OTT Korean Thriller: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తున్న బ్లాక్‌బస్టర్ కొరియన్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
OTT Korean Thriller: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి రాబోతోంది ఓ కొరియన్ థ్రిల్లర్ మూవీ. 2021లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఆ ఏడాది కొరియన్ మూవీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.
OTT Korean Thriller: ఓటీటీలోకి మరో కొరియన్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఈ సినిమా పేరు మిడ్‌నైట్. కొరియా నుంచి వచ్చే ఎలాంటి కంటెంట్ ను అయినా ఇక్కడి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్న వేళ.. థ్రిల్లర్ సినిమాలకు మరింత ఎక్కువ డిమాండ్ ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ మిడ్‌నైట్ మూవీ కూడా ఎంతో ఆసక్తి రేపుతోంది.
మిడ్‌నైట్ ఓటీటీ రిలీజ్ డేట్
కొరియాలో 2021లో రిలీజైన మూవీ మిడ్‌నైట్. ఈ సినిమాను లయన్స్‌గేట్ ప్లే ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది. జిన్ కీ-జూ, వీ హా-జూన్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమా ఆ ఏడాది బెస్ట్ కొరియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఎంతో మంది విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఇప్పుడీ సినిమా ఇండియాలో అడుగుపెడుతోంది. అయితే నేరుగా ఓటీటీలోకే వచ్చేస్తోంది. లయన్స్‌గేట్ ప్లే కొరియన్ సినిమాల జాబితాలో ఈ మిడ్‌నైట్ కూడా ఉంది. అక్టోబర్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. వచ్చే నెలలో ఏ తేదీన అన్నది సదరు ఓటీటీ త్వరలోనే అనౌన్స్ చేయనుంది.
మిడ్‌నైట్ స్టోరీ ఏంటంటే?
మిడ్‌నైట్ ఓ థ్రిల్లర్ మూవీ. ఇది కియోంగ్-మి అనే చెవిటి మహిళ చుట్టూ తిరిగే కథ. ఆమె ఓ సైన్ లాంగ్వేజ్ కౌన్సెలర్ గా ఓ కాల్ సెంటర్లో పని చేస్తూ ఉంటుంది. అయితే ఆమె అనుకోకుండా డో-సిక్ అనే ఓ సీరియల్ కిల్లర్ కు లక్ష్యంగా మారుతుంది. అతడు సో-జంగ్ అనే వ్యక్తిని చంపే సమయంలో కియోంగ్ చూస్తుంది. దీంతో ఆమెను కూడా చంపడానికి అతడు ప్రయత్నిస్తుంటాడు.
ఆ కిల్లర్ బారి నుంచి కియోంగ్ తోపాటు తన సోదరిని కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు హత్యకు గురైన సో-జంగ్ సోదరుడు జాంగ్ టక్. వీళ్లతోపాటు కియోంగ్ తల్లి కూడా వాళ్లతోపాటు చేరుతుంది. వీళ్లందరూ కలిసి ఆ సీరియల్ కిల్లర్ బారి నుంచి ఎలా తప్పించుకుంటారు? చివరికి అతన్ని ఎలా ఎదుర్కొంటారన్నది ఈ మిడ్‌నైట్ మూవీలో చూడొచ్చు.
బెస్ట్ కొరియన్ థ్రిల్లర్ మూవీస్ లో ఒకటిగా నిలిచిందీ మూవీ. ఓ-సెయుంగ్ క్వోన్ డైరెక్ట్ చేసిన మిడ్‌నైట్ మూవీలో జిన్ కీ-జూ, వీ హా-జూన్, పార్క్ హూన్, గిల్ హే-యియోన్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమాను అక్టోబర్ లో లయన్స్‌గేట్ ప్లేతోపాటు ఓటీటీప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ద్వారా కూడా చూడొచ్చు.
ఓటీటీలు వచ్చిన తర్వాత ఇండియాలోనూ కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు మంచి ఫాలోయింగ్ ఉంటోంది. అక్కడి సూపర్ హిట్ కంటెంట్ ను ఇంగ్లిష్ తోపాటు హిందీ, తెలుగు, తమిళంలాంటి భాషల్లో డబ్ చేస్తుండటంతో ఇక్కడి ప్రేక్షకులకు కూడా కొరియన్ డ్రామాలు చేరువయ్యాయి. అక్కడి నుంచి వచ్చి సూపర్ హిట్ అయిన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ సీజన్ 2 కూడా ఈ ఏడాది డిసెంబర్లో వస్తున్న విషయం తెలిసిందే.