Ooru Peru Bhairavakona OTT: ఓటీటీలోకి హారర్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ఊరు పేరు భైరవకోన.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Ooru Peru Bhairavakona OTT Streaming: యంగ్ హీరో సందీప్ కిషన్ తాజాగా నటించిన చిత్రం ఊరు పేరు భైరవకోన. సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఊరు పేరు భైరవకోన మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ అయింది. ఊరు పేరు భైరవకోన ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడనే వివరాల్లోకి వెళితే..
Ooru Peru Bhairavakona OTT Release: హీరో సందీప్ కిషన్, డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ఊరు పేరు భైరవకోన. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పించారు. ఊరు పేరు భైరవకోన చిత్రానికి బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో సందీప్ కిషన్‌కు జోడీగా వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్స్‌గా నటించారు.
అలాగే, ఊరు పేరు భైరవకోన సినిమాలో వెన్నెల కిశోర్, హర్ష చెముడు (వైవా హర్ష) కామెడీ పండించగా.. వడివుక్కరసి, పి రవిశంకర్ కీలక పాత్రలు పోషించారు. సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందించారు. అయితే ఎన్నో అడ్డంకులు దాటి, వాయిదాలు దాటి ఊరు పేరు భైరవకోన మూవీ ఎట్టకేలకు థియేటర్‌లో విడుదలైంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా పెయిడ్ స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఊరు పేరు భైరవకోన సినిమా శుక్రవారం అంటే ఫిబ్రవరి 16న థియేటర్‌లలో రిలీజైంది.
థియేటర్లలో విడుదలైన ఊరు పేరు భైరవకోన సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. సినిమా స్టోరీ, కాన్సెప్ట్ బాగున్నప్పటికీ టేకింగ్ అంతగా ఆకట్టుకోలేదని రివ్యూలు వచ్చాయి. కొన్ని చోట్ల హారర్, సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగున్నప్పటికీ రొటీన్ సీన్స్, డ్రామా బోర్ తెప్పించాయని ప్రేక్షకులు ఫీల్ అయ్యారు. ఇదిలా ఉంటే ఊరు పేరు భైరవకోనకు ఎన్నో అడ్డంకులు వచ్చినప్పటికీ ప్రీ రిలీజ్ బిజినెస్, డిజిటల్, శాటిలైట్స్ రైట్స్ మంచి ధరకే అమ్ముడుపోయాయని ఇన్ సైడ్ టాక్.
ఈ నేపథ్యంలో ఊరు పేరు భైరవకోన ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఏంటనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఉన్న బజ్ ప్రకారం సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవకోన సినిమాను ప్రముఖ ఓటీటీ జీ5 సంస్థ భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. అలాగే సినిమాను రెండు నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని మేకర్స్ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే, మూవీపై వచ్చే టాక్, బాక్సాఫీస్ కలెక్షన్ల ప్రకారం సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారన్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఊరు పేరు భైరవకోన సినిమాను జీ5లో 2 నెలలు లేదా 45 రోజుల తర్వాతే స్ట్రీమింగ్ చేస్తారని సమాచారం. కలెక్షన్స్, టాక్ ద్వారా స్ట్రీమింగ్ డేట్‌లో మార్పులు రావొచ్చు. అయితే ఈ ఓటీటీ స్ట్రీమింగ్, పార్టనర్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఊరు పేరు భైరవకోన సినిమా ఓటీటీ హక్కులను జీ5 మాత్రమే కాకుండా ఆహా కూడా సొంతం చేసుకుందని మరో టాక్ వినిపిస్తోంది.
ఇలా చాలా సినిమాలకు రెండు ఓటీటీలు హక్కులు కొనుగోలు చేసినట్లు టాక్ వచ్చింది. ఇప్పుడు ఆ జాబితాలో ఊరు పేరు భైరవకోన నిలిచింది. మరి ఊరు పేరు భైరవకోన ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి. ఇదిలా ఉంటే సుమారు రూ. 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఊరు పేరు భైరవకోన సినిమాకు దర్శకత్వం వహించిన వీఐ ఆనంద్ ఇదివరకు సందీప్ కిషన్‌తో టైగర్ మూవీ తెరకెక్కించారు. అలాగే నిఖిల్‌తో ఎక్కడికి పోతావ్ చిన్నవాడా దర్శకత్వం వహించారు.
టాపిక్