Most Popular Personalities: సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్.. తెలుగులో మోస్ట్ పాపులర్ టీవీ పర్సనాలిటీస్ వీళ్లే
Most Popular Personalities: తెలుగులో మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీస్ లిస్ట్ రిలీజ్ చేసింది ఆర్మాక్స్ మీడియా. ఈ లిస్టులో ఐదుగురు చోటు దక్కించుకోగా.. అందులో సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్ లాంటి వాళ్లు ఉన్నారు.
Most Popular Personalities: తెలుగు వాళ్లకు బాగా ఇష్టమైన టీవీ పర్సనాలిటీస్ ఎవరో తేలిపోయింది. తాజాగా ఆర్మాక్స్ మీడియా జనవరి, 2024 కోసం రిలీజ్ చేసిన ఈ జాబితాలో ఐదుగురు ప్రముఖ టీవీ పర్సనాలిటీస్ కు చోటు దక్కింది. ప్రముఖ యాంకర్లు ప్రదీప్, సుమతోపాటు జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్రలాంటి వాళ్లు ఉన్నారు.
మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీస్
ఆర్మాక్స్ క్యారెక్టర్స్ ఇండియా లవ్ పేరుతో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో జనవరి నెలకుగాను తెలుగులో మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీస్ జాబితాను రిలీజ్ చేశారు. ఇందులో తొలి స్థానంలో యాంకర్ ప్రదీప్ నిలవడం విశేషం. ఈటీవీలో వచ్చే ఢీ డ్యాన్స్ షోకుగాను ప్రదీప్ టాప్ లో ఉన్నాడు. ఇక తర్వాతి స్థానంలో తెలుగు వాళ్లు బాగా ఇష్టపడే కమెడియన్ సుడిగాలి సుధీర్ ఉన్నాడు.
ఇతడు కూడా ఢీ షోతోపాటు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీల్లాంటి షోలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు. అప్పుడప్పుడూ సినిమాల్లోనూ మెరుస్తున్న సుధీర్ కు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక మూడో స్థానంలో తన పంచ్ లతో కడుపుబ్బా నవ్వించే హైపర్ ఆది నిలిచాడు. అతడు కూడా ఢీ, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీల్లాంటి షోలతో పాపులర్ అయ్యాడు.
నాలుగో స్థానంలో ప్రతి తెలుగు ఇంటికి తన యాంకరింగ్ తో దగ్గరైన సుమ నిలిచింది. సుమ యాంకరింగ్ అంటే ఇష్టపడని తెలుగు వారి ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఆమె క్యాష్ షోకి గాను ఈ లిస్ట్ లో నిలిచింది. ఇక ఐదో స్థానంలో మరో కమెడియన్ చమ్మక్ చంద్ర ఉన్నాడు. సినిమాల ద్వారానే తెలుగు వారికి పరిచయమైనా.. తర్వాత జబర్దస్త్ షోతో ప్రతి ఇంటికీ అతడు చేరువయ్యాడు.
మోస్ట్ పాపులర్ ఫిక్షన్ క్యారెక్టర్స్
ఇక తెలుగులో వచ్చే సీరియల్స్ ద్వారా అందరికీ దగ్గరైన ఫిక్షనల్ క్యారెక్టర్లలో ఎక్కువ మంది ఇష్టపడే ఐదుగురి పేర్లను కూడా ఆర్మాక్స్ మీడియా వెల్లడించింది. ఇందులో టాప్ 5లో కృష్ణ, రిషి, నయని, పంచమి, కావ్య ఉన్నారు. స్టార్ మాలో వచ్చే కృష్ణా ముకుందా మురారి సీరియల్లో కృష్ణ పాత్ర మోస్ట్ పాపులర్ ఫిక్షన్ క్యారెక్టర్ గా నిలవడం విశేషం.
ఇక ఆ తర్వాతి స్థానంలో గుప్పెడంత మనసు రిషి ఉన్నాడు. మూడో స్థానంలో త్రినయని సీరియల్లోని నయని నిలిచింది. నాలుగో స్థానంలో నాగ పంచమి సీరియల్లో వచ్చే పంచమి ఉంది. ఐదో స్థానంలో టాప్ సీరియల్ అయిన బ్రహ్మముడిలోని కావ్య పాత్ర నిలవడం విశేషం. నిజానికి ఈ ఐదు సీరియల్స్ తెలుగునాట చాలా పాపులర్ అయ్యాయి. టీఆర్పీ రేటింగ్స్ లోనూ ఈ షోలు ముందుంటాయి.
తెలుగులో వచ్చే సీరియల్స్ లో చాలా వరకూ స్టార్ మా, జీ తెలుగు సీరియల్సే టాప్ 10లో ఉంటాయి. అందులోనూ బ్రహ్మముడి సీరియల్ కొన్ని నెలలుగా టాప్ 1లో కొనసాగుతూ వస్తోంది. అలాగే గుప్పెడంత మనసు కూడా బాగానే ఆదరణ సంపాదించింది.