నీకాంత్ హీరో - విక్ర‌మ్ విల‌న్ - కొత్త కాంబో సెట్‌?

Vikram Villain: ర‌జ‌నీకాంత్ హీరో - విక్ర‌మ్ విల‌న్ - కొత్త కాంబో సెట్‌?

HT Telugu Desk HT Telugu
May 17, 2023 07:05 AM IST

Vikram Villain: ర‌జ‌నీకాంత్ సినిమాలో చియాన్ విక్ర‌మ్ విల‌న్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు కోలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా ఏదంటే...

చియాన్ విక్ర‌మ్
చియాన్ విక్ర‌మ్

Vikram Villain: సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞాన‌వేళ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న‌ట్లు కోలీవుడ్‌లో చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఫేక్ ఎన్‌కౌంట‌ర్స్ బ్యాక్‌డ్రాప్‌లో సోషియో పొలిటిక‌ల్ డ్రామాగా ఈ మూవీ రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం.

ఇందులో ర‌జ‌నీకాంత్ రిటైర్డ్‌ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు చెబుతోన్నారు. కాగా ఈ సినిమాలో చియాన్ విక్ర‌మ్ విల‌న్‌గా క‌నిపించ‌నున్న‌ట్లు కోలీవుడ్ స‌ర్కిల్‌లో వార్త‌లు వినిపిస్తోన్నాయి.

హీరోకు ధీటుగా విల‌న్ పాత్ర ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండే క‌థ ఇద‌ని, ఈ క్యారెక్ట‌ర్‌కు విక్ర‌మ్ లాంటి ఇమేజ్ ఉన్న స్టార్ అయితేనే బాగుంటుంద‌ని భావించిన ద‌ర్శ‌కుడు జ్ఞాన‌వేళ్ ఇటీవ‌లే అత‌డిని సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం.

క్యారెక్ట‌ర్‌కు ఉన్న ఇంపార్టెన్స్‌కు దృష్టిలో పెట్టుకొని విక్ర‌మ్ కూడా ఈ సినిమా చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు. ప్ర‌స్తుతం ఫైన‌ల్ డిస్క‌ష‌న్స్ జ‌రుగుతోన్న‌ట్లు స‌మాచారం. ర‌జ‌నీకాంత్ సినిమాలో విక్ర‌మ్ విల‌న్‌గా న‌టిస్తాడా? లేదా? అన్న‌ది త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తంగ‌లాన్‌ అనే సినిమా చేస్తోన్నాడు విక్ర‌మ్‌. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ప్ర‌యోగాత్మ‌కంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవ‌ల ఈ సినిమా సెట్స్‌లోవిక్ర‌మ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటోన్న అత‌డు త్వ‌ర‌లోనే తిరిగి షూటింగ్ మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్టు తెలిసింది.

తంగ‌లాన్‌ సినిమాలో పార్వ‌తి, మాళ‌వికా మోహ‌న‌న్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. మ‌రోవైపు జైల‌ర్ సినిమాతో ర‌జ‌నీకాంత్ బిజీగా ఉన్నాడు. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో మోహ‌న్‌లాల్‌, శివ‌రాజ్‌కుమార్‌, త‌మ‌న్నా కీల‌క పాత్ర‌ల్ని పోషిస్తోన్నారు.

IPL_Entry_Point

టాపిక్