Waltair Veerayya Update: మెగాస్టార్ న్యూ ఇయర్ సర్‌ప్రైజ్ అదిరింది.. వాల్తేరు వీరయ్య వీడియో విడుదల-megastar chiranjeevi shares bts video of 4th song from waltair veerayya ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Megastar Chiranjeevi Shares Bts Video Of 4th Song From Waltair Veerayya

Waltair Veerayya Update: మెగాస్టార్ న్యూ ఇయర్ సర్‌ప్రైజ్ అదిరింది.. వాల్తేరు వీరయ్య వీడియో విడుదల

Maragani Govardhan HT Telugu
Jan 01, 2023 08:00 PM IST

Waltair Veerayya Update: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాకు సంబంధించిన న్యూ ఇయర్ అప్డేట్‌ ఇచ్చారు మెగాస్టార్. ఈ సినిమాకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.

మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి

Waltair Veerayya Update: మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. గతేడాది ఆచార్య, గాడ్‌ఫాదర్ చిత్రాలతో సందడి చేసిన చిరు.. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో ముందుకు రాబోతున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో పోషించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్లు, పాటలు విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా మరో సరికొత్త అప్డేట్ ఇచ్చారు మన మెగాస్టార్.

ఇంతకుముందు శ్రీదేవి సాంగ్‌ను లీక్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తాజాగా ఈ సినిమాలో మరో పాటకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఈ పాట ఎలా షూట్ చేశారో, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు లాంటి విశేషాలను ఆయన పంచుకున్నారు.

"హాయ్ ఫ్రెండ్స్ వాల్తేరు వీరయ్యలోని రెండో సాంగ్ డిసెంబరు 17న పూర్తి చేసుకున్నాం. ఫ్రాన్స్‌లోని తూలుస్ అనే నగరంలో ఈ సాంగ్ తీశాం. వాతావరణం అంతా చలిగానే ఉంది. ఈ పాటకు షూటింగ్ బాగా జరిగింది. అందరూ చాలా కష్టపడ్డారు. ఈ సాంగ్‌లో నాకు నచ్చింది ఒకటుంది. నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ అని సాగే లైన్లు నాకు బాగా నచ్చాయి. త్వరలోనే లిరికల్ వీడియోను విడుదల చేస్తాం. ఈ లోకేషన్ నాకు చాలా బాగా నచ్చింది." అంటూ న్యూ ఇయర్‌కు వీడియోను విడుదల చేసి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు మెగాస్టార్.

బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మన మెగాస్టార్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా చేసింది. రవితేజ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.