Miss Shetty Mr Polishetty OTT: మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి మూవీ ఓటీటీ ప్లాట్‍ఫామ్ లాక్-miss shetty mr polishetty ott platform locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Miss Shetty Mr Polishetty Ott: మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి మూవీ ఓటీటీ ప్లాట్‍ఫామ్ లాక్

Miss Shetty Mr Polishetty OTT: మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి మూవీ ఓటీటీ ప్లాట్‍ఫామ్ లాక్

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 07, 2023 03:41 PM IST

Miss Shetty Mr. Polishetty OTT: ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఖరారైంది. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి నటించిన ఈ సినిమా నేడు థియేటర్లలో రిలీజ్ అయింది.

Miss Shetty Mr Polishetty OTT: మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి ఓటీటీ ప్లాట్‍ఫామ్ లాక్
Miss Shetty Mr Polishetty OTT: మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి ఓటీటీ ప్లాట్‍ఫామ్ లాక్

Miss Shetty Mr. Polishetty OTT: స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ సినిమా నేడు (సెప్టెంబర్ 7) థియేటర్లలో రిలీజ్ అయింది. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా, కామెడీతో ఈ చిత్రం సూపర్‌గా ఉందనే టాక్ ప్రేక్షకుల నుంచి వస్తోంది. రివ్యూలు కూడా ఎక్కువ శాతం ఈ సినిమాకు పాజిటివ్‍గానే ఉన్నాయి. ముఖ్యంగా ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ చిత్రంలో నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉన్నాయనే ప్రశంసలు వస్తున్నాయి. కాగా, ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ఓటీటీ హక్కుల గురించి సమాచారం వెల్లడైంది.

‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‍పామ్ ‘నెట్‍ఫ్లిక్స్’ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ మంచి ధరకే ఈ చిత్ర ఓటీటీ హక్కులను ‘నెట్‍ఫ్లిక్స్’కు ఇచ్చినట్టు సమాచారం. థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి స్ట్రీమింగ్‍కు రానుంది. అక్టోబర్ రెండో వారంలో ఈ సినిమాలో ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.

‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ చిత్రానికి యంగ్ డైరెక్టర్ పి.మహేశ్ బాబు దర్శకత్వం వహించారు. క్లీన్ లవ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరును కొందరు ప్రశంసిస్తున్నారు. ఫన్‍తో పాటు ఎమోషన్లను బాగా చూపించారని అంటున్నారు. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి యాక్టింగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో మురళీ శర్మ, అభివన్ గోమటం, నాజర్, జయసుధ, తులసి, సోనియా దీప్తి కీలకపాత్రలు పోషించారు.

‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ సినిమాకు రధన్, గోపీసుందర్ సంగీతం అందించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిరవ్ షా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ చేశారు.

‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’కి బాలీవుడ్ చిత్రం జవాన్ పోటీగా ఉంది. జవాన్ హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ రిలీజ్ అవటంతో బాక్సాఫీస్ వద్ద సౌత్‍లోనూ రెండు చిత్రాలు పోటీ పడుతున్నాయి. ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ రిలీజ్ అయింది.

IPL_Entry_Point