Pawan Kalyan Bro: ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్రో రిలీజ‌య్యేది ఈ ఓటీటీలోనే - భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయిన డిజిట‌ల్ రైట్స్‌-pawan kalyan bro movie digital rights sold for a whopping price ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan Kalyan Bro: ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్రో రిలీజ‌య్యేది ఈ ఓటీటీలోనే - భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయిన డిజిట‌ల్ రైట్స్‌

Pawan Kalyan Bro: ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్రో రిలీజ‌య్యేది ఈ ఓటీటీలోనే - భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయిన డిజిట‌ల్ రైట్స్‌

HT Telugu Desk HT Telugu
May 19, 2023 05:42 AM IST

Pawan Kalyan Bro: ప‌వ‌న్ క‌ళ్యాణ్, సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోలుగా న‌టిస్తోన్న బ్రో సినిమా ఏ ఓటీటీలో రిలీజ్ కానుందంటే...

ప‌వ‌న్‌క‌ళ్యాణ్
ప‌వ‌న్‌క‌ళ్యాణ్

Pawan Kalyan Bro: మెగా మామాఅల్లుళ్లు ప‌వ‌న్‌క‌ళ్యాణ్, సాయిధ‌ర‌మ్‌తేజ్ తొలిసారి క‌లిసి న‌టిస్తోన్న సినిమాకు బ్రో అనే టైటిల్‌ను గురువారం ఖ‌రారు చేశారు. సోషియో ఫాంట‌సీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. జూలై 28న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు.

కాగా ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకోన్న‌ట్లు స‌మాచారం. దాదాపు న‌ల‌భై కోట్లకు ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకోన్న‌ట్లు చెబుతోన్నారు. థియేట‌ర్‌లో రిలీజైన నాలుగు వారాల నుంచి ఆరు వారాల గ్యాప్‌లో ఓటీటీలో ఈ సినిమాను రిలీజ్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ దేవుడి పాత్ర‌లో న‌టిస్తోండ‌గా సాయిధ‌ర‌మ్‌తేజ్ భ‌క్తుడిగా క‌నిపించ‌బోతున్నారు. ఓ ప్ర‌మాదంలో క‌న్నుమూసిన భ‌క్తుడికి దేవుడు ఎలా సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు? ఆ అవ‌కాశాన్ని అత‌డు ఎలా స‌ద్వినియోగం చేసుకున్నాడ‌నే పాయింట్‌తో ఈ సినిమా రూపొందుతోంది.

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన వినోధ‌య‌సీత‌మ్ ఆధారంగా బ్రో మూవీ తెర‌కెక్కుతోంది. ప‌ది రోజులు మాత్ర‌మే ఈ సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ నెలాఖ‌రులోగా షూటింగ్‌ను పూర్తిచేసే ఆలోచ‌న‌లో ఉన్నారు.

బ్రో సినిమాలో కేతికాశ‌ర్మ‌, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. ఈ సినిమా కోసం కేవ‌లం ప‌దిహేను రోజులు మాత్ర‌మే డేట్స్ కేటాయించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాదాపు 30 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాతో స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు.

త్రివిక్ర‌మ్ సంభాష‌ణ‌లు, స్క్రీన్‌ప్లేను స‌మ‌కూర్చుతోన్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తోన్నాడు.

IPL_Entry_Point

టాపిక్