Miss Shetty Mr Polishetty on OTT: రేపే ఓటీటీలోకి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ మూవీ: స్ట్రీమింగ్ వివరాలివే
Miss Shetty Mr Polishetty on OTT: ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ఓటీటీలోకి అడుగుట్టేందుకు రెడీ అయింది. రేపు (అక్టోబర్ 5) ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది.
Miss Shetty Mr Polishetty on OTT: ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి బ్లాక్‍బాస్టర్ అయింది. సెప్టెంబర్ 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన లవ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో అంచనాల కంటే ఎక్కవ కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ఎదురుచూశారు. ఆ తరుణంలో రానే వచ్చింది. రేపు (అక్టోబర్ 5) ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.
‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రేపు (అక్టోబర్ 5) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ రేపు (అక్టోబర్ 5) అర్ధరాత్రి 12 గంటలకు నెట్‍ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభం అవుతుంది.
‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ సినిమాకు పి.మహేశ్ బాబు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ విపరీతంగా ఆకట్టుకుంది. అనుష్క కూడా మెప్పించారు. ఈ సున్నితమైన కథను ఎంటర్‌టైనింగ్‍గా తెరకెక్కించటంతో మహేశ్ బాబు సక్సెస్ అయ్యారు. మురళీ శర్మ, అభినవ్ గోమటం, నాజర్, సోనియా దీప్తి, జయసుధ, తులసి ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. గోపీ సుందర్, రధన్ సంగీతం అందించారు.
లండన్‍లో ప్రముఖ చెఫ్‍గా ఉండే అన్విత రళి శెట్టి (అనుష్క శెట్టి).. పెళ్లి చేసుకోకుండానే తల్లి కావాలని ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో ఇండియాకు వస్తారు. స్టాండప్ కమెడియన్ అయిన సిద్ధు పోలిశెట్టి (నవీన్ పోలిశెట్టి)ని అన్విత కలుస్తారు. అతడి లక్షణాలు అన్వితకు నచ్చుతాయి. దీంతో తాను తల్లి అయ్యేందుకు సాయం చేయాలని సిద్ధును అన్విత కోరతారు. అయితే, అన్వితను సిద్ధు ప్రేమిస్తారు. మరి చివరికి ఏం జరిగింది? సిద్ధు ప్రేమ గెలిచిందా అనేదే ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ ప్రధానమైన కథగా ఉంది. కథ మొత్తంగా సరదాగా ఎంటర్‌టైనింగ్‍గా సాగుతుంది. అయితే, క్లైమాక్స్‌లో భావోద్వేగం కూడా బాగా పండింది.
సంబంధిత కథనం
టాపిక్