NNS April 1st Episode: పిల్లల కోసం రక్తం చిందించిన మిస్సమ్మ.. అరుంధతికి వచ్చేసిన శక్తులు.. రివర్స్ అయిన కారు​-nindu noorella saavasam april 1st episode arundhathi get powers tour cancel nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns April 1st Episode: పిల్లల కోసం రక్తం చిందించిన మిస్సమ్మ.. అరుంధతికి వచ్చేసిన శక్తులు.. రివర్స్ అయిన కారు​

NNS April 1st Episode: పిల్లల కోసం రక్తం చిందించిన మిస్సమ్మ.. అరుంధతికి వచ్చేసిన శక్తులు.. రివర్స్ అయిన కారు​

Sanjiv Kumar HT Telugu
Apr 01, 2024 11:48 AM IST

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 1వ తేది ఎపిసోడ్‌‌లో పిల్లలను ఎలాగైనా ఆపాలని దెబ్బ తగిలించుకుని రక్తం కారేలా చేసుకుంటుంది భాగమతి. మరోవైపు అరుంధతికి శక్తులు వచ్చేస్తాయి. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 1వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 1వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam April 1st Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 1st April Episode) పిల్లల్ని సమ్మర్​ క్యాంప్​కి తీసుకుని వెళ్లడానికి స్కూల్​ ప్రిన్సిపాల్​ అమర్​ ఇంటికి వస్తుంది. మనోహరి పిల్లలను తొందరపెట్టి కిందికి తీసుకువస్తుంది. ఒక్కసారి అమ్మ ఫొటోకి దండం పెట్టుకుంటామని పిల్లలు అమర్​ రూమ్​కి వెళ్తారు. మిస్సమ్మ కూడా మేడమ్​ ఫొటో చూద్దామని అమర్​ రూమ్​లోకి వెళ్లబోతుంది. కానీ, మిస్సమ్మను నానామాటలు అని లోపలకి వెళ్లకుండా ఆపుతుంది మనోహరి.

కిందపడిన భాగమతి

చేసేదేంలేక బాధపడుతూ కిందకి వస్తుంది మిస్సమ్మ. ప్రిన్సిపాల్​ మీ కోసమే వెయిట్​ చేస్తున్నారని పిల్లలని తొందర పెడుతుంది మనోహరి. పిల్లలు బాధపడుతూ బయలుదేరతారు. వాళ్లని ఎలాగైనా ఆపాలని స్నాక్స్​ మరిచిపోయారంటూ కిందపడి దెబ్బ తగిలించుకుంటుంది మిస్సమ్మ. భాగమతి కిందపడటంతో పిల్లలు, అమర్​, అమర్​ తల్లిదండ్రులు, రాథోడ్​.. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందని కంగారు పడతారు. కాలికి దెబ్బతగిలి రక్తం రావడం చూసి మిస్సమ్మ కాలికి అమర్​ కట్టుకడతాడు.

మనోహరిని కోప్పడిన అమర్ తల్లి

పిల్లలు శుభమా.. అని క్యాంప్​కి బయలుదేరుతుంటే తనకి ఇలా జరిగిందంటూ బాధపడుతుంది మిస్సమ్మ. తనవల్ల పిల్లలు క్యాంప్​కి వెళ్లలేకపోతున్నారంటుంది. దానికి మనోహరి మండిపడుతూ.. నీకు దెబ్బతగిలితే పిల్లల క్యాంప్​‌కు వెళ్లడం ఎందుకు క్యాన్సల్​ అవుతుంది. నువ్వేం ఇంట్లో మనిషివి కాదు అంటుంది మనోహరి. దానికి అమర్​ తల్లి మనోహరిని కోప్పడుతుంది. పిల్లలు బయలుదేరుతుంటే ఇలా జరగడమేంటని బాధపడుతుంది.

వెనక్కి వెళ్లిన కారు

కానీ, మనోహరి ఆ మాటలు పట్టించుకోకుండా పిల్లలను బలవంతంగా తీసుకెళ్లి కారులో కూర్చోబెడుతుంది. పిల్లలు ఏడుస్తూ ఉంటే అరుంధతి కోపంతో.. దేవుడా.. నా పిల్లలు ఏం పాపం చేశారని ఈ శిక్ష. నువ్వు నిజంగా ఉంటే వాళ్లు ఆ గేట్​ కూడా దాటొద్దు అంటుంది. పౌర్ణమి ఘడియలు ప్రారంభమవడంతో అరుంధతి మాట నిజమై కారు వెనక్కి వస్తుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే ప్రిన్సిపాల్​ స్వయంగా పిల్లల్ని కిందకి దించి సమ్మర్​ క్యాంప్​ క్యాన్సిల్​ అయ్యిందని చెబుతుంది.

నీ రక్తం చిందించావా

మనోహరి మాట్లాడుతున్నా వినకుండా ప్రిన్సిపాల్​ వెళ్లిపోతుంది. పిల్లలు సంతోషంతో గంతులు వేస్తారు. మిస్సమ్మ, రాథోడ్​ రామ్మూర్తి దగ్గరకు వస్తారు. పిల్లలకోసం దెబ్బ తగిలించుకున్నావా మిస్సమ్మ అంటాడు రాథోడ్​. ఆ ఇంటి కన్నీళ్లు తుడవడం కోసం నీ రక్తం చిందించావా అంటాడు రామ్మూర్తి. ఆ మనోహరిని ఆపడం కోసం ఏమైనా చేస్తాను అనుకున్నా గానీ, పిల్లల కోసం ఇలా చేస్తానని అనుకోలేదు నాన్న అంటుంది భాగమతి.

ఎలాంటి శక్తులు

మనోహరిని ఇంకొక్క రోజు ఆపితే చాలని ఓ ప్లాన్​ చెబుతుంది. ఆ ప్లాన్​ని అమలు చేయడానికి తండ్రిని ఉదయాన్నే అమర్​ ఇంటికి రమ్మని చెప్పి వెళ్తుంది భాగమతి. పౌర్ణమి రోజు తనకు వచ్చే శక్తులు ఎలాంటివో తెలుసుకోవాలనుకుంటుంది అరుంధతి. చిత్రగుప్తుడిని ఎంత అడిగినా చెప్పకపోవడంతో ఆలోచిస్తూ కూర్చుంటుంది. అసలు పౌర్ణమి రోజు అరుంధతికి ఏ శక్తులు రానున్నాయి? మనోహరిని ఎదుర్కోడానికి మిస్సమ్మ వేసిన ప్లాన్​ ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఏప్రిల్ 2న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner