Tholi Prema Re Release: ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - తొలిప్రేమ రీ రిలీజ్ డేట్ ఫిక్స్‌-pawan kalyan tholi prema re release date confirmed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tholi Prema Re Release: ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - తొలిప్రేమ రీ రిలీజ్ డేట్ ఫిక్స్‌

Tholi Prema Re Release: ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - తొలిప్రేమ రీ రిలీజ్ డేట్ ఫిక్స్‌

HT Telugu Desk HT Telugu
May 25, 2023 07:16 AM IST

Tholi Prema Re Release: ప‌వ‌న్‌క‌ళ్యాణ్ క్లాసిక్ ల‌వ్‌స్టోరీ తొలి ప్రేమ రీ రిలీజ్‌కు సిద్ధ‌మైంది. ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేది ఎప్పుడంటే...

తొలి ప్రేమ
తొలి ప్రేమ

Tholi Prema Re Release: ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ పేరుతో స్టార్ హీరోల బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ వారానికి ఒక‌టి ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాయి. ఈ రీ రిలీజ్ సినిమాల లిస్ట్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలి ప్రేమ కూడా చేరింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను యూత్ ఆడియెన్స్‌కు చేరువ చేసిన సినిమాల్లో తొలి ప్రేమ ఒక‌టి. క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 1998లో రిలీజైన ఈ మూవీ ప‌లు అవార్డుల‌తో పాటు రివార్డుల‌ను అందుకున్న‌ది.

ఈ ఎవ‌ర్‌గ్రీన్ ల‌వ్‌స్టోరీ మ‌రో సారి థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. తొలి ప్రేమ సినిమాను జూన్ 30న రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. తొలిప్రేమ రిలీజై ఇర‌వై ఐదేళ్లు గ‌డిచినా ఈ సినిమాపై యూత్‌లో ఉన్న క్రేజ్ మాత్రం త‌గ్గ‌లేదు. ఆ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొనే ఈ సినిమాను రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. 4కే టెక్నాల‌జీలో తొలిప్రేమ‌ను రీ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్‌సీస్‌లో భారీగా ఈ సినిమాను స్క్రీనింగ్ చేసేలా ప‌వ‌న్ ఫ్యాన్స్ ఏర్పాట్లు చేస్తోన్న‌ట్లు స‌మాచారం. తొలి ప్రేమ సినిమాలో సిన్సియ‌ర్ ల‌వ‌ర్‌గా ప‌వ‌న్ యాక్టింగ్‌, మేన‌రిజ‌మ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ఇందులో ప‌వ‌న్‌కు జోడీగా కీర్తిరెడ్డి హీరోయిన్‌గా న‌టించింది. తొలి ప్రేమ సినిమాకు దేవా సంగీతాన్ని అందించాడు.

ఈ సినిమాలోని పాట‌లు మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను మెప్పించాయి. 1998 ఏడాదికిగాను బెస్ట్ తెలుగు మూవీగా తొలి ప్రేమ నేష‌న‌ల్ అవార్డును అందుకున్న‌ది. ఆరు నంది అవార్డుల‌ను ద‌క్కించుకొంది. కాగా రీ రిలీజ్ సినిమాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఖుషి, జ‌ల్సా సినిమాలు అద్భుత‌మైన వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. ఆ జోష్‌ను తొలి ప్రేమ కూడా కంటిన్యూ చేసే అవ‌కాశం ఉంద‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్ భావిస్తోన్నారు.

IPL_Entry_Point