Anil Kapoor at HTLS 2022: హాలీవుడ్ యాక్టర్‌తో అనిల్ కపూర్ ఇంటర్వ్యూ.. మనవడితో తన బంధం గురించి చెప్పిన బాలీవుడ్ నటుడు-anil kapoor opens up about connecting with grandson vayu at htls 2022 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anil Kapoor At Htls 2022: హాలీవుడ్ యాక్టర్‌తో అనిల్ కపూర్ ఇంటర్వ్యూ.. మనవడితో తన బంధం గురించి చెప్పిన బాలీవుడ్ నటుడు

Anil Kapoor at HTLS 2022: హాలీవుడ్ యాక్టర్‌తో అనిల్ కపూర్ ఇంటర్వ్యూ.. మనవడితో తన బంధం గురించి చెప్పిన బాలీవుడ్ నటుడు

Anil Kapoor at HTLS 2022: బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్.. హిందుస్థాన్ టైమ్స్ సంస్థ నిర్వహించిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్‌కు విచ్చేశారు. ఇందులో భాగంగా ఆయన హాలీవుడ్ యాక్టర్ జార్జ్ క్లూనీతో ప్రత్యేక వీడియో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జార్జ్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు అనిల్.

హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్‌లో అనిల్ కపూర్

బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ 2022లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత, వృత్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుుకన్నారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో హాలీవుడ్ యాక్టర్ జార్జ్ క్లూనీ.. అనిల్ కపూర్‌ను ఇంటర్వ్యూ చేశారు. వీడియో ఛాట్ రూపంలో జరిగిన ఈ ముఖాముఖీలో బాలీవుడ్ నటుడు తన మనవడితో గల సంబంధాన్ని, కనెక్షన్‌ను తెలియజేశారు.

జార్జ్ క్లూనీతో సరదాగా సాగిన సంభాషణలో ఇద్దరూ పరస్ఫరం తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ప్రశ్నలను అడిగారు. తన మనువడితో ఎలాంటి రిలేషన్ ఉందని అనిల్‌ను జార్జ్ క్లూనీ అడుగ్గా.. వాయును తను బయటకు షికారుకు తీసుకెళ్లినప్పుడు మొదటిసారి ప్రకృతి మధ్య ఉన్నందుకు ఎలా స్పందించాడో వెల్లడించారు. అలాగే తాత అయినప్పుడు తన ఆనందాన్ని వివరించారు.

"నేను తండ్రిని అయ్యాక ఆ ప్రాసెస్‌ను ఎంజాయ్ చేయలేకపోయాను. అందుకు నాకు కొంత సమయం పట్టింది. ఇప్పుటికీ ఆ ప్రక్రియలోనే ఉన్నారు. నాకు మనువడు పుట్టినప్పుడు ఆస్ట్రిలాయాలో ఉన్నాడు. అతడితో నేను నెమ్మదిగా కనెక్ట్ అవ్వడం ప్రారంభించాను. వాడి పేరు వాయు. అంటే గాలి అని అర్థం. నేను వాడని వాక్‌కు తీసుకెళ్లాను. అందమైన వాతావరణం నడుమ వాయు ఆకాశం, సూర్యుడిని చూస్తూ తినడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రకృతికి వాడి తొలి పరిచయం అదే. ఆ వాతావరణానికి వాడు ఎలా రియాక్ట్ అవుతున్నాడో చూస్తే చాలా ఆశ్చర్యమేసింది. నేను నా పిల్లలతో కనెక్ట్ అవ్వడం కంటే కూడా నెమ్మదిగా వాడితో మరింత కనెక్ట్ అవుతున్నాను." అని అనిల్ కపూర్ తెలిపారు.

"సోనమ్ కపూర్-ఆనంద్ అహుజా వివాహం 2018 మేలో జరిగింది. అనంతరం ఆమె భర్తతో కలిసి లండన్ వెళ్లింది. అప్పటి నుంచి యూకే, భారత్ మధ్య చక్కర్లు కొడుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 20న వీరికి పండంటి మగపిల్లాడు పుట్టాడు. అతడికి వాయు అని పేరు పెట్టారు. ఈ ప్రయాణంలో మాకు సహకరించిన వైద్యులు, నర్సులు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఇది ప్రారంభం మాత్రమే" అని అనీల్ కపూర్ జార్జ్ క్లూనీకి తెలియజేశారు.

సంబంధిత కథనం