Bobby on Waltair veerayya: వాల్తేరు వీరయ్య ఇంటర్వెల్‌లో ఫ్యాన్స్‌కు పండగే.. 8 నిమిషాలు పూనకాలే.. డైరెక్టర్ బాబీ స్పష్టం-director bobby says waltair veerayya will be big feast for fans ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Director Bobby Says Waltair Veerayya Will Be Big Feast For Fans

Bobby on Waltair veerayya: వాల్తేరు వీరయ్య ఇంటర్వెల్‌లో ఫ్యాన్స్‌కు పండగే.. 8 నిమిషాలు పూనకాలే.. డైరెక్టర్ బాబీ స్పష్టం

Maragani Govardhan HT Telugu
Dec 28, 2022 06:35 AM IST

Bobby on Waltair veerayya: వాల్తేరు వీర్యయ చిత్రబృందం మంగళవారం నాడు విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన డైరెక్టర్ బాబీ.. సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇంటర్వెల్‌లో ఈ సినిమా ఫ్యాన్స్‌కు పూనకాలే తెప్పిస్తుందని అన్నారు.

డైరెక్టర్ బాబీ
డైరెక్టర్ బాబీ

Bobby on Waltair veerayya: మెగాస్టార్ చిరంజీవి నుంచి సినిమా వస్తుందంటే అభిమానులకే పండగే. అందులోనూ మంచి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారంటే అంచనాలకు హద్దే ఉండదు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఆయన నటించిన వాల్తేరు వీరయ్య సరిగ్గా అలాంటి వినోదాన్ని అందించనుంది. ఇందులో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటించారు. శృతిహాసన్ కథానాయికగా నటించింది. మంగళవారం నాడు మీడియా సమావేశం నిర్వహించిన చిత్రబృందం ఆసక్తకిర విషయాలను పంచుకుంది.

ఈ సందర్భంగా మాట్లాడిన డైరెక్టర్ కేఎస్ రవీంద్ర(బాబీ) వాల్తేరు వీరయ్య చిత్రం అంచనాలకు మించి ఉంటుందని చెప్పారు. "నా ఐదో చిత్రాన్ని ఎవరితో తెరకెక్కించాలి అనుకుంటున్న సమయంలో మెగస్టార్ చిరంజీవి గారి నుంచి నాకు మెసేజ్ వచ్చింది. మొదట ఆయనకు కథ చెప్పినప్పుడు ఆరంభం, క్యారెక్టరైజేషన్ బాగుందన్నారు. కానీ స్టోరీ మెరుగవ్వాలని తెలిపారు. ఎందుకంటే కథలో ఎమోషనల్ ఉండాలని ఆయన కోరుకునేవారు. దీంతో నేను కథపై పనిచేయడం ప్రారంభించాం. సెకాండాఫ్‌ కోసం పనిచేస్తున్న సమయంలో లాక్డౌన్ ప్రకటించారు. ఆ సమయంలో విలన్ పోర్షన్లను, క్లైమాక్స్ రాస్తున్నా." అని బాబీ చెప్పారు.

"లాక్డౌన్ సమయంలో పనిచేస్తున్నప్పుడు తనకు రవితేజను తీసుకోవాలనే ఆలోచన వచ్చిందని చెప్పారు. క్లైమాక్స్ రాస్తున్న సమయంలో అప్పుడే నాకు మంచి ఐడియా వచ్చింది. రవితేజను పరిచయం చేస్తే బాగుంటుందని అనిపించింది. నిర్మాత నవీన్ గారికి కాల్ చేసి ఈ విషయం చెప్పా. ఆయన చాలా సంతోషించారు. అనంతరం చిరంజీవి గారిని కలిశాం. ఆయనకు రెండు వెర్షన్లను వినిపించాం. ఆయనకు రవితేజ ఉన్న వెర్షన్ నచ్చింది. ఆరు నెలల స్క్రిప్ట్ వర్క్ తర్వాత రవితేజ గారిని కలిశాను. తనకు కథ, పాత్ర నచ్చి సింగిల్ సిట్టింగ్‌లోనే ఒకే చెప్పారు." అని దర్శకుడు అన్నారు.

సినిమా చూస్తున్నంత సేపు ప్యాన్స్‌కు ఫుల్ ఫీస్ట్ ఉంటుందని బాబీ అన్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సమయంలో వచ్చే 8 నిమిషాలు థియేటర్లలో అభిమానులకు పూనకాలను తెప్పిస్తుందని స్పష్టం చేశారు. మెగాస్టార్ పెద్ద యుద్ధంలోకి దిగితే ఎలా ఉంటుందో.. ఈ సినిమా అలాగే ఉంటుందని అన్నారు.

బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మన మెగాస్టార్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా చేసింది. రవితేజ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్