Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..-korean movies ruled cannes film festival watch these movies on ott netflix prime video sonyliv ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Korean Movies In Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Hari Prasad S HT Telugu
May 16, 2024 07:30 PM IST

Korean Movies in Cannes: కొరియన్ మూవీస్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ సంపాదిస్తున్నట్లే కేన్స్ లోనూ దుమ్ము రేపాయి. మరి ఈ సినిమాలు ప్రస్తుతం ఏ ఓటీటీల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం.

కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..
కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Korean Movies in Cannes: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గతంలో కొన్ని కొరియన్ సినిమాలు దూసుకెళ్లాయి. అక్కడి టాప్ అవార్డులను సొంతం చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటున్న ఈ సినిమాలు కేన్స్ లోనూ విజయవంతమయ్యాయి. మరి అక్కడి జ్యూరీని మెప్పించిన ఆ కొరియన్ సినిమాలు ఏవి? వాటిని ప్రస్తుతం ఏయే ఓటీటీల్లో చూడొచ్చో ఇక్కడ చూడండి.

కేన్స్‌‌లో అవార్డులు గెలిచిన కొరియన్ మూవీస్

పారాసైట్ - సోనీలివ్

ఆస్కార్ విన్నింగ్ కొరియన్ మూవీ పారాసైట్. ప్రపంచంలో పేద, ధనిక వర్గాల మధ్య అంతరం ఎంతలా పెరిగిపోతోంది.. ఓ ధనికుడి కుటుంబంలో పనికి కుదిరిన ఓ పేద కుటుంబం తర్వాత ఆ ఇంటిని పూర్తిగా ఎలా ఆక్రమించేస్తుందన్నది ఈ సినిమాలో చూపించారు. ఈ మూవీకి కేన్స్ లో అత్యుత్తమ అవార్డు అయిన పాల్మె డోర్ రావడం విశేషం. ఈ సినిమాను సోనీలివ్ ఓటీటీలో చూడొచ్చు.

డెసిషన్ టు లీవ్ - ప్రైమ్ వీడియో

డెసిషన్ టు లీవ్ మూవీకి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. ఈ మూవీని పార్క్ చాన్-వుక్ డైరెక్ట్ చేశాడు. వరుస హత్యల కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఓ డిటెక్టివ్ చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

ఓల్డ్‌బాయ్ - ప్రైమ్ వీడియో

అసలు ఎలాంటి కారణం లేకుండా ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి 15 ఏళ్ల పాటు జైల్లో బంధిస్తారు. అతడు ఆ తర్వాత బయటకు వచ్చి వాళ్లపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడన్నది ఈ ఓల్డ్ బాయ్ మూవీ స్టోరీ. ఈ సినిమా కేన్స్ లో గ్రాండ్ ప్రి ప్రైజ్ గెలిచింది. ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

బ్రోకర్ - సోనీలివ్

బ్రోకర్ కూడా మరో బెస్ట్ కొరియన్ మూవీ. తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిన చిన్నారులకు కొత్త పేరెంట్స్ ను వెతికే ఇద్దరు వ్యక్తుల చుట్టూ తిరిగే కథే ఈ బ్రోకర్. ఈ సినిమాకు కేన్స్ లో ఎక్యుమెనికల్ జ్యూరీ ప్రైజ్, యాక్టర్ అవార్డులు వచ్చాయి. ఈ మూవీ సోనీలివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

సీక్రెట్ సన్‌షైన్ - నెట్‌ఫ్లిక్స్

భర్తను కోల్పోయిన ఓ మహిళ తన కొడుకుతో కలిసి అతని ఊరికే వెళ్లి జీవించాలని భావిస్తుంది. అయితే అక్కడ జరిగే మరో విషాదం ఆమెను మరింత కుంగదీస్తుంది. ఈ సీక్రెట్ సన్‌షైన్ సినిమాలో జియోన్ డి-యియోన్ నటనకుగాను ఉత్తమ నటి అవార్డు వచ్చింది. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.

పోయెట్రీ - ప్రైమ్ వీడియో

అల్జీమర్స్ తో బాధపడే ఓ వృద్ధురాలి చుట్టూ తిరిగే కథే ఈ పోయెట్రీ. ఈ సినిమాకు గ్రాండ్ ప్రి ప్రైజ్ తోపాటు ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 14న ప్రారంభమైంది. ఇది మే 25 వరకు కొనసాగనుంది. ఈసారి ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియాకు గేమ్ ఛేంజర్ నటి కియారా అద్వానీ ప్రాతినిధ్యం వహించనుండగా.. ఐశ్వర్య రాయ్, శోభితా ధూళిపాళ్లలాంటి వాళ్లు కూడా అక్కడికి వెళ్లారు.