Naveen Polishetty: రామయణంలో నవీన్ పోలిశెట్టి?: నితేశ్ తివారీతో రెండోసారి
Naveen Polishetty in Ramayana: బాలీవుడ్‍లో రూపొందనున్న రామాయణం మూవీ గురించి మరో రూమర్ బయటికి వచ్చింది. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలివే..
Naveen Polishetty: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేశ్ తివారీ రూపొందించనున్న రామాయణం సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. రామాయణంలో శ్రీరాముడిగా హీరో రణ్‍బీర్ కపూర్, సీతాదేవిగా స్టార్ నటి సాయి పల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యశ్ ఇప్పటికే ఖరారయ్యారు. మహా ఇతిహాసం రామాయణాన్ని వెండితెరపై వైభవంగా చూపించేందుకు దర్శకుడు నితేశ్ తివారీ సిద్ధమవుతున్నారు.
రామాణయణంలో కీలకమైన శ్రీరాముడి తమ్ముడు లక్ష్మణుడి పాత్ర ఎవరు చేస్తారన్న విషయంపై ఆసక్తి నెలకొంది. అయితే, ఈ లక్ష్మణుడి పాత్ర కోసం టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో మూవీ టీమ్ చర్చలు జరుపుతోందని రూమర్లు బయటికి వచ్చాయి. అతడు ఈ పాత్రకు సూటవుతారని దర్శకుడు నితేశ్ తివారీ భావిస్తున్నారని తెలుస్తోంది. లుక్ టెస్ట్ తర్వాత ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
నితేశ్ తివారీతో మళ్లీ!
బాలీవుడ్ జనాలకు కూడా చాలా మందికి నవీన్ పోలిశెట్టి తెలుసు. హిందీలోనూ అతడు కొన్ని సీరియళ్లలో నటించారు. తెలుగులో ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన నవీన్.. ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో హీరోగా స్థిరపడ్డారు. జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో స్టార్ అయ్యారు. అయితే, 2019లో సుశాంత్ సింగ్ రాజ్‍పుత్ నటించిన బాలీవుడ్ చిత్రం చిచోరేలో నవీన్ పోలిశెట్టి కీలకపాత్ర చేశారు. అతడి నటనకు ప్రశంసలు దక్కాయి. చిచోరే చిత్రానికి దర్శకత్వం వహించింది నితేశ్ తివారీనే. ఇక, రామాయణం చిత్రంలో లక్ష్మణుడి పాత్రను నవీన్ చేస్తే.. నితిన్‍తో రెండో సినిమా చేసినట్టవుతుంది.
రామాణయం కోసం నటీనటులందరినీ మరో రెండు వారాల్లో ఫైనల్ చేయాలని దర్శకుడు నితేశ్ తివారీ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. మార్చిలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నారట. ‘రామాయాణం’ మూడు భాగాలుగా తీసుకురావాలని నితేశ్ భావిస్తున్నారని టాక్.
రామాయణం చిత్రంలో హనుమంతుడి పాత్రను సన్నీ డియోల్ చేయనున్నారని బజ్ ఉంది. దశరథుడి పాత్రకు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ పేరును కూడా మూవీ టీమ్ ఆలోచిస్తోందని ఇటీవల రూమర్ వచ్చింది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‍ను కూడా ఓ పాత్ర కోసం పరిగణనలోకి తీసుకుంటున్నారని టాక్ ఉంది. ఈ మూవీ గురించి వచ్చే నెలలో ఓ స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఫుల్ బజ్ ఉండటంతో రూమర్లు మాత్రం క్రమంగా వస్తూనే ఉన్నాయి.
యానిమల్ సినిమా తర్వాత రణ్‍బీర్ కపూర్ మరే ప్రాజెక్ట్ అంగీకరించలేదు. పూర్తి సమయాన్ని రామాయణంకే కేటాయించనున్నారు.
రామాయణాన్ని వెండితెరపై గ్రాండ్‍స్కేల్‍లో చూపించాలని దర్శకుడు నితేశ్ తివారీ భావిస్తున్నారు. ఏడాది నుంచి ఆయన ఈ చిత్రం పనుల్లోనే నిమగ్నమై ఉన్నారు. విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న డీఎన్ఈజీ పీఎఫ్‍ఎక్స్ కంపెనీని రామాయణం కోసం ఆయన ఎంపిక చేసుకున్నారు.
షూటింగ్ మొదలు ఆరోజే!
రామాయణం షూటింగ్ మార్చి 2వ తేదీన గుర్గావ్‍లోని ఫిల్మ్ సిటీలో మొదలవుతుందని టాక్ నడుస్తోంది. వేసవిలోనే యుద్ధం సన్నివేశాలు లాంటి భారీ సీన్ల చిత్రీకరణ పూర్తి చేయాలని టీమ్ భావిస్తోందని తెలుస్తోంది.
టాపిక్