OTT Movies: ఈవారం ఓటీటీలోకి తెలుగులో వచ్చిన 10 సినిమాలు.. ఒక్కదాంట్లోనే 4.. ఒక్కటి తప్పా అన్ని ఫ్యామిలీతో చూసేయొచ్చు!
OTT Telugu Movies Release On This Week: ఓటీటీలోకి ఈ వారంలో సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి పది తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో తెలుగు సినిమాలతోపాటు ఇంగ్లీష్, హిందీ చిత్రాలు, వెబ్ సిరీసులు ఉన్నాయి. అలాగే ఒక్క ఓటీటీలోనే 2 అందుబాటులో ఉన్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
OTT Telugu Movies This Week: ఓటీటీల్లోకి కుప్పలుతెప్పలుగా సినిమాలు వచ్చినా సరే టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం తెలుగు మూవీస్ వైపే మొగ్గు చూపిస్తుంటారు. ఇతర భాషా చిత్రాలను ఆదరించిన తెలుగు సినిమాలను చూసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే, ఈ వారం ఓటీటీల్లోకి తెలుగు భాషలో పది సినిమాలు వచ్చాయి. వాటిలో తెలుగుతోపాటు ఇతర భాషా సినిమాలు, వెబ్ సిరీసులు కూడా ఉన్నాయి.
శివం భజే ఓటీటీ
హీరో అశ్విన్ బాబు నటించిన లేటెస్ట్ యాక్షన్ అండ్ క్రైమ్ థ్లిల్లర్ మూవీ శివం భజే. మల్టీ లేయర్స్‌తో తెరకెక్కిన శివం భజే రెండు ఓటీటీల్లో ఈవారంలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆగస్ట్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్, ఆహా రెండింట్లో శివం భజే ఓటీటీ రిలీజ్ అయింది.
హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ఓటీటీ
30 వెడ్స్ 21 ఫేమ్, హీరో చైతన్య రావు, హీరోయిన్ హెబ్బా పటేల్ జంటగా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ హనీమూన్ ఎక్స్‌ప్రెస్. బోల్డ్ అండ్ రొమాంటిక్ సీన్లతో హెబ్బా పటేల్ అదరగొట్టిన ఈ మూవీ ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో హనీమూన్ ఎక్స్‌ప్రెస్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ సినిమాను ఫ్యామిలీతో చూడలేం.
ఐసీ814: ది కాందహార్ హైజాక్ ఓటీటీ
హైజాక్ అండ్ సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన వెబ్ సిరీస్ ఐసీ814: ది కాందహార్ హైజాక్. తమన్నా లవర్ విజయ్ వర్మ, అరవింద్ స్వామి, కరణ్ దేశాయ్, ఉజ్వల్ గౌరహ వంటి నటీనటులు నటించిన ఈ సిరీస్ ఆగస్ట్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా హిందీతోపాటు తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది.
బడ్డీ ఓటీటీ
అల్లు శిరీష్ నటించిన లేటెస్ట్ ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ మూవీ బడ్డీ. డైరెక్టర్ సామ్ ఆంటోన్ తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయింది. గాయత్రి భరద్వాజ్, ప్రిషా సింగ్ రాజేష్ హీరోయిన్స్‌గా చేసిన బడ్డీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతోపాటు తమిళం, కన్నడ మలయాళం భాషల్లో ప్రీమియర్ అవుతోంది.
పురుషోత్తముడు ఓటీటీ
రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ పురుషోత్తముడు ఆహా ఓటీటీలో ఆగస్ట్ 29 నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. రామ్ భీమన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రరాష్ రాజ్, మురళీ శర్మ, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. హాసినీ సుధీర్ హీరోయిన్‌గా చేసింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాల ఓటీటీ
రీసెంట్‌గా టాలీవుడ్‌లో రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా ఆహా ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆగస్ట్ 26న ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమాలో ప్రణవ్ ప్రీతమ్, షాజ్ఞశ్రీ వేణున్ హీరో హీరోయిన్‌గా నటించారు. శ్రీనాథ్ పులకూరం దర్శకత్వం వహించారు.
మిగతా ఓటీటీ సినిమాలు
సారంగదరియా (తెలుగు సినిమా)- ఆహా ఓటీటీ- ఆగస్ట్ 31 నుంచి స్ట్రీమింగ్
గాడ్జిల్లా ఎక్స్ కాంగ్: ది న్యూ ఎంపైర్ (హాలీవుడ్ మూవీ)- జియో సినిమా ఓటీటీ (ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళం, మరాఠీ)- ఆగస్ట్ 29 నుంచి స్ట్రీమింగ్
కాడెట్స్ (హిందీ వెబ్ సిరీస్)- జియో సినిమా (హిందీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, మరాఠీ)
ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ ది పవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)
ఒక్కదాంట్లో నాలుగు
ఇలా ఈ వారంలో సినిమాలు, వెబ్ సిరీసులు పది తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో నాలుగు ఆహా ఓటీటీలో, జియో సినిమాలో రెండు, నెట్‌ఫ్లిక్స్‌లో రెండు, అమెజాన్ ప్రైమ్‌లో రెండు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇవన్నీ వీకెండ్‌కు ఫ్యామిలీతో చూసేందుకు బెస్ట్ ఆప్షన్.