Pill OTT Web Series: జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ వరుసగా వెబ్ సిరీస్ సిరీస్‍ను తీసుకొస్తోంది. ఇటీవల ఈ ఓటీటీ జోరు పెంచింది. ఇప్పుడు తాజాగా మరో సిరీస్‍ను జియోసినిమా తీసుకొస్తోంది. ‘పిల్’ పేరుతో ఓ నయా వెబ్ సిరీస్ ప్రకటించింది. బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‍ముఖ్ ఈ సిరీస్‍లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దేశం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యల్లో ఒకటైన నకిలీ మందుల సమస్యపై ఈ పిల్ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‍ను జియోసినిమా నేడు వెల్లడించింది.
పిల్ వెబ్ సిరీస్ అనౌన్స్‌మెంట్ వీడియోను నేడు (జూన్ 22) జియోసినిమా వెల్లడించింది. రితేశ్ దేశ్‍ముఖ్ ఓ మాత్రను పట్టుకున్నట్టుగా ఈ వీడియోలో ఉంది. నకిలీ, తప్పుడు మందుల వల్ల చనిపోతున్న వారి లెక్కలు ఎక్కడున్నాయని ప్రశ్నిస్తూ ఈ వీడియో ఉంది “ఈ దేశంలో ఏ వ్యాధితో ఎంత మంది చనిపోతున్నారన్న విషయంపై గణాంకాలు మన దగ్గర ఉన్నాయి. కానీ, నకిలీ మందుల వల్ల ఎంత మంది ప్రాణాలు పోతున్నాయి? ఈ విషయంపై ఎలాంటి లెక్కలు లేవు” అని ఈ వీడియోకు వాయిస్ ఓవర్ ఉంది.
దేశంలో నకిలీ, నాసిరకం మందుల చుట్టూ పిల్ సిరీస్ తిరుగుతుందని ఈ వీడియోతో జియోసినిమా ఓటీటీ వెల్లడించింది. మీ మందులు నిజంగా వేటితో తయారయ్యాయి? అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
పిల్ సిరీస్ అనౌన్స్‌మెంట్ వీడియోతో పాటే స్ట్రీమింగ్ డేట్‍ను కూడా జియోసినిమా ఓటీటీ వెల్లడించింది. జూలై 12వ తేదీన ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది.
పిల్ వెబ్ సిరీస్‍సు రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. రితేశ్ దేశ్‍ముఖ్‍తో పాటు పవన్ మల్హోత్రా, అన్షుల్ చౌహాన్, అక్షత్ చౌహాన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆర్ఎస్‍వీపీ పతాకంపై రోనీ స్క్రీవాలా ఈ సిరీస్‍ను నిర్మిస్తున్నారు.
బిగ్‍బాస్ ఓటీటీ సీజన్ 3 హిందీ రియాల్టీ షో తాజాగా షురూ అయింది. జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జూన్ 21వ తేదీన సీజన్ షురూ అయింది. బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సల్మాన్ ఖాన్ గత సీజన్ వరకు హోస్టింగ్ చేయగా.. ఈ స్థానంలో ఇప్పుడు అనిల్ కపూర్ వచ్చారు. ఓటీటీ కావడంతో 24 గంటల పాటు ఈ బిగ్‍బాస్ లైవ్ చూడొచ్చు. ఈ సీజన్‍లో 14 మంది కంటెస్టెంట్లు తలపడనున్నట్టు తెలుస్తోంది.