Political Thriller OTT: ఓటీటీలోకి తెలుగు పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ సీక్వెల్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో..ఎప్పుడంటే?-nara rohit political thriller movie prathinidhi 2 will be premiere on aha ott soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Political Thriller Ott: ఓటీటీలోకి తెలుగు పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ సీక్వెల్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో..ఎప్పుడంటే?

Political Thriller OTT: ఓటీటీలోకి తెలుగు పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ సీక్వెల్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో..ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
Sep 23, 2024 12:47 PM IST

Political Thriller OTT: నారా రోహిత్ హీరోగా న‌టించిన ప్ర‌తినిధి 2 థియేట‌ర్ల‌లో రిలీజైన మూడు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్ర‌తినిధి 2 మూవీకి మూర్తి దేవ‌గుప్త‌పు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

పొలిటికల్ థ్రిల్లర్ ఓటీటీ
పొలిటికల్ థ్రిల్లర్ ఓటీటీ

Political Thriller OTT: ప్ర‌తినిధి 2 మూవీతో దాదాపు నాలుగేళ్ల త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు నారా రోహిత్‌. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి మూర్తి దేవ‌గుప్త‌పు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2014లో రిలీజై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న ప్ర‌తినిథి మూవీకి సీక్వెల్‌గా ప్ర‌తినిధి 2 వ‌చ్చింది. ఫ‌స్ట్ పార్ట్ స్థాయిలో సీక్వెల్ ప్రేక్ష‌కులను మెప్పించ‌లేక‌పోయింది. మే నెల‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ నెగెటివ్ టాక్‌ను మూట‌గ‌ట్టుకుంది.

ఆహా ఓటీటీలో..

థియేట‌ర్ల‌లో రిలీజైన నాలుగు వారాల త‌ర్వాత ప్ర‌తినిధి 2 మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది. ఆహా ఓటీటీలో ఈ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విష‌యాన్ని ఆహా ఓటీటీ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. అయితే రిలీజ్ డేట్ మాత్రం వెల్ల‌డించ‌లేదు. సెప్టెంబ‌ర్ 27న ఆహా ఓటీటీలో ప్ర‌తినిధి 2 విడుద‌ల కాబోతున్న‌ట్లు చెబుతోన్నారు.

మ‌ణిశ‌ర్మ త‌న‌యుడు...

ప్ర‌తినిధి 2 మూవీలో జిషు సేన్ గుప్తా, స‌చిన్ ఖేడ్క‌ర్, దినేష్ తేజ్‌, సిరి లెల్లా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మ‌ణిశ‌ర్మ త‌న‌యుడు మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ ఈ థ్రిల్ల‌ర్ మూవీకి మ్యూజిక్ అందించాడు.

జ‌ర్న‌లిస్ట్ చేత‌న్ క‌థ‌...

చే అలియాస్‌ చేతన్ (నారా రోహిత్‌) నిజాయితీపరుడైన ఫ్రీలాన్స్ జ‌ర్న‌లిస్ట్‌. నిజాల‌ను ధైర్యంగా బయటపెడుతుంటాడు. ఎస్‌సీసీ ఛానెల్‌కు సీఈవోగా ప‌నిచేస్తుంటాడు చేత‌న్‌. ప్రజా శ్రేయస్సు పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపతి (సచిన్ ఖేడ్‌కర్)పై అటాక్ జరుగుతుంది. ఈ దాడిలో సీఎం మరణిస్తారు. సీఏం హ‌త్య‌తో చేత‌న్‌కు సంబంధం ఉంద‌ని పోలీసులు అత‌డిని అరెస్ట్ చేస్తారు.

అస‌లు సీఏంను ఎవ‌రు చంపారు? ఈ ఎటాక్‌కు చేత‌న్‌కు ఏ విధ‌మైన‌ లింక్ ఉంది? చే ఇన్వేస్టిగేష‌న్‌లో ఎలాంటి నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి? ప్ర‌జాప‌తి కొడుకు విశ్వ (దినేష్ తేజ్‌), సీఏం ఓఎస్‌డీ సిరితో(సిరిలెల్లా) పాటు మ‌రికొంత మంది నిజ‌రూపాల‌ను చేత‌న్ ఏ విధంగా బ‌య‌ట‌పెట్టాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌. కాన్సెప్ట్ ఇంట్రెస్టింట్‌గా ఉన్నా ద‌ర్శ‌కుడు స‌రిగ్గా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేయ‌లేక‌పోవ‌డంతో ఈ సినిమా ఫెయిలైంది. ప్ర‌తినిధి 2లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌నితీరుపై రాసిన ప‌లు పొలిటిక‌ల్ డైలాగ్స్ హాట్‌టాపిక్‌గా మారాయి.

సుంద‌ర కాండ‌...

ప్ర‌తినిధి త‌ర్వాత నారా రోహిత్...సుంద‌ర‌కాండ పేరుతో రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ చేయ‌బోతున్నాడు. నారా రోహిత్ కెరీర్‌లో 20వ సినిమాగా తెర‌కెక్కుతోన్న సుంద‌ర‌కాండ‌తో వెంక‌టేష్ నిమ్మ‌ల‌పూడి ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోన్నాడు. ఈ సినిమాలో వృత్తి వాఘ‌ని, శ్రీదేవి విజ‌య్ కుమార్ హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. ద‌ళ‌ప‌తి విజ‌య్ ది గోట్ లో ఉప‌యోగించిన డీఏజ్ టెక్నాల‌జీని సుంద‌ర‌కాండ మూవీలో వాడిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

టాపిక్